For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీరదోసకాయ జ్యూస్ లోని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

|

కీరదోసకాయలు, ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయలలో నాలుగో స్థానాన్ని పొందింది మరియు మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఉత్తమ ఆహారాలలో ఇది ఒకటి అని, తరచుగా దీనిని ఒక సూపర్ ఆహారంగా సూచిస్తుంటారు. కీరదోసకాయను ఎక్కువగా సలాడ్స్ లో, రైతాలు తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. సలాడ్స్ తినడానికి ప్రధాన కారణం మన శరీరంలో న్యూట్రీషినల్ విలువలు పెంచడం కోసమే. ముఖ్యంగా గ్రీన్ సలాడ్స్ లో కీరదోసకాయను మరియు టమోటోలను ఖచ్చితంగా చేర్చుకోవాలి . వీటి వల్ల శరీరానికి అనేక న్యూట్రీషినల్ విలువలు అందుతాయి.

నిజానికి, చాలా మంది ఉదయం వివిధ రకాల జ్యూసులు త్రాగుతుంటారు. ఈ జ్యూసులు రోజంతా అవసరం అయ్యే ఎనర్జీని అందించడంలో గొప్పగా సహాయపడుతాయి. ముఖ్యంగా చాలా మంది కాకరకాయ జ్యూస్ ను ఉదయం త్రాగుతుంటారు. ఈ జ్యూస్ త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా డయాబెటిస్ ను ఎదుర్కొనే సామర్థ్యం ఇందులో కలవు అనే భావన ఎక్కువ మందిలో ఉంది. కాకరకాయ జ్యూస్ మాత్రమే కాదు, వివిధ రకాల జ్యూసులను ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాంశాలను పొందవచ్చు.

అటువంటి జ్యూసులలో కీరదోసకాయ జ్యూస్ కూడా ఒకటి. కీరదోసకాయలో అత్యధిక పోషకాలున్నాయి. ఇంకా విటమిన్ కె, ఎ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పురుషులు కీరదోసకాయ జ్యూస్ ను ప్రతి రోజూ కనీసం 3 కప్పులు తీసుకోవాలని నిపుణుల సలహాలిస్తుంటారు. అలాగే మహిళలు 2.1/2కప్పుకీరదోసకాయ జ్యూస్ ను తీసుకోవచ్చు. ఒక కప్పు కీరదోసకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మూడు కప్పులు వెజిటేబుల్స్ తిన్నంత పోషకాంశాలను పొందవచ్చు. ఈ జ్యూస్ త్రాగడం వల్ల వివిధ రకాల వ్యాధులను నివారించవచ్చు. ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు . అలాగే కుకుంబర్ జ్యూస్ త్రాగడం వల్ల వివిధ రకాల జబ్బులు నివారించబడుతాయి . కాబట్టి, కీరదోసకాయజ్యూస్ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

కీరదోసకాయలో 90శాతం నీరు ఉంటుంది. రోజంతా మీకు అవసరం అయ్యే ఎనర్జీని ఈ జ్యూస్ అందిస్తుంది. కీరదోసకాయ శరీరాన్ని రిహైడ్రేట్ చేస్తుంది తగినంత నీటిని మీరు తీసుకోలేనప్పుడు , 90 పర్సెంట్ నీరు ఉన్న ఒక చల్లటి కీరదోసకాయ తినండి.

వేడిని తగ్గిస్తుంది:

వేడిని తగ్గిస్తుంది:

కీరదోసకా జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. కీరదోసకాయ శరీరంలోని -శరీరం బయట వేడిని తగ్గిస్తుంది. కీరదోసకాయ తినడం వల్ల శరీరంలోపల ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కీరదోసకాయను చర్మానికి రుద్దడం వల్ల సన్ బర్న్ నుండి ఉపశనమం కలిగిస్తుంది.

శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

కీరదోసకాయ రసాన్ని రెగ్యులర్ గా త్రాగడం వల్ల కీరదోసకాయ విషపదార్థాలను తొలగిస్తుంది. కీరదోసకాయలో ఉన్న నీరు ఒక వర్చువల్ చీపురులాగా మీ శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపి ప్రక్షాళన చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే దోసకాయ కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుందని అంటారు.

శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ ను అంధిస్తుంది:

శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ ను అంధిస్తుంది:

కీరదోసకాయ కావలసిన రోజువారీ విటమిన్లను తిరిగి నింపుతుంది కుకుంబర్ లో రోజులో శరీరానికి కావలసిన చాలా విటమిన్లు ఉన్నాయి. మీ వ్యాధినిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచేందుకు మరియు మీకు శక్తిని పెంచడానికి తోడ్పడే విటమిన్లు ఏ,బి మరియు సి,దీనిలో పుష్కలంగా ఉన్నాయి. దోసకాయ రసంతో పాలకూర మరియు క్యారట్ కలిపితే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన 12 శాతం విటమిన్ సి లో ఎక్కువ శాతం సి విటమిన్ ఇందులో ఉండటంవలన దీనిని శరీరం మీద ఉంచటం మర్చిపోవొద్దు.

మినిరల్ ట్రీట్మెంట్:

మినిరల్ ట్రీట్మెంట్:

కీరదోసకాయ జ్యూస్ లో అత్యధికంగా మినిరల్స్ ఉన్నాయి. ఈ మినిరల్స్ అన్నీ కూడా మీరు చర్మం ఆరోగ్యంగా మరియు హ్యాపిగా ఉండటానికి సహాయపడుతుంది. కీరదోసకాయ చర్మానికి పొటాషియం, మెగ్నీషియం మరియు సిలికాన్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా స్పాలలో ఎక్కువగా దీనిని ఆధారం చేసుకుని చికిత్సలు జరుగుతాయి.

బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:

జీర్ణక్రియలో మరియు బరువు తగ్గడంలో కీరదోసకాయ సహాయపడుతుంది దీనిలో ఉన్న అధిక నీరు మరియు తక్కువ కాలరీలు కంటెంట్ కారణంగా, ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచింది. మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే, కీరదోసకాయ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోండి. బరువు తగ్గే క్రమంలో శరీరానికి తగినన్ని న్యూట్రీషియన్స్ అంధించడంలో కీరదోస జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది.

కళ్ళు ఆరోగ్యానికి:

కళ్ళు ఆరోగ్యానికి:

ఉబ్బిన కళ్ళ మీద కీరదోసకాయ ఒక చల్లని ముక్క ఉంచడం వలన దృష్టి బాగుంటుంది కాని దీనిలో ఉన్న వ్యతిరేక శోథ లక్షణాల కారణంగా కళ్ళ క్రింద ఉబ్బులు మరియు నలుపులు తగ్గిస్తుంది. కీరదోసకాయలో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర న్యూట్రీషియన్ విలువలు మీ ద్రుష్టిని మెరుగుపరిచేలా చేస్తుంది .

బిపి సమస్యలను నివారిస్తుంది:

బిపి సమస్యలను నివారిస్తుంది:

మీరు హైబీపి లేదా లోబీపితో బాధపడుతున్నట్లైతే మీరు కీరదోసకాయ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.

English summary

Health Benefits Of Cucumber Juice

Cucumbers are cultivated largely across the world. Cucumbers have been largely associated with salads and have long since been a part of various salad dishes too. The whole idea of having salads is to increase the nutritional value of your food. Since long salads have included greens, cucumbers and tomatoes that add to the nutritional value of your food.
Story first published: Wednesday, June 18, 2014, 18:28 [IST]
Desktop Bottom Promotion