For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో రోగనిరోధకతను పంచే 15సూపర్ వెజిటేబుల్స్

|

రోజూ మన శరీరం ఎన్నో రోగాల బారి నుండి కాపాడబడుతుంది. నిత్యం ఎన్నో రోగక్రిముల నుండి రక్షింపబడుతున్నాము. ఈ ప్రక్రియ అనునిత్యం మన జీవితంలో ఒక భాగం. ఇవన్నీ మన శరీరధారుడ్యాన్ని బట్టి, మంచి అలవాట్లను బట్టి రోగనిరోధక శక్తి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను మనం దృఢపరచుకోవడానికి కొన్ని నియమాలు, అలవాట్లు పాటించాలి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. చలి, చల్లగాలు, వల్ల మన శరీరం, సాధారణ జలుబు, దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఈ సీజన్ లో చాలా మంది ప్రజలు జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో అలా అనారోగ్యం పాలు కాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకొనే సమయం వచ్చింది .

శీతాకాలంలో చలితో పోరాడటానికి మరియు ఆరోగ్యంగా గడపడానికి మీరు మీ వ్యాధినిరోధక శక్తిని మరింత బలంగా పెంచుకోవాలి. ఇటువంటి సాధారణ ఆనారోగ్యాల నుండి బయటపడటానికి మీరు కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యకంగా జీవించగలరు. ముఖ్యంగా రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ గా ఉండే ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ చేర్చుకోవాలి. ఇవి వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు విటర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ , జబ్బుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి.

అందుకోసం వింటర్లో ప్రత్యేకంగా మనం తీసుకోవల్సిన కొన్ని వెజిటేబుల్స్ లిస్ట్ ను మీకు అందిస్తున్నాం. వీటిని వింటర్లో ఖచ్చితంగా తినాలి. అయితే ఈ లిస్ట్ లోని వెజిటేబుల్స్ వింటర్లో మాత్రమే కాదు, మిగిలిన సీజన్లలో కూడా తీసుకోవచ్చు. వ్యాధినిరోధక స్థాయి స్థిరంగా ఉంచుకోవాలని కోరుకొనే వారు వీటిని అన్ని సీజన్లలోనూ తీసుకోవచ్చు. అయితే వీటి అవసరం వింటర్లో ఎక్కువ కాబట్టి, వింటర్లో ఖచ్ఛితంగా తీసుకోవాలి.

మరి మనల్ని వ్యాధుల బారిన పడకుండా వింటర్లో మన శరీరానికి రక్షణ కల్పించే ఆ వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం...

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. వింటర్ లో తీసుకోవల్సిన ఆహారాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి వెజిటేబుల్ . ఇందులో న్యూట్రీషియన్ కాంపోనెంట్స్ జింక్, మెగ్నీషియ, మరియు విటమిన్ బి12, బి6, మరియు సి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్:

శీతాలకాంలో మీ శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉండి. వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఆస్పరాగస్ ఒక హెల్తీ వెజిటేబుల్ ఇందులో ముఖ్యమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్రెయిన్ హెల్త్ కు గొప్పగా సహాయపడుతుంది.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్ లూటిన్ అనే పదార్థం పుష్కలంగా ఉండి, ఇది పెద్దవారిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇది కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

కాయధాన్యాలు:

కాయధాన్యాలు:

కాపర్, మెగ్నీషియం, ఐరన్ మరియు పొటాషియం వంటి వాటికి అద్భుతమైన మూలం కాయధాన్యాలు. అలాగే ఇవి యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గా మనకు సుపరిచితం. వీటలో ఉండే లో కంటెంట్ కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల వీటిని వింటర్ డైట్లో చేర్చుకోవడం ఎంతైనా అవసరం.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

పచ్చిఉల్లిపాయ తినడం వల్ల మన శరీరంకు అవసరం అయ్యే ఫైటోకెమికల్స్ పుష్కలంగా అంది లంగ్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ నుండి మనల్ని రక్షిస్తాయి. ఇందులో యాంటీక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఉల్లిపాయ చాలా అవసరం అయినటువంటి వెజిటేబుల్ గా మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి .

కాలే:

కాలే:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఐరన్ మరియు విటిమన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటుంది. విటిమన్ ఎ శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. దాంతో శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించవచ్చు. మరో ప్రక్క విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంపొంధిస్తుంది.

క్యారెట్:

క్యారెట్:

వింటర్ లో తినాల్సిన మరో హెల్తీ ఫుడ్ క్యారెట్స్. క్యారెట్స్ లో ఫైటో న్యూట్రియంట్స్ బీటాకెరోటిన్ పుష్కలంగా ఉండి, శరీరంలో వ్యాధినిరోధకతను పెంపొంధించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సెల్స్ ను అభివ్రుద్ది చేస్తుంది.

ముల్లంగి:

ముల్లంగి:

ముల్లంగిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంతే కాకుండా కాపర్ , మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 మిరయు ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల ఇవి వింటర్లో వివిధ రకాల జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో మేలైన యాంటీక్యాన్సర్ లక్షణాలున్నాయి. ముఖ్యంగా అతి ముఖ్యమైన న్యూట్రీషియంట్స్ విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ మిరయు మెగ్నీషియం పుష్కలంగా ఉండి ఇవి ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

బీన్స్:

బీన్స్:

ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మీలో వ్యాధినిరోధకత పెంచుకోవాలన్నా, వింటర్ వ్యాధులకు దూరంగా ఉండాలన్నా బీన్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో మ్యాంగనీస్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండి వ్యాధినిరోధకతను పెంచడంలో దోహదం చేస్తాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది.

పచ్చిబఠానీ:

పచ్చిబఠానీ:

పచ్చిబఠానీ లెగ్యుమ్ కుటుంబానికి చెందిన ఆరోగ్యకరమైన వెజిటేబుల్, వీటిని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధన ప్రకారంన వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్టొమక్ క్యాన్సర్ రాకుండా ఎదుర్కొంటుందని నిర్ధారించారు.

కార్న్:

కార్న్:

కార్న్ (మొక్కజొన్న)ను బాగా ఉడికించడం వల్ల ఇందులో అధిక పోషకాంశాలుంటాయి. ఉడికించిన కార్న్ లో పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ (లూటిన్)అధికంగా ఉండి, వ్యాధినిరోధకతను అమాంతం పెంచడంలో సహాయపడుతాయి.

English summary

15 Vegetables To Eat This Winter To Build Your Immunity

Fruits and vegetables are natural sources to build immunity. During winter, the body is vulnerable to illnesses that spread mostly through air and water. It is at this juncture that one's immunity comes into play. With low immunity levels, the probability of contracting one of the several winter illnesses is high.
Story first published: Wednesday, October 29, 2014, 17:18 [IST]
Desktop Bottom Promotion