For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్ నట్స్ ప్రతి రోజూ తినడానికి గల విలువైన కారణాలు

వాల్ నట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి గల కారణాలు

|

walnutని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము . వాల్ నట్ శాస్త్రీయ నామము " జుగ్లాన్స్ రెజియా (jugulans Regia) అంటారు. అయితే ఈ వాల్ నట్ తినడానికి అందరూ ఇష్టపడరు. చాలా మంది ఈ పండు లేదా విత్తనాలు(డ్రై ఫ్రూట్స్ )తినడానికి ఇష్టపడకపోవడానికి ప్రధాణ కారణం ఇది బిట్టర్ టేస్ట్ కలిగి ఉండటం .

కానీ, వాల్ నట్ ఆరోగ్య పరంగా చాలా గొప్పగా సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది . అంతే కాదు ఆరోగ్య నిపుణుల ప్రకారం వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతుంది మరియు ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

చాలా మంది ఈ వాల్ నట్స్ ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తార్. ఈ డ్రైఫ్రూట్ చూడటానికి అచ్చు బ్రెయిన్ పోలికను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. అనడమే కాదు అది అక్షరాలా నిజం కూడా ఎందుకంటే మెదడుకు సంబంధించిన సమస్యలను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. వాల్ నట్స్ ను ప్రతి రోజూ ఎందుకు తినాలన్న విషయాన్ని మీరు తెలుసుకున్నట్లైతే కనుక ఆశ్చర్యానికి గురికాక తప్పదు . ఈ వాల్ నట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీరు ప్రతి రోజూ తీసుకొనే ఒక గ్లాసు పాలతో సమానం.

ముఖ్యంగా ఈ నట్స్ ను నీటిలో నానబెట్టి, రెండింటిని తర్వాత రోజు ఉదయం తీసుకోవడం మరింత ఆరోగ్యం. మరి ప్రతిరోజూ కనీసం 5 వాల్ నట్స్ అన్నా తినాలి. మరి ఎందుకు తినాలి అన్న విషయం ఈ క్రింది స్లైడ్ ద్వార గుర్తించవచ్చు...

1.బరువు తగ్గిస్తుంది:

1.బరువు తగ్గిస్తుంది:

వాల్ నట్స్ బరువు తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో కొన్ని టన్నులు ప్రోటీనులు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని సంత్రుప్తి పరుస్తుంది. బరువు తగ్గించుకోవాలనే ప్లాన్ లో ఉన్నవారు ఆహారం ఒక ఐడియల్ ట్రీట్ వంటిది.

2. మంచిగా నిద్రపట్టిస్తుంది:

2. మంచిగా నిద్రపట్టిస్తుంది:

వాల్ నట్స్ లో మెలటోనిన్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి . ఈ కాంపౌండ్స్ మన శరీరంలో అవసరం అయిన అవయవాలకు అవసరం అయినా సిగ్నెల్స్ ను (లైట్ అండ్ డార్క్ )అందిస్తాయి. ఇది మనం గాఢంగా నిద్రించడానికి సహాయపడుతాయి.

3. హార్ట్ కు చాలా మేలు చేస్తుంది:

3. హార్ట్ కు చాలా మేలు చేస్తుంది:

ప్రతి రోజూ వాల్ నట్ తినడానికి మరో ముఖ్య కారణం, హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది . వాల్ నట్స్ లో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి . ఇవి అన్ని రకాల హార్ట్ డిసీజసెస్ ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

4. డయాబెటిస్:

4. డయాబెటిస్:

వాల్ నట్స్ ను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా తీసుకొనే ఆహారంగా గుర్తించాలి. ముఖ్యంగా మహిళల రెగ్యులర్ డైట్ లో ఇది తప్పనిసరి. మహిళల్లో టైప్ 3 డయాబెటిస్ ను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

5. స్పెర్మ్:

5. స్పెర్మ్:

ఎవరైతే వంద్యత్వంతో బాధపడుతున్నారో అలాంటి వారు వాల్ నట్స్ ను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా హెల్త్ స్పెర్మ్ (వీర్యకణాలు)పొందడంతో పాటు, వాటి కదిలిక సామర్థ్యం, చురుకుగా ఉండేందుకు సహాయపడుతాయి.

6. ఇది బ్రెయిన్ ఫుడ్ :

6. ఇది బ్రెయిన్ ఫుడ్ :

వాల్ నట్ తినడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా మెదడు మీద ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. వాల్ నట్ లో విటమిన్ ఇ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉండి, జ్ఝాపకశక్తిలోపానికి గురిచేసే, హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్ ను నాశనం చేస్తుంది.

7. ప్యాక్రియాటిక్ క్యాన్సర్ తో పోరాడుతుంది:

7. ప్యాక్రియాటిక్ క్యాన్సర్ తో పోరాడుతుంది:

ప్యాక్రియాటిక్ క్యాన్సర్ ను తగ్గించుకోవడానికి లేదా రాకుండా నివారించడానికి ముందు జాగ్రత్తగా ప్రతి రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తినడం అలవాటు చేసుకోవాలి.

8. దీర్ఘకాలంలో హెల్తీ జీవించడానికి:

8. దీర్ఘకాలంలో హెల్తీ జీవించడానికి:

జీవినశైలి మరింత ఆరోగ్యకరంగా మరియు దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నట్లైతే వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తినాలి. దాంతో మీరు ఫిట్ గా మరియు హెల్తీగా ఉండటమే కాదు, ఆయుష్యు కూడా పెంచుకోవచ్చు.

9. గర్భధారణ సమయంలో :

9. గర్భధారణ సమయంలో :

వాల్ నట్స్ ను ప్రతి రోజూ తీసుకోవడానికి మరో కారణం వీటిలో ఉండే కాంపౌండ్స్ వల్ల పొట్టలో పెరిగే పిండంకు ఎలాంటి అలర్జీలు కలగకుండా వాల్ నట్స్ తగిన వ్యాధినిరోధకతను పెంచుతాయి.

10. స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తాయి:

10. స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తాయి:

కొన్ని పరిశోధల ప్రకారం వాల్ నట్స్ లేదా వాల్ నట్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా రెస్టింగ్ బ్లడ్ ప్రెజర్ మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

English summary

11 Reasons To Eat Walnuts Everyday

Walnuts are good for one's health as they help to reduce the chance of cancer, reduces diabetes and also speeds up the weight loss regime. Experts state that consuming walnuts everyday is also good for your health as it boosts the metabolism and increases energy.
Desktop Bottom Promotion