For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కివి ఫ్రూట్ లోని న్యూట్రిషియన్ వాస్తవాలు -ఆరోగ్యప్రయోజనాలు

|

రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి.కివి పండుకు పేర్లు చాలా వున్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీ కి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులోఅధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది. కివి పండులో ఇన్ని పోషకాలుండటానికి కారణం ఏమిటి అనేది చూడండి. కివి పండుతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ సి - కివి పండులో విటమిన్ సి అధికం. ఆరెంజస్ లో కంటే కివి పండులో విటమిన్ సి రెండు రెట్లు వుంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. కివి పండు శ్వాస సంబంధిత ఆస్త్మా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కివి పండు కనీసం వారానికోసారి తిన్న పిల్లలకు తినని వారికంటే 44 శాతం తక్కువ దగ్గు, జలుబు సమస్యలకు గురయ్యారని స్టడీ తెలిపింది.

Kiwi Fruit - Nutrition Facts and Health Benefits

పొటాషియం - అరటిపండులో ఎంత పొటాషియం వుందో అంత కివి పండులో వుంది. అరటిపండుతో పోలిస్తే కేలరీలు కూడా ఈ పండులో తక్కువే. కేలరీలు తక్కువుండటంతో గుండెకు ప్రయోజనకరంగా సోడియం కూడా తక్కువే. సోడియం రక్తపోటు నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

విటమిన్ ఇ - విటమిన్ ఇ అధికంగా వుండే ఆహారాలలో కొవ్వులు కూడా అధికమని మనకు తెలుసు. కాని కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ అధిక యాంటీ ఆక్సిడంట్లను అందించి గుండె ఆరోగ్యం కాపాడుతుంది.

ఫోలిక్ యాసిడ్లు - కివి పండు లో ఫోలిక్ యాసిడ్ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. ఫోలిక్ యాసిడ్లు బేబీలలో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లను కూడా అందిస్తుంది. బేబీ ఎదుగుదలలో మెదడు పెరిగేలా చేస్తుంది. గుండె జబ్బులనుండి రక్షిస్తుంది.

పీచు - రీసెర్చి మేరకు ఈ పండులో పీచు కూడా అధికంగా వుండి, జీర్ణ వ్యవస్ధను శుభ్ర పరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొల్లెస్టరాల్ తగ్గిస్తుంది గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్ధాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. కివిపండు కడుపు నింపుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది.

జింక్ - కివి పండులో వుండే జింక్ శాతం పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్ళు, గోళ్ళు మొదలైనవాటి ఆరోగ్యకర పెరుగుదలకు జింక్ సహకరిస్తుంది. కివి పండ్లు మన దేశానివి కావు. అయినప్పటికి దీని పోషకాల దృష్ట్యా దానిని ఎక్కడనుండైనా సరే తెప్పించి తినవచ్చు. పండు సైజు గురించి ఆలోచించకండి. కివి పండు చిన్నదైనా రుచి, ప్రయోజనాలు అధికం. కివి పండు ఎలా ఎంపిక చేయాలి? మీ బొటన వేలితో కివి పండును ఒత్తండి. పండితే మెత్తగా వుంటుంది. తినటానికి అనువు. మరి తిని ఆనందించండి.

మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది. ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం.
ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.

Story first published: Saturday, September 20, 2014, 20:55 [IST]
Desktop Bottom Promotion