For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజూ తినాల్సిన 10 ఉత్తమ ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్స్

|

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవనశైలి చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా తీసుకొనే ఆహారంలో నిర్లక్ష్యం, ఏదో ఒకటి తినేసి, పొట్టనిప్పేసుకుంటే చాలులే అనుకుంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పౌష్టికాహారం లోపంతో శరీరంలో ఆరోగ్యపరంగా ఎన్నో అసమతుల్యతలు ఏర్పడుతాయి. అంతే కాదు, సరైనా ఆహారం తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు బరువు పెరుగుతున్నారు. మరి ఈ అదనపు బరువు తగ్గించుకోవాలంటే, కొన్ని ప్రత్యేకమైన ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్స్ పొట్టలోకి తోసేయడం వల్ల శరీరంకు అవసరం అయ్యే ప్రోటీన్స్ అందుతాయి, అదే సమయంలో ఫ్యాట్ ను కూడా బర్న్ చేస్తాయి.

ఇలా రెండు రకాలుగా ప్రయోజనాలను అందించే కొన్ని ఉత్తమ ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్స్ గురించి ఈ క్రింద లిస్ట్ ద్వారా వివరించడం జరిగింది. ఈ ఆర్టికల్లో మన ఏకాగ్రత అంతా ఫ్యాట్ బర్న్ చేసే వెజిటేబుల్స్ మీదే...చాలావరకూ ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ గా ఉన్నాయి. లేదా మనం ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు ఖచ్చితంగా ఫుడ్ డైట్ తోనే ఫ్యాట్ బర్న్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లైతే ఈ క్రింది బెస్ట్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ మీద ఓ లుక్ వేయండి....

బ్రొకోలీ:

బ్రొకోలీ:

గ్రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇందులో సూపర్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే అనేక రకాల విటమిన్స్ వల్ల ఇది ఒక నేచులర్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను వైయిట్ లాస్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. ఇందులో జింక్, ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. అంతే కాదు విటమిన్ ఎ మరియు కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను రెగ్యులేట్ చేస్తుంది. మెటబాలిజం రేట్ కు బూస్ట్ వంటిది. కాబట్టి, బరువు తగ్గడానికి ఇది ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.

బీన్స్:

బీన్స్:

గ్రీన్ బీన్స్ లో ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది ఒక ఎఫెక్టివ్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్,ఇందులో వివిధ రకాల ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంది. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. గ్రీన్ బీన్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. అంతే కాదు, ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. హై షుగర్ లెవల్స్ వల్ల ఊబకాయం మరియు అధిక బరువుకు దారితీస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో గ్రీన్ బీన్స్ చేర్చితే అధిక బరువు తగ్గించుకోవచ్చు.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి మరో హెల్తీ వెజిటేబుల్స్ ఆస్పరాగస్. ఇది బరువు తగ్గించడం హైలీ ఇంప్రెస్సీవ్ వెజిటేబుల్. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మెటబాలిజం రేటును పెంచుతుంది. అదనపు బరువు తగ్గించుకోవాలంటే, ఆస్పరాగస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్ లో విటమిన్ ఎ, సి మరియు కె, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి ఒక హెల్తీ వెజిటేబుల్. అంతే కాదు, మెటబాలిజంకు బూస్ట్ వంటిది, అంతే కాదు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ .

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఇందులో పొటాషియం మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్, ఫ్యాట్ బర్న్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

పచ్చిమిర్చి:

పచ్చిమిర్చి:

గ్రీన్ చిల్లీ పురాత కాలం నుండి వీటిని మన ఒక ఔషద దినుసుగా లేదా మొక్కగా ఉపయోగిస్తున్నాము, బరువు తగ్గించుకోవడానికి, ఇది ఒక ఎఫెక్టివ్ వెయిట్ లాస్ ఫుడ్.

బీట్ రూట్:

బీట్ రూట్:

ప్రపంచంలో మనం తీసుకొనే ఆహారాల్లో బీట్ రూట్ ఒక హెల్తీ వెజిటేబుల్ . ఎందుకంటే, ఇందులో వివిధ రకాల డైటరీ నైట్రేట్ కలిగి ఉంటుంది. ఇది బ్లడ్ ఫ్లోను రెగ్యులేట్ చేస్తుంది. మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇంకా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకణాలను నివారిస్తుంది.

గ్రీన్ పీస్:

గ్రీన్ పీస్:

పచ్చిబఠానీలో ఫైటోన్యూట్రీషియన్స్, మెగ్నీషయం మరియు పొటాషియం, గ్రీన్ పీస్ లో కలిగి ఉండటం వల్ల ఇవి మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మనల్ని ఫిట్ గా ఉంచుతుంది. మరియు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఒక పవర్ ఫుల్ డిటాక్స్ ఫుడ్. ఇది ఆరోగ్యకరంగా మెటబాలిజం రేటును ప్రోత్సహిస్తుంది. బరువును కంట్రోల్లో ఉంచుతుంది.

కాలే:

కాలే:

ఇది ఒక హెల్తీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్. కాలేలో విటమిన్ కె, విటమిన్ సి మరియు ఇతర అసరం అయ్యే మినిరల్స్ కలిగి ఉండటం వల్ల శరీరంను హెల్తీ గా ఉంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ చేసే గుణాలు కూడా ఎక్కువే...

English summary

10 Best Fat Burning Vegetables You Must Eat Daily

Lifestyles today are undergoing massive transformations with a majority of people laying heightened focus on diet habits and foods they consume. Weight loss is perhaps the most extensively discussed topics today. With this in hindsight, we look at specific vegetables that burn fat.
Story first published: Wednesday, September 17, 2014, 14:51 [IST]
Desktop Bottom Promotion