For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు-గొప్ప ప్రయోజనాలు

|

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.

నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గిన చెట్టు అది. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆవ్లుగుణంవల్ల దీన్ని జామ్‌లు, వెనిగర్‌, సాండీస్‌, ఆల్కహాల్‌, తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు.

పురుషులు తప్పనిసరిగా తీసుకోవల్సిన ఎనర్జిటిక్ ఫుడ్స్:క్లిక్ చేయండి

నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రధాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈక్రింది స్లైడ్ ద్వారా కనుక్కోండి...

డయాబెటిక్ కు మంచిది:

డయాబెటిక్ కు మంచిది:

నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది :

గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది :

నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

దంత సమస్యలను నివారిస్తుంది:

దంత సమస్యలను నివారిస్తుంది:

నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది.

శరీరంను డీహైడ్రేష్ నుండి రక్షిస్తుంది:

శరీరంను డీహైడ్రేష్ నుండి రక్షిస్తుంది:

వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది.

చర్మ సంరక్షణ:

చర్మ సంరక్షణ:

స్కిన్ రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి.

వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి.

వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి.

వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యము ఆలస్యం చేస్తుంది. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది . అలాంటి అనారోగ్యలనుండి కాపాడుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

నేరుడు పండు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరం యొక్క రోగ్యనిధోక శక్తిని పెంచతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.

ఎముకలను బలంగా ఉంచుతుంది:

ఎముకలను బలంగా ఉంచుతుంది:

నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరంలో ఎముకలు బలంగా ఉండేదుకు సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.

హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది:

హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది:

అన్నామలై యూనివర్సిటి అధ్యయనం ప్రకారం ఈ నేరుడు పండ్లు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుందని నిర్ధారించారు . ఇందులో ఉండే విటమిన్ సి, మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి బాధ్యత కలిగిన న్యూట్రీషియన్స్

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

నేచురల్ గా బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గౌట్ పెయిన్:

గౌట్ పెయిన్:

నేరుడు పండ్లలో ఉండే విటమిన్ సి గౌట్ పెయిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

మెమరీ పవర్:

మెమరీ పవర్:

ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.

డయోరియా:

డయోరియా:

నేరుడు ఆకులు: నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోనే వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయోరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తారు

గాయాలను మాన్పుతాయి:

గాయాలను మాన్పుతాయి:

పూర్వకాలంలో చీముతో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్‌, నయం చేసే గుణాఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్‌ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది. ఇలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది. నేరుడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటి తగ్గిస్తుంది.

కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది:

కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది:

కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

హెమరాయిడ్స్ :

హెమరాయిడ్స్ :

నేరుడు పండ్లను క్రమం తప్పకుండా రెండు మూడు నెలలో తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల రక్తస్రావంను నివారిస్తుంది.

బెడ్ వెట్టింగ్:

బెడ్ వెట్టింగ్:

చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ వెట్టింగ్ చేస్తుంటే అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పౌడర్ ను నీళ్ళలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు.

మూత్ర సంబంధ సమస్యలకు :

మూత్ర సంబంధ సమస్యలకు :

మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతు న్నారు. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు.

English summary

Top 21 Health benefits of Jamun / Black Berry

A lot of people shy away from eating fruits because they are not tasty enough. However, jamun has a sharp sweet and sour taste that lays rest to that excuse. Not only this, the fruit is loaded with nutrients and has several health benefits too.
Desktop Bottom Promotion