For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవు పాలు లేదా గేదె పాలు వీటిలో ఏది ఉత్తమం?

By Super
|

ఆవు పాలు లేదా గేదె పాలు? గందరగోళంగా ఉందా? నిజం తెలుసుకోండి. ఆవు పాలు లేదా గేదె పాలు రెండింటిలోను పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రెండు రకాలు అందుబాటులో ఉన్నప్పుడు, పాల ఎంపిక మీ వ్యక్తిగత అవసరాల ఆధారంగా చేసుకోవాలి.

నేను ఏదైనా నిర్ధారించుకోవటానికి ముందు,గేదె పాలు, ఆవు పాలలో ఉండే పోషక విలువల గురించి తెలపండి. క్రింద ఇచ్చిన మొత్తంలో 100 ml పాలు ఉన్నాయి.

Cow milk or Buffalo milk: Which is Better for You?

గేదె:
కేలరీలు 97kcal,ప్రోటీన్ 3.7g,ఫ్యాట్ 6.9g, నీరు 84%,లాక్టోజ్ 5.2g,ఖనిజాలు 0.79g

ఆవు:
కేలరీలు 61kcal, ప్రోటీన్ 3.2g, ఫ్యాట్ 3.4g,నీరు 90%,లాక్టోజ్ 4.7g, ఖనిజాలు 0.72g


మీరు బరువు కోల్పోవాలని అనుకుంటే మీకు ఆవు పాలు మంచివి.
100ml గేదె పాలలో 97 కిలో కేలరీలు ఉంటే,అదే 100ml అవుపాలలో అయితే 61 కిలో కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆవు పాలు (3.4g కొవ్వు) కన్నా గేదె పాలలో(6.9g కొవ్వు) రెట్టింపు కొవ్వు ఉంటుంది.

మీరు కొవ్వు కోల్పోవడం మరియు కండరాల నిర్మాణానికి ఆవు పాలు మంచివి.
మీరు ఆవు పాలు త్రాగితే మీకు 3.2g ప్రోటీన్,3.4g కొవ్వు మరియు 61 కేలరీలను పొందవచ్చు. మీరు గేదె పాలు త్రాగితే మీకు 3.4g ప్రోటీన్ ( దాదాపు ఆవు పాలు వలే), 6.9g కొవ్వు (ఆవు పాలు కంటే రెట్టింపు) మరియు 97 కేలరీలు (ఆవు పాలు కంటే 50% ఎక్కువ) పొందవచ్చు.


మీరు బరువు పొందటానికి మరియు కండరములు నిర్మించడానికి గేదె పాలు మంచివి.
గేదె పాలలో ప్రోటీన్ అవుపాలలో కంటే 15% ఎక్కువగా ఉంటుంది.

మీకు జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలు మంచివి.

గేదె పాలు (ఆవు పాలలో సుమారు 90% నీరు ఉంటుంది) ఆవు పాలు కంటే మందంగా ఉంటాయి. అందువల్ల గేదె పాలు ఆవు పాలతో పోలిస్తే జీర్ణం అవటం కొద్దిగా కష్టం అయ్యి బరువుగా ఉంటుంది.

English summary

Cow milk or Buffalo milk: Which is Better for You?

Cow Milk or buffalo Milk? Confused? Find out the truth. Cow milk and buffalo milk both are very high in nutrition. When both are available, the choice of milk should be made based on your personal needs.
Desktop Bottom Promotion