For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ గా ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవి

|

మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలను అందివ్వడం మాత్రమే కాదు, ఇది మనస్సును కూడా ప్రశాంత పరుస్తుంది. మరియు పోషణ అందిస్తుంది. ప్రస్తుత కాలంలో మన జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగమైపోయింది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈరోజు మీకు అందిస్తున్న ఈ ఆర్టికల్లో కొన్ని నేచురల్ ఫుడ్స్ ఒత్తిడిని నేచురల్ గా తగ్గిస్తాయి.

ఈ సూపర్ ఫుడ్స్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, ఇవి మొదడను ప్రశాంత పరుస్తుంది. ఇవి మన దిన చర్యలో వివిధ రకాలుగా మనకు వినియోగపడుతాయి. అంతే కాదు, మన శరీరం యొక్క ఆరోగ్యానికి కూడా చాలా అద్భుతంగా సహాయపడుతాయి. నేచురల్ గా ఒత్తిడి తగ్గించే ఆహారాలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన సూపర్ ఫుడ్స్ ను మీకు ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ సూపర్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చి నేచురల్ గా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.....

పాలు:

పాలు:

ఆశ్యర్యపోయారా మళ్ళీ? ఎందుకంటే, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి అవసరం అయ్యే సెరోటోనిన్ యొక్క ఏర్పటుకు పాలలోని ట్రిప్టోఫాన్ సహాయపడుతుంది. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.

బాదం:

బాదం:

బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం మరియు విటమిన్ బి12 వల్ల ఈ స్ట్రెస్ రిలీఫ్ జాబితాలో చేర్చబడింది. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి మరియు ఆందోళను దరంగా ఉంచడానికి సహాయడపతుంది.

బెర్రీస్:

బెర్రీస్:

బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

సెరల్స్ (ధాన్యాలు):

సెరల్స్ (ధాన్యాలు):

సెరల్స్ , ధాన్యాలలో ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం సమయంలో ధాన్యాలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే వైపుగా పనిచేస్తుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ లో ఫోలిక్ ఆసిడ్స్ అధిక శాతంలో ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీ శరీరం ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొన్ని విటమిన్స్, మినిరల్స్ తీసుకోవడం వల్ల మనస్సు స్థిమితంగా ఉండేలా చేస్తుంది.

అవొకావడో:

అవొకావడో:

అవొకాడోలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెంటల్ హెల్త్ కు మరియు అలాగే మొత్తం నెర్వస్ హెల్త్ కు చాలా అవసరం. అవొకాడో లో విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వల్ల రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రెగ్యులర్ గా వేధించే ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

మన శరీరానికి అవసరమయ్యే సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపర్చేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మైండును ప్రశాంతంగా ఉంచడానికి ఓట్స్ తినడం ఒక గొప్ప మార్గం.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో ఫైబర్ తక్కువ, అరటిపండ్లు గ్యాస్ ను తగ్గిస్తుంది.దాంతో ప్రశాంతగా మరియు ఒత్తిడి లేకుండా గడపడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అది మానవ మనస్సును ఒక ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

చాక్లెట్స్ అంటానే ఏది పడితే అవి తినేయడం కాదు. చాక్లెట్స్ లో డార్క్ చాక్లెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ఉండే anandamine అనే కంటెంట్ ద్వారా మెదడు విశ్రాంతి మరియు ఒత్తిడి లేకుండా మెదడులోని డోపమైన్ లెవల్స్ ను పెంచుతుంది.విటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ - డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది.

English summary

10 Foods That Reduce Stress Naturally

The foods we eat not just nourish our physical body but our mind too. Stress is a part and parcel of life and everybody faces varied levels of stress at almost every phase in their lives. In this article, we look at the foods that reduce stress naturally.
Story first published: Tuesday, August 5, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion