For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జలుబును నివారించడానికి తినాల్సినటువంటి 6లోక్యారలీ ఫుడ్స్

|

ఫ్లూ, కోల్డ్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వాటిని హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ నివారించుకోవచ్చు. లేదా మంచి లైఫ్ స్టైల్ ను అనుసరిస్తూ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. షార్ట్ పీరియడ్ లో అనారోగ్యపాలుకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడ్డాయి.

ఎప్పుడైతే మీరు బయటి ఆహారాలకు అలవాటు పడుతారో, అప్పుడు మీ శరీరం మీకు తెలియకుండానే అధిక క్యాలరీలను మరియు ఫ్యాట్ ను గ్రహిస్తుంది. దీన్నే సహంజగా హెల్తీ ఫ్రీక్ సిండ్రోం అంటారు. అలాకాకుండా ప్రజలు హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి ప్రయత్నించాలి . అదృష్టవశాత్తు, అందుకు కొన్ని లోక్యాలరీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆహారాలు చాలా వరకూ ఫ్లూ, కోల్డ్ మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. అంతే కాదు, ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి . ఈ లోక్యాలరీ ఫుడ్స్ శరీరానికి ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు, ఇవి మీ శరీరాన్ని హెల్తీగా మరియు ఫిట్ గా ఉంచుతాయి.

మరి మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచే ఆహారాలు ఈక్రింది విధంగా లిస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్లూ, కోల్డ్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి...

పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది

పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది

జలుబును నివారించడానికి ఆరెంజ్ మరియు నిమ్మ వంటి సిట్రస్ పండ్లు బాగా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి లోక్యాలరీ ఫుడ్స్ కూడా. వీటిలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి. మరియు శరీరంను ఫిట్ గా ఉంచుతాయి. అందువల్ల విటమిన్ సి ఇతర రూపంలో తీసుకోవడం కంటే, నేచురల్ గా ఇలా తాజా సిట్రస్ పండ్లను తినడం ఉత్తమం. వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. ఈ పండ్లును రోజులో ఏసమయంలో అయినా తినవచ్చు.

సలాడ్స్

సలాడ్స్

సలాడ్స్ లో వివిధ రకాల వెజిటేబుల్స్ ను చేర్చుతారు. ముఖ్యంగా సలాడ్స్ లో టమోటో, కీరదోస, ఉల్లిపాయ వంటివి ఎక్కువగా ఉంటాయి . ఈ ఆహారాలు లోక్యాలరీ ఫుడ్ లిస్ట్ లోచేర్చబడనవి. ఇవి కోల్డ్ మరియు ఫ్లూను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి . శరీరంలో వ్యాధినిరోధకత తగ్గడం వల్ల సాధారణ జలుబు మరియు దగ్గు, ఇన్ఫెక్షన్లకు గురికావడం సహజం. కాబట్టి, వ్యాధినిరోధకతను చెక్ చేసుకుంటుండాలి . అందుకు మీరు ఎక్కువ డైటరీ ఫైబర్ ను తీసుకోవాలి. డైటరీ ఫైబర్ పచ్చి కూరల్లో ఎక్కువ లభ్యం అవుతుంది. వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మీరు తీసుకొనే ప్రతి మీల్స్ తో పాటు సలాడ్స్ ను అలవాటు చేసుకోవాలి.

పండ్లు

పండ్లు

బెర్రీస్, ఆపిల్ మరియు అరటి వంటి కొన్ని పండ్ల నేచురల్ డైటరీ ఫైబర్ ను అందిస్తాయి అంతే కాదు, వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. ఈ డైటర్ ఫైబర్ వ్యాధినిరోధకతను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. అందువల్ల, హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ను మెయింటైన్ చేయడానికి మీ రెగ్యులర్ డైట్ లో పండ్లను చేర్చుకోవాలి. మరియు జ్వరం మరియు ఫ్లూ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాలలో గోధుమలు, రైస్ మరియు ఇతర చిరుధాన్యాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి చాలా తక్కువ క్యాలరీ ఫుడ్స్ అందుకే ఫ్లూ మరియు కోల్డ్ ను చాలా సులభంగా నివారిస్తుంది. తృణధాన్యాలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇవి వ్యాధినిరోధకతను పెంపొందించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అన్నం మరియు అధిక క్యాలరీలున్న ఆహారాలకు బదులుగా తృణధాన్యాలను తీసుకోవచ్చు .

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్

శరీరం తగినంత శక్తి పొందడానికి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలు చాలా అవసరం. ఇవి శరీరంలో ఫ్యాట్స్ ను చాలా త్వరగా బర్న్ చేస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఎంతో అవసరం. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫిష్, మిల్క్, మరియు గుడ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి . లీన్ మీట్ లో కూడా చాలా తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీనులు కలిగి ఉంటుంది. జింక్ మరియు ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటే కోల్డ్ ఫ్లూ వంటివి త్వరగా తగ్గుతాయి.

English summary

Low Calorie Foods To Eat To Avoid Cold

Flu, cold or viral infections can be avoided by eating healthy and maintaining a good lifestyle. In short, you can avoid getting sick by eating healthy foods. This is proven in studies carried out in many universities worldwide.
Story first published: Friday, July 25, 2014, 17:07 [IST]
Desktop Bottom Promotion