For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కొరకు రేగుపండ్ల యొక్క ఆరోగ్యప్రయోజనాలు

By Derangula Mallikarjuna
|

ప్లమ్(రేగు పండ్లు) ఒక అద్భుతమైన కలర్ఫుల్ మరియు రుచికరమైన పండు. ఈ పండ్లును తాజావి పచ్చి అలాగే తినవచ్చు లేదా ఎండినవి కూడా తినవచ్చు. అలాగే ఈ ప్లమ్ (రేగు)పండ్ల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఎండిన పండ్లను ప్రూనెలుగా సూచిస్తారు. ఈ రేగు పండ్లలో అత్యధిక న్యూట్రీషియన్స్ విటమిన్ డి, ఎ, కెలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రేగు పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ గొప్ప మూలంగా ఉంది. ముఖ్యంగా తటస్థ ఆక్సిజెన్ రాడికల్ దీన్ని సూపరాక్సైడ్ యానియన్ అని పిలుస్తారు మరియు ఇది శరీరంలో కొవ్వు ఆక్సిజన్ ఆధారిత నష్టంను నివారించడంలో సహాయపడుతుంది.

ప్రపంచవ్యాపతంగా రేగు పండ్లు 2000 రకాలకు పైగా ఉన్నట్లు చెప్పబడింది. ప్లమ్(రేగు)పండ్ల యొక్క ఆరోగ్యప్రయోజనాలు విస్తృతంగా పరిశోధించబడింది మరియు ఫలితాలు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు కనుగొనబడింది. ప్లమ్ ఎండిన తర్వాత ప్రూనేగా పిలవబడే ఈ డ్రైప్రూట్ లో కాపర్ మరియు బోరాన్ పుష్కలంగా ఉండే ఒక గొప్ప మూలంగా సూచిస్తారు. ఈ రెండు మూలకాలు , బోలు ఎముకల వ్యాధి నిరోధిస్తుంది. అలాగే ఇందులో ఇనులిన్ అనే ఫైబర్ మూలకం ఉంటుంది, ఇది ప్రేగు బాక్టీరియా గుర్తిస్తే అంత జీర్ణవ్యవస్థలో మరింత ఆమ్ల వాతావరణం చేస్తుంది .

ప్లమ్ (రేగుపండ్లు) గుండెకు మంచి ఆరోగ్యకరం అని చూపబడ్డాయి. వీటిలో ఉండే మినిరల్స్ అధిక రక్తపోటను నిర్వహించడానికి మరియు స్ట్రోక్ ప్రమాదం తగ్గిస్తుంది .కొన్ని రకాల ప్లమ్ ఫ్రూట్స్ లో ముదుఎరుపు నీలం రంగు కలిగి ఉంటాయి, వీటిలో యాంథో సైనిన్ అని పిలుస్తారు, హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి క్యాన్సర్ కణాలతో పోరాడు క్యాన్సర్ రాకుండా సంరక్షిస్తుంది. ప్లమ్ మరియు ప్రూనెలలోని సామర్థ్యం వల్ల ఐరన్ కంటెంట్ శరీరంలో శోషింపబడుతుందని కొన్ని పరిశోధలతో ప్రచురించబడ్డాయి. ప్లమ్ (రేగు )లో డిఫరెంట్ వింటమిన్స్ బి కాంప్లెక్స్ కాంపౌండ్స్ నియాసిన్, విటమిన్ బి6 మరియు ఫినాలిక్ యాసిడ్ కాంపౌడ్స్ ఇవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వు అణువులు విచ్ఛిన్నం చేసి, జీర్ణం చేస్తాయి. ప్లమ్ (రేగు )పండ్లలో ఇతర ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

మీ గుండెను రక్షిస్తుంది:

మీ గుండెను రక్షిస్తుంది:

ప్లమ్(రేగు)పండ్లలో విటమిన్ కె ఉండి, శరీరం అంతటా అనసవరమైన రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. కాబట్టి, మంచి రక్తపోటును నిర్వహించడం ద్వారా హార్ట్ రేట్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో, ఇంకా పొటాషియం కూడా ఉండి, అధిక రక్తపోటు నిర్వహించడానికి , బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నిరోధించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ నిరోధించడంలో సహాయపడుతుంది.

కొన్ని ప్లమ్ ఎరుపు నీలరంగు పండ్లను , యాంథోసైనిన్స్ అనేవి, హనికరమైన ఫ్రీరాడికల్స్ నుండి క్యాన్సర్ నిరోధించడానికి రక్షణ కల్పిస్తుంది . అలాగే ఈ రేగు పండ్లలోని బీటా కెరోటిన్ వివిధ రకాల క్యాన్సర్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఓరల్ క్యావిటి క్యాన్సర్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

కళ్ళు మరియు దృష్టి

కళ్ళు మరియు దృష్టి

ఆరోగ్యకరమైన కళ్ళకు మరియు మంచి దృష్టికి విటమిన్ ఎ చాలా అవసరం . ఇది శ్లేష్మం పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది .ఇందులో జియాక్సిథిన్ అనే ఒక ముఖ్యమైన డైటరీ ఫైబబర్ రెటీనా కు చాలా మంచిది. ఇది హానికరమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది

రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది

డ్రైప్లమ్ ను ప్రూనేగా పిలువడే ఈ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్లమ్ లోని న్యూట్రీషనల్ ప్రయోజనాలు తీసుకొన్న ఆహారం జీర్ణం అవ్వడానికి అవసరం అయ్యే డైటరీ ఫైబర్ ను అంధిస్తుంది. మరియు ఇందులో సోర్బిటాల్ మరియు ఇసాటిన్ ఈ రెండు అంశాలు జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. దాంతో మీ శరీరం వివిధ రకాల ఆహారంను జీర్ణంపచేసే సామర్థ్యం కలిగి ఉండి, మలబద్దకాన్ని నివారిస్తుంది.

.యాంటిఆక్సిడెంట్స్

.యాంటిఆక్సిడెంట్స్

ప్లమ్స్ లో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగికరం. ఫోలిఫినాలిక్ యాంటీఆక్సిడెంట్ : లూటిన్, క్రిప్టోక్సాథిన్ మరియు జియాక్సిథిన్ హానికరమైన ఆక్సిజన్ పరిమాణంను తగ్గిస్తుంది.ఇది శరీరానికి వచ్చే వ్యాధులు మరియు వృద్ధాప్యం ప్రభావాలు సృష్టించే ROS కాంపౌండ్స్ నుండి శరీరంను రక్షిస్తుంది .

ప్లమ్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ప్లమ్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది శరీరం ఆరోగ్యకరమైన కణాజాలానికి చాలా అవసరం అవుతుంది. మరియు ఇది బలమైన వ్యాధినిరోధక వ్యవస్థకు అవసరం అవుతుంది. జలుబు మరియు ఫ్లూ నివారించడానికి ఈ సీజన్ లో అదనపు విటమిన్ సి ని పొందడానికి ప్లమ్స్ ఒక మంచి ఎంపిక. మరియు పునరావృత చెవి ఇన్ఫెక్షన్ బాధపడుతున్న ప్రజలకు సహాయకారిగా ఉండవచ్చు .

కొలెస్ట్రాల్ నియంత్రణ

కొలెస్ట్రాల్ నియంత్రణ

ప్లమ్ లో ఉండే సోలబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ ను తక్కువ చేయడానికి ప్రేగులో అదనపు పిత్తం మరియు అది విసర్జిచడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. బైల్ లివర్ డైజెస్టివ్ ఫ్యాట్ ను కలిగి ఉంటుంది .

Story first published: Saturday, December 14, 2013, 23:30 [IST]
Desktop Bottom Promotion