For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రహు ఫిష్ లోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

వారంలో రెండు లేదా మూడు సార్లు చేపలు తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని టాప్ లో ఉంచుతుంది. అది మీరు సీఫిష్ తింటారా లేదా రివర్ ఫిష్ తింటార అన్నది విషయం కాదు, ఏ చేపలు తిన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.

అందుకే మీ రెగ్యులర్ డైట్ లో సీఫిష్ ను ను చేర్చుకోవడం ఆరోగ్యకరమైనది. చాలా మంది ఈ సీఫుడ్ కంటే, చికెన్ మరియు గుడ్డు ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వీటికంటే కూడా మరింత ఆరోగ్యకరమైనటువంటి పుడ్ ఈ సీఫుడ్. చికెన్ మరియు గుడ్డు కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అంధించే ఆహారం చేపలు. చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్ మరియు విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలను ప్రతి రోజూ లేదా వారానికొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు మనం చాలా యాక్టివ్ గా కూడా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.

స్థానికంగా పుష్కలంగా లభించే చేపలు, రొయ్యలను ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపం తగ్గిపోయి ఆరోగ్యసమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. చేపలు, రొయ్యలు పోషకవిలువలు ఉన్న బలవర్థక ఆహారం. చేపల్లో వివిధ రకాలున్నాయి. అందులో సాల్ మన్ , మాక్రెల్ , ట్యూనా , హెర్రింగ్ , సార్డినెస్, రహు మున్నగునవి .చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. అంతే కాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ చేపలను తినడ ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

చేపల్లో మెకరల్, సాల్మన్ మరియు తున ఫిష్ లు తినడం వల్ల ఎంత ప్రయోజనాలు పొందుతామో రహు ఫిష్ తినడం వల్ల కూడా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. రహు ఫిష్ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

విటమిన్ సి

విటమిన్ సి

రహు ఒక రివర్ ఫిష్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఇది చాలా వసరం. జలుబు మరియు దగ్గు వంటి డిసీజ్ ను దూరంగా ఉంచుతుంది అలాగే ఇతర వ్యాధులు కూడా రాకుండా విటమిన్ సి ఎదుర్కొంటుంది.

 ప్రోటీనులు అధికంగా ఉన్నాయి

ప్రోటీనులు అధికంగా ఉన్నాయి

ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. సీఫుడ్ లో అత్యధిక శాతంలో ప్రోటీనులున్నాయి. రహు ఫిష్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది శరీర పెరుగుదలకు మరియు మంచి ఆరోగ్యానికి సహాయపడుతాయి.

లోఫ్యాట్

లోఫ్యాట్

రహు ఫిష్ లో ప్రోటీనులు అధికం మరియు ఫ్యాట్ తక్కువ మరి ఇంత కంటే ఉత్తమ ఆహారం మరేం కావాలి.

 గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. ఫిష్ లో మంచి క్రొవ్వులను (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్)కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది. కార్డియో వ్యాస్కులార్ డిసీజ్(గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను)నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి తగ్గిస్తుంది.

 బ్రెయిన్ బూస్టర్

బ్రెయిన్ బూస్టర్

అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.

మినరల్స్ కు పుష్కలంగా కలిగినది

మినరల్స్ కు పుష్కలంగా కలిగినది

ఐరన్, జింక్, ఐయోడిన్, పొటాషియం, క్యాల్షియం మరియు సెలీనియం వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా అవసరం అవుతాయి.

 క్యాన్సర్ నివారిని

క్యాన్సర్ నివారిని

ఒక ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ ను నివారించడంలో అద్భుతమైన ఆహారం ఫిష్. చేపలో ఉండే యాంటీఆక్సిడెట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.

English summary

Amazing Health Benefits Of Rohu Fish

Having fish thrice a week can keep you on top of your health. It does not matter whether you eat sea fish or river fish, benefits of eating this type of seafood are immense. If you live near the sea, you will find fishes such as seer fish and salmon. And if you live inland, you will be able to derive health benefits of rohu fish and katla.
Story first published: Thursday, October 16, 2014, 12:59 [IST]
Desktop Bottom Promotion