For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి చూపును మెరుగుపరిచే ఉత్తమ హోం రెమెడీలు

|

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటీకి వచ్చిరాగానే ఇక ఫ్రెండ్స్‌తో చాటింగ్. అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్‌ వుండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదాం అని అనుకుంటూనే సమయమే తెలియకుండా టి.విని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఆలోచించరు.

కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడీ గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా వుండటం మరియు మందగించడం వంటివి సమస్యలు ఎదుర్కోవాలి. అంతే కాదు, కంటి సమస్యల్లో చూపు సరిగా కనబడకపోవడం, కళ్ళకు అలర్జీ కలగడం జరుగుతుంటాయి. కళ్ళకు అలర్జీ కలిగినప్పుడు కండ్ల కలక మరియు డ్రై ఐ సిండ్రోమ్ వంటి వంటి సమస్యలకు కారణం కావచ్చు.

అయితే కొంత మంది వివిధ రకాల కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటుంటారు. వాటిలో ముఖ్యంగా కంటి శుక్లాలు, కంటిలోపల మచ్చలు, అంధత్వం , డయాబెటిక్ రెటినోపతి, అంధత్వానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. వయస్సుకు సంబంధించిన కండర వినాశనం కూడా అంధత్వానికి అతి పెద్ద కారణం అవుతుంది.

మరి ఈ సమస్యలేవి లేకుండా ఐ సైట్ ను నేచురల్ గా మెరుగుపరుచుకోవడం ఎలా? బోల్డ్ స్కై కొన్ని హోం రెమెడీస్ ను మీతో షేర్ చేసుకుంటున్నది...మరి కంటి సమస్యలను నివారించగలిగే హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

విటమిన్ ఎ:

విటమిన్ ఎ:

కంటి సమస్యలను నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి సమస్యలు మరియు అంధ్యత్వానికి గురి చేస్తుంది. అంతే కాదు విటమిన్ ఎ లోపం వల్ల గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఎముకల మరియు సాధరణ వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అందుకు ఈ సమస్యలను నివారించడానికి మీ రెగ్యులర్ డైట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్, బీఫ్, చికెన్, కాడ్ లివర్, పాలు మరియు గుడ్లు వంటివి తప్పని సరిగా చేర్చుకోవాలి.

కెరోటినాయిడ్స్ :

కెరోటినాయిడ్స్ :

బీటా కెరోటీని ఐ విజన్ ను మెరుగుపరుస్తుంది. మరియు రేచీకటిని నివారిస్తుంది. డైజెస్టివ్ ప్రొసెస్ లో విటమిన్ ఎను పంపుతుంది. అందుకు కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కేల, ఆకుకూరలు, లెట్యుస్, క్యారెట్స్, బెల్ పెప్పర్స్, టమోటోలు, స్వీట్ పొటాటో, బ్రొకోలీ, వాటర్ మెలోన్ మరియు ఆప్రికాట్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్స్:

యాంటీ ఆక్సిడెంట్స్:

లుటిన్ మరియు జియాక్సిథిన్ వంటి యాంటీఆక్సిడెంట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది మరియు ఇతర కళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుంది . యాంటీఆక్సిడెంట్స్ కివి ఫ్రూట్ మరియు బీట్ రూట్ లో పుష్కలంగా ఉన్నాయి . ఇవి ఐసైట్ కు కూడా చాలా మంచిది.

బిల్ బెర్రీ:

బిల్ బెర్రీ:

కంటి ఆరోగ్యానికి మరియు కంటి చూపు మెరుగుపరచడానికి బిల్ బెరీ చాలా పాపులర్ అయినది. అంతే కాదు ఇది మాస్కులార్ డీజనరేషన్ , గ్లుకోమా మరియు కాంట్రాట్స్ వంటి సమస్యలను వ్యతిరేకంగా పోరాడుతుంది . కాబట్టి, బాగా పండిన బిల్బెర్రీని ఫ్రూట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బాదం:

బాదం:

కంటి చూపును మెరుగుపరచడంలో బాదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటిమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఝాపకశక్తిని మరియు ఏకాగ్రతను పెంచుతుంది . రాత్రి సమయంలో 5నుండి 10 బాదంలను నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి.

గింగో బిలోబబా:

గింగో బిలోబబా:

కంటికి అవసరం అయ్యే రక్తప్రసరణను గింగో బిలోబా మెరుగుపరుస్తుంది . ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలను ఎదుర్కొని కంటికి రక్షణగా ఉంటుంది.

లికోపిన్:

లికోపిన్:

టమోటోలలో లికోపిన్ అధికంగా ఉంటుంది . టమోటోలకు ఆ కలర్ లికోపిన్ ద్వారానే అందుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది . అంతే కాదు క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది.

విటిమన్ ఇ :

విటిమన్ ఇ :

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపు(inflammation)ను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.

విటమిన్ సి:

విటమిన్ సి:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంద. ఈ విటమిన్ లో పోషకాలు అధికంగా ఉండి కంటి కండాలను డీజనరేషన్ చేసేందుకు సహాయం చేస్తుంది. అలాగే ఐసైట్ ను నిరోధిస్తుంది.

బయో ఫ్లెవనాయిడ్స్:

బయో ఫ్లెవనాయిడ్స్:

బయో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. బచ్చలి కూర, దుంప బచ్చలి. కాలే, స్విస్ చార్డ్, టర్నిప్, ఆవాలు మరియు కొల్లార్డ్ గ్రీన్ ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ ని అరికడుతుంది. అంతే కాదు వీటితో మస్కులార్ డిజనరేషన్, కాంటరాక్ట్స్ రాకుండా ఆపవచ్చు.

English summary

10 Best Home Remedies For Eye Problems

Our eyesight is vital for a healthy and independent life. Eyes are delicate organs of our body as they provide us with sight and vision. Continuous work on computer can affect our eyesight greatly. You should know ways to improve your eyesight naturally.
Story first published: Friday, January 23, 2015, 18:54 [IST]
Desktop Bottom Promotion