For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘లెమన్ టీ’ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

టీ అంటేనే ఆరోమాటికి బెవరే. ఈ సువాసన భరితమైన పానీయంను కొంత మంది పాలు, పంచదార మిక్స్ చేయకుండా బ్లాక్ టీని తీసుకుంటుంటారు . ఇటువంటి టీని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విరివిగా తీసుకుంటుంటారు

ఈ నార్మల్ టీతో పాటు, వివిధ రకాల టీలు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ హోటల్ లేదా కాఫీడే, లేదా స్ట్రీట్ స్టాల్స్ కు వెళ్ళిన అక్కడ గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, రుచికరమైన టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. టీ ప్రియులకోసం అని కొన్ని టీలకు కొన్ని ప్రత్యేకమైన ఫ్లేవర్స్ ను జోడించి మరీ అందుబాటులో ఉంచుతున్నారు.

లెమన్ టీ రెడీగా అందుబాటులో ఉంటుంది. నార్మల్ బ్లాక్ టీకి కొన్ని నిమ్మచెక్కలను కూడా జోడించి ఇస్తుంటారు. ఇది మీకు ఆరోమ్యాటిక్ సువాసను అందిస్తుంది . ఈ లెమన్ టీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

రెగ్యులర్ గా ప్రతి రోజూ లెమన్ టీ త్రాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి. లెమన్ టీ చాలా సులభంగా చిటికెలో తయారుచేసుకోవచ్చు. అందుకు ముందుగా నీటిని బాగా మరిగించి తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. తర్వాత అందులో నిమ్మరసం లేదా నిమ్మతొక్క(లెమన్ స్లైస్ )జోడించాలి. చివరగా పంచదార లేదా తేనె మిక్స్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

లెమన్ టీలో ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి...

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

లెమన్ టీ శరీరంలోకి ప్రవేశించగానే మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది. మొత్తం జీవక్రియలను శుభ్రపరచడానినకి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది .

నాడీవ్యవస్థ

నాడీవ్యవస్థ

లెమన్ టీ త్రాగడం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గా ఉంచి, మెదడుకు అవసరం అయ్యే సామర్థ్యం మరియు బలాన్ని చేకూర్చుతుంది అందువల్ల తలనొప్పి మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఒత్తిడితో ఉన్నప్పుడు లెమన్ టీని ఒక కప్పు త్రాగడం వల్ల మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీ బావోద్వేగాలను నివారించడానికి సహాయపడుతుంది. మరింత బెటర్ గా ఫీల్ అయ్యేందుకు సహాయపడుతుంది.

కార్డియో వ్యాస్కులార్ సిస్టమ్

కార్డియో వ్యాస్కులార్ సిస్టమ్

గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని అనేక పరిశోధన ద్వారా నిరూపించబడినది. ఇంకా ఈ టీలో పాలను చేర్చడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నట్లు నిరూపించబడినది . టీలోని కొన్ని ఫ్లెవనాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మరియు ఆరోగ్యానికి గొప్పప్రయోజనకారిగా ఉంటుంది. అందువల్ల గ్రీన్ టీ కార్డియోవాస్కులార్ (గుండె సంబంధిత)సమస్యలను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుందని చెప్పగలం.

ఇన్సులిన్ యాక్టివిటి

ఇన్సులిన్ యాక్టివిటి

శరీరంలో గ్లూకోజ్ నుండి ఎనర్జీ విడుదల అవ్వడానికి ఇన్సులిన్ చాలా అవసరం అవుతుంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల అనేక అనారోగ్య సమస్యలతో అనుసంధానం కలిగి ఉంటుంది. దానికి లెమన్ టీ గొప్పగా సహాయపడుతుంది . లెమన్ టీ ఇన్సులిన్ యాక్టివిటిని ప్రోత్సహిస్తుంది. ఊలాంగ్ టీ, గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ లు కూడా శరీరంలో జీవక్రియలు చురుగ్గా పనిచేసేలా చేయడానికి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది . అయితే ఇది డయాబెటిక్ పేషంట్స్ కు పరిష్కారం కాదు, కానీ ఇది వారికి కొంత వరకూ సహాయపడుతుంది.

మెటబాలిజం

మెటబాలిజం

జీవక్రియల రేటును పెంచుతుంది. దిన చర్యను ఒక కప్పు లెమన్ టీతో ప్రారంభించడం వల్ల మీలోని జీవక్రియల రేటు అమాంత పెరుగుతుంది. రోజంత ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది . ఇంకా చల్లని వాతావరణం కలిగి ఉన్నప్పుడు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. చల్లని వాతావరణంలో ఒక కప్పుగు వేడి వేడి లెమన్ టీ త్రాగడం వల్ల మీరు రిలాక్స్డ్ గా ఫీలవుతారు.

English summary

Health Benefits Of Lemon Tea

Tea is an aromatic beverage. Some people just prefer it black without milk and sugar. This form of tea is the most widely consumed beverage in the world. Along with the normal tea, there are various other tea preparations such as green tea, oolong tea, delicate tea and pu-erh tea. There are also flavours such as lemon added to the tea.
Story first published: Saturday, August 30, 2014, 15:53 [IST]
Desktop Bottom Promotion