For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గించి స్లిమ్ గా మార్చే జీరో క్యాలరీ ఫుడ్స్

|

రోజంతా తింటుండాలి కానీ ఒక్క క్యాలరీ కూడా శరీరానికి చేయకూడదు?అధిక బరువుకు దారి తీయకూడదు. మరి అదెలా సాద్యం?అవును ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకొన్నప్పుడు మీ కల నిజంగానే నెరవేరుతుంది. ఈ ఆహారాలు బరువు పెరగనివ్వవు కానీ మీ ఆకలి కోరికలు తీర్చుతాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లోనూ చాలా వరకూ జీరో క్యాలరీ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మీ పొట్టపు నింపుతాయి . ఈ పొట్టను నింపే ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాలి.

ప్రతి రోజూ రెగ్యులర్ గా భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత జీరో క్యాలరీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల భోజనం కానీ, లేదా డిన్నర్ కానీ మీరు ఎక్కువగా తీసుకోవల్సిన అవసరం రాదు. మీకు ఎక్కువ తినాలనిపించదు. అయినా కూడా మీకు ఆహారం మీద కోరికలున్నప్పుడు ఈ జీరో క్యాలరీ ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మీకే మంచిది. జీరో క్యాలరీ ఫుడ్స్ అన్నింటిలో చాలా వరకూ నీటిశాతం ఎక్కుగా ఉంటుంది. అందువల్లే ఇటువంటి జీరో క్యాలరీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల పొట్ట నింపుతుంది మరియు క్యాలరీలు తక్కువ.

అయితే ఈ జీరో క్యాలరీ ఫుడ్స్ తీసుకొనేటప్పుడు వీటితో పాటు మరే ఇతర ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఉదాహరణకు: మష్రుమ్ మరియు బెల్ పెప్పర్స్ లో క్యాలరీలు ఉండవు. ఇవి జీరో క్యాలరీ ఫుడ్స్. అయితే, వీటిని చీజ్ తో నింపిన పిజ్జా, బర్గర్ వంటి ఫ్యాట్ ఫుడ్స్ మీద టాపింగ్ గా వేసుకొని తినడం సరికాదు . కాబట్టి, మీరు త్వరగా బరువు తగ్గి, స్లిమ్ గా మార్చే జీరోక్యాలరీఫుడ్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి వాటిని ఎంపిక చేసుకోండి..

మష్రుమ్స్

మష్రుమ్స్

మష్రుమ్స్ లో విటమిన్ డి మరియు సెలీనియయం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. మష్రుమ్ జీరో క్యాలరీ ఫుడ్. కాబట్టి, వీటిని క్రీమ్ మరియు చీజ్ వంటి కాంబినేషన్లే ఎప్పటికి తినకండి.

కీరదోసకాయ

కీరదోసకాయ

కీరదోసకాయ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్. ఇందులో ఎక్కువ నీటిశాతం ఉంది. అంతే కాదు ఫైబర్ కూడా పుష్కలంగా ఉండి తిన్న వెంటనే పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాదు మీకు అవసరం అయ్యే విటమిన్ కె మరియు పొటాషియం దీని నుండి ఎక్కువగా పొందవచ్చు.

ఆస్పరాగస్

ఆస్పరాగస్

ఆస్పరాగస్ లో క్యాలరీలు లేవు కానీ, ఇది రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యం కూడా. వీటి నుండి విటమిన్ ఎ మరియు ఫొల్లేట్ ను పుష్కలంగా పొందవచ్చు.

వాటర్ మెలోన్

వాటర్ మెలోన్

వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ పొట్టను నింపుతుంది కానీ మీ నడుము కొలతను మాత్రం పెరగనివ్వదు.

కెల్ప్

కెల్ప్

కెల్ప్ ఇది ఒక సీ వెజిటేబుల్. ఇందులో చాలా వరకూ జీరో క్యాలరీలు. కానీ విటమిన్ కె అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఇంకా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ పొట్టను నింపడం మాత్రమే కాదు రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది.

టమోటో

టమోటో

టమోటోలలో లైకోపిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇంకా వాటర్ కంటెంట్ కూడా అధికమే. అందుకే వీటిని సలాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవచ్చు.

సెలరీ

సెలరీ

క్రంచీగా మరియు రుచికరమైన సెలరీలో క్యాలరీలు లేవు. కానీ విటమిన్ కె అధికంగా ఉంటుంది. సెలరీలో కూడా అధిక వాటర్ కంటెంట్ ఉంటుంది.

బ్రొకోలీ

బ్రొకోలీ

బ్రొకోలీ ఒక సూపర్ వేజిటేబుల్. ఇది యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ రిచ్ గా ఉంటుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో చాలా వరకూ క్యాలరీలు లేవు. కానీ చాలా అద్భుతంగా పొట్టనింపే ఫుడ్.

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ పండ్లు ఎక్కువ విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ తో నిండి ఉంటుంది. సిట్రస్ పండ్లు అంటే ఆరెంజ్, నిమ్మ వంటివి మీకు అవసరమయ్యేంత ఫైబర్ ను అందిస్తుంది. అదే విధంగా యాంటీఆక్సిడెంట్స్ ను అంధిస్తుంది.

బెల్ పెప్పర్స్

బెల్ పెప్పర్స్

బెల్ పెప్పర్స్ యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి కు ఒక పవర్ హౌస్ వంటిది . ఇందులో ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక న్యూట్రీషియన్లు నిండి ఉంటుంది.

గుమ్మడి

గుమ్మడి

వాటర్ కంటెంట్ అధికంగా ఉండే మరో వెజిటేబుల్స్ గుమ్మడి. ఇందులో ఎక్కువ విటమిన్స్ మరియు ఫోటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. అంతే కాదు , క్యాలరీలు కూడా తక్కువే.

లెట్యూస్

లెట్యూస్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఇది. ఆకుకూరలు, మస్టర్డ్ గ్రీన్స్, కేలా వంటివాటిలో విటమిన్ కె మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గించడానికి అద్బుతంగా సహాయపడుతాయి. కానీ బరువు పెరగనివ్వవు.

English summary

12 Zero Calories Foods That Fill You Up!

What if you could munch all day long and yet not gain a single calorie extra? This idyllic situation can come true if and only if you choose the right kind of foods. There are many zero calorie foods that fill you nicely. If you have these filling foods with no calories, you could practically be eating all day.
Story first published: Wednesday, July 23, 2014, 16:08 [IST]
Desktop Bottom Promotion