For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ డైట్లో వీటిని చేర్చుకొని,ఆరోగ్యాన్ని కాపాడుకోండి

|

ఎప్పుడు ఎటువంటి ఆనారోగ్యం పాలు కాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా కొన్ని రకాల ప్రత్యేకమైన పండ్లను చేర్చుకోవాలి. రెగ్యులర్ గా తీసుకొనే పండ్లు కూరగాయల్లో వివిధ రకాల ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. సమ్మర్ లో ఎండ వల్ల శరీరంలో నీరు చాలా వరకూ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి, అతి త్వరగా మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. కాబట్టి, అలా చెమట రూపంలో కోల్పోయిన నీటిని తిరిగి మన శరీరంలో నిల్వ చేసుకోవాలంటే ఒక ఉత్తమ మార్గం వాటర్ కంటెంట్ అధికంగా ఉన్ననేచురల్ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఉదాహరణకు : వాటర్ మెలోన్(పుచ్చకాయ)ద్రాక్ష మరియు ఆరెంజ్ వంటి పండ్లు నీటి శాతం ఎక్కువగా కలిగినటువంటివి. అటువంటి పండ్లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పండ్లను మీకోసం బోల్డ్ స్కై లిస్ట్ చేసి, ఇక్కడ అందివ్వడం జరిగింది. వీటిని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఫిట్ గా ఉంచుకోవడంతో పాటు, మీ శరీరానికి అవసరం అయ్యే తక్షణ శక్తిని అందిస్తాయి.

ఈ హెల్తీ బెస్ట్ ఫ్రూట్స్ రెగ్యులర్ గా ప్రతి రోజూ తీసుకుంటే, ఎటువంటి సమస్య ఉండదు. ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన పండ్లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు దాంతో సీజన్ మొత్తం మీరు హెల్తీగా జీవించవచ్చు. అటువంటి హెల్తీ అండ్ ఎనర్జిటిక్ ఫ్రూట్ కొన్ని మీకోసం ఈ క్రింది స్లైడ్ లో...

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటిపండ్లు ప్రతి రోజూ తినడం వల్ల ఇవి నేచురల్ ఎనర్జీని అందిస్తాయి. రెగ్యులర్ గా తినడానికి ఇది ఇక బెస్ట్ ప్రూట్. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తినాలి.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ లో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది కార్డియోవ్యాస్కులర్ వ్యాధులకు సంబంధం కలిగి ఉంది అందుకే వీటిని రెగ్యులర్ తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం.

ఆరెంజ్:

ఆరెంజ్:

మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నట్టైతే, అప్పుడు ఇది ఒక ఉత్తమ పండు. దీన్ని రెగ్యులర్ గా మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇది నేచురల్ షుగర్ కంటెంట్ కలిగి ఉంది. కాబట్టి ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ ను జ్యూస్ గా తయారుచేసి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది . ఈ పండ్లలో ఉండే విటమిన్స్ స్టొమక్ ప్రాబ్లెమ్స్ ను అద్భుతంగా నివారిస్తాయి.

జామకాయలు:

జామకాయలు:

ప్రతి రోజూ తినడానికి ఈ జామకాయ ఒక హెల్తీ అండ్ బెస్ట్ ఫ్రూట్. మీరు రెగ్యులర్ గా యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే, ఇది చాలా ఎఫెక్టివ్ గా యూరిన్ లో యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

థైరాయిడ్ పేషంట్స్ తప్పనిసరిగా ఈ గ్రేప్ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . థైరాయిడ్ లెవల్స్ ను సమతుల్యం చేయడంలో ఇవి అద్భుతంగా సహాయపడుతాయి.

చెర్రీస్:

చెర్రీస్:

ఒక హెల్తీ మరియు బెస్ట్ ఫ్రూట్స్ చెర్రీస్. ఇది ఇన్ఫ్లమేషన్ వంటి జబ్బులతో పోరాడి, ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడానికి, ఒక హెల్తీ ప్రూట్స్ మలబద్దక సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

English summary

8 Healthy Best Fruits To Eat Daily

In order to stay healthy, you should make sure that fruits are a major part of your diet. It is in fruits and vegetables where you will find the proteins, nutrients and vitamins. During summer, you tend to lose a lot of water in the form of sweat and thus your body becomes dehydrated.
Story first published: Tuesday, April 29, 2014, 17:26 [IST]
Desktop Bottom Promotion