For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చిమిర్చిలో మనకు తెలియని ఆరోగ్యరహస్యాలు

|

మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి , ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరపలను మనము వాడుతాం . పచ్చిమిరపలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ లో చేర్చారు. మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు. మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. ఆర్డినరీ ఇండియన్ గ్రీన్ చిల్లీలోని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుంటే ఒక్కింత ఆశ్చర్యం కలగకమానదు.

చాలా వరకూ సగటు ఇండియన్స్ గ్రీన్ చిల్లీలను తీసుకోవడం అలవాటుటా ఉంటుంది. చిల్లీ పెప్పర్ లో(క్యాప్సికమ్)లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే, నార్మల్ గ్రీన్ చిల్లీలో కూడా ఉన్నాయి. మన ఇండియన్ గ్రీన్ చిల్లీస్ లో ఉండే, మనకు తెలియని అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే వంటల్లో కారం పొడిని ఉపయోగించడం కంటే, పచ్చిమిర్చిని చేర్చడం ఎప్పుడు మంచిదని భావిస్తుంటారు. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.

మిరపకాయలో ఇంత ఘాటు ఎందుకుంటుందంటే వీటిలో క్యాప్‌సైసిన్ (8-మిథైల్-ఎన్ -వనిల్లైల్-6-నోనెనామిడ్) మరియు అనేక సంబంధిత రసాయనాలు భాగం వహిస్తాయి, వీటన్నింటినీ కలిపి క్యాప్‌సైసినాయిడ్స్ అంటారు. విపరీతమైన మంటను కలిగించే ఆయుధంగా ఉపయోగించే పెప్పర్ స్ప్రేలో క్యాప్‌సైసిన్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కారంతో కళ్ళలోనూ, ముక్కుల్లోనూ నీళ్లు తెప్పించే మిరపకాయలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మిరపకాయలన్నింటిలో కారం ఇచ్చే రసాయనం 'కాప్సైసిస్‌‌' అనే అల్కలాయిడ్‌ వుంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు. మిరపలో కారంతోపాటు విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమిరపకాయలు బాగా తినేవారిలో కొన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు, పచ్చిమిరపలో మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం...

క్యాన్సర్ బారీ నుండి రక్షణ కల్పిస్తుంది

క్యాన్సర్ బారీ నుండి రక్షణ కల్పిస్తుంది

గ్రీన్ చిల్లీస్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. దాంతో క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఏజింగ్ ప్రొసెస్ ను కూడా నిధానం చేస్తుంది.

వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

ఇండియన్ గ్రీన్ చిల్లీస్ లో విటమిన్ సి కూడా అధికంగా ఉంది. బ్లాక్ అయిన్ నాసికా ద్వారాలు ఓపెన్ అయ్యేందుకు సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

చర్మ రక్షణకు గొప్పగా సహాయపడుతుంది

చర్మ రక్షణకు గొప్పగా సహాయపడుతుంది

గ్రీన్ చిల్లీస్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని నేచురల్ స్కిన్ ఆయిల్స్ ను ఉత్పత్తి చేయడానికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి, మీరు స్పైసీ ఫుడ్ తిన్నా మీకు మంచి అందాన్ని అందిస్తుంది.

జీరో క్యాలరీలు

జీరో క్యాలరీలు

ముఖ్యంగా గ్రీన్ చిల్లీస్ లో జీరో క్యాలరీలను కలిగి ఉంటుంది. మిరపకాయ తింటే సాధారణంగా నోరు మంటపుడుతుంది. కాని కడుపులో మంట పుట్టడంతోపాటు అందులో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించేస్తుందని తాజాగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. మిరపకాయ తినడంతో శరీరంలో పుట్టే వేడి వలన శరీరంలోని కెలొరీలను పెంచి కొవ్వును కరిగిస్తుందని పరిశోధకులు తెలిపారు.

పురుషులు తప్పనిసరిగా తినాల్సినవి ఇవి

పురుషులు తప్పనిసరిగా తినాల్సినవి ఇవి

పురుషులు పచ్చిమిర్చిని తప్పనిసరిగా ఎందుకు తినాలంటే, గ్రీన్ చిల్లీ ప్రొస్టేట్ క్యాన్సర్ బారీన పడకుండా కాపాడుతుంది. పురుషులు గ్రీన్ చిల్లీ తినడం వల్ల ప్రోస్టేట్ సమస్యలను దూరంగా ఉంచుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

అధిక బరువుతో బాధపడే అలాగే డయాబెటిస్ ఉన్నవారు చిల్లీస్ తినడం వల్ల పాజిటివ్ ఫలితాలను చూసినట్టు తాస్మానియా విశ్వవిద్యాలయం తెలిపింది. గ్రీన్ చిల్లీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని తినేసి, పచ్చిమిర్చి తినాలని కాదు. అయితే ఇది ఉన్న షుగర్ ను కంట్రోల్ చేస్తుందని అర్ధం.

తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది

తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది

మిరపకాయలోని పెప్పరిన్ అనే మూలకం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కారణంగా మరింత టేస్ట్ బడ్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం. మరియు అపానవాయువు, అజీర్ణం, విరేచనాలు, మలబద్ధకం మరియు ఆమ్లత వీటివల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇందులోని అదనపు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈసమస్యలన్నింటిని నిరోధించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకోసం, మీరు తయారు చేసే వంటల్లో ఒక టేబుల్స్ స్పూన్ పెప్పర్ పౌడర్ ను జోడించండి . ఇది వంటలకు ఫ్లేవర్ ను జోడించడంతో పాటు కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

మంచి మూడ్ ను అందించడంలో సహాయపడుతుంది

మంచి మూడ్ ను అందించడంలో సహాయపడుతుంది

పచ్చిమిర్చి మెదడులోని ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిమీద ప్రభావం చూసి మన మూడ్ ను మార్చుతుంటుంది. ఒక స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మీ మనస్సు ఉత్సాహంగా మరియు జలస్ గా ఉంటే, అప్పుడు అది అనుకోకుండా అలా జరిగిందని అనుకోకండి.

లంగ్ క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తుంది

లంగ్ క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తుంది

గ్రీన్ చిల్లీ ఏవిధంగా ఊపిరితిత్తులను కాపాడుతుండే ఇప్పటకీ తెలియదు కానీ, పచ్చిమిర్చి లంగ్ క్యాన్సర్ ను నివారించండో గొప్పగా సహాయపడుతుందని, లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే లక్షణాలు వీటిలో ఉన్నాయని అంటారు. ముఖ్యంగా స్మోకర్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను దూరంగా ఉంచుతుంది

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను దూరంగా ఉంచుతుంది

గ్రీన్ చిల్లీలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఈ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు. వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా చర్మం ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

ఐరన్ ను నిల్వచేస్తుంది

ఐరన్ ను నిల్వచేస్తుంది

ముఖ్యంగా ఇండియన్ ఉమెన్స్ కు గ్రీన్ చిల్లీ ఆరోగ్యపరంగా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతున్నారో వారు గ్రీన్ చిల్లీస్ నుండి నేచురల్ గా ఐరన్ పొందుతారు.

English summary

11 Health Benefits Of Indian Green Chillies

When we talk about the health benefits of chilli peppers, we usually imagine all kinds of exotic chillies. It is an established fact that bell peppers or capsicum are rich in antioxidants and thus superfoods. However, even the ordinary green chilli we chew on along with our food is not to be left out. The health benefits of Indian green chillies will take you by surprise.
Story first published: Tuesday, April 22, 2014, 13:37 [IST]
Desktop Bottom Promotion