For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డులోని ఆశ్చర్యకర ఆరోగ్యప్రయోజనాలు

By Mallikajuna
|

గుడ్లు చూడటానికి మరీ చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇది అనేక విటమిన్స్ మరియు మినిరల్స్ తో నిండినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఈ ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ మరియు ఫొల్లేట్ పుష్కలంగా ఉన్నాయి . అధ్యనాలు, పరిశోధనల ప్రకారం,ఉడికించిన గుడ్డులో 6. 29గ్రాముల ప్రోటీన్స్ మరియు 78 క్యాలరీలు కలిగి ఉంటాయి. ప్రతి రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సినంత ఎనర్జీని అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు మీ ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది

నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. బరువును కూడా తగ్గిస్తుంది. అలాఅని ఒక రోజుకు నాలుగు గుడ్లును తినడం మంచిది కాదు. గుడ్లను సరైన పద్దతిలో ఉడికించి ఒక రోజుకు ఒకటి రెండు గుడ్లును తినవచ్చు.

హార్డ్ గా మరియు సాఫ్ట్ ఉడికిచిన గుడ్డు లో కొన్ని ఆరోగ్యప్రయోజనాలను మీకోసం బోల్డ్ స్కై లిస్ట్ చేసి అందిస్తోంది. వాటిని తెలుసుకోవాలంటే క్రింది స్లైడ్ ను క్లిక్ చేసి చూడాల్సిందే. గుడ్డు తిననివారికి కూడా ఈ ఆర్టికల్స్ ను షేర్ చేస్తే , వారు గుడ్డు ప్రయోజనాలను తెలుసుకొని, ఉడికించిన గుడ్డు తినడానికి ప్రయత్నిస్తారు ...మరి ఆ ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

కళ్ళ సంరక్షణ:

కళ్ళ సంరక్షణ:

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

ప్రోటీన్స్ సంవ్రుద్ది:

ప్రోటీన్స్ సంవ్రుద్ది:

ఎగ్ వైట్ లో పుష్కలమైన అల్బుమిన్ ఉంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

క్యాల్షియం పెంపొందిస్తుంది:

క్యాల్షియం పెంపొందిస్తుంది:

ఎగ్ వైట్ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది.ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్ ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

డైలీ ఎగ్:

డైలీ ఎగ్:

గుడ్డులోని తెల్లసోనలో హిస్టోడిన్‌, పచ్చసోనలో జింక్‌, కోలిన్‌, అయోడిన్‌, లినోలిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. వీటితో పాటు అధికంగా ప్రోటీనులు, న్యూట్రిషియంట్స్, అంతే కాకుండా ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డులోని పచ్చసొన పిల్లతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యకరం.

మంచి ఫ్యాట్స్ కలిగి ఉంది:

మంచి ఫ్యాట్స్ కలిగి ఉంది:

గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం, గుడ్డుజబ్బులు తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

నేచురల్ గా విటమిన్ డి:

నేచురల్ గా విటమిన్ డి:

కండరాలకు పుష్టిని ఇచ్చే అత్యావశ్యకమైన ఎమినో ఆసిడ్స్ ను కలిగి ఉండటమే కాకుండా కోడిగుడ్డు సొనలో ‘విటమిన్ డి'పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా కండరాల కణజాలానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది క్రీడాకారులకు మంచి బ్రేక్ ఫాస్ట్.

బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది:

బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది:

అల్బుమిన్ అనే పోషకాంశంలో సెలీనియం అనే కెమికల్ కలిగి ఉండి, మన శరీరంలో ఏర్పడే కాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేసై్తుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది. ఇది ఫర్టికులర్ గా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో అనేక యాంటి యాక్సిడెంట్లు ఉన్నాయి. విటమిన్‌-ఎ, కెరోటిన్‌ ద్వారా లూమీప్లేమిన్‌, లూమీక్రోమిన్‌ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. లూటిన్‌, జియాక్సాంథిన్‌ ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిరోధించొచ్చు. గుడ్డు పచ్చ సోనలోని విటమిన్‌-ఇ క్యాన్సర్‌ కణాలను క్షీణించేలా చేస్తుంది.

జుట్టు సంరక్షణకు:

జుట్టు సంరక్షణకు:

గుడ్డు పచ్చసొన వలన శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.

గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది:

గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది:

ఉడికించిన గుడ్డులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ డి కి ఇది ఒక మంచి మూలం. ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినిరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, గోళ్ళు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

Story first published: Tuesday, April 8, 2014, 18:20 [IST]
Desktop Bottom Promotion