For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు ఖచ్చితంగా తినాల్సినటువంటి 12బెస్ట్ ఫుడ్స్

|

ప్రతి రోజూ మనం ఏదో ఒక ఆహారాన్ని తీసుకొంటుంటాం. అయితే ఏఏ ఆహారాలు ఎలా పనిచేస్తాయో, అన్ని విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. ఏం తినాలి? అనే విషయంలో మనకెప్పుడూ సందేహమే. శరీరానికి పోషకాలు అందాలి...అదే సమయం లోబరువు పెరగకూడదు. స్త్రీ, పురుషులు కోరుకునేది ఇదే. మామూలుగానే పురుషులకంటే స్త్రీలు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు అదనంగా పాటిస్తుంటారు. తినే ఆహారంలో కొన్ని రకాలు మహిళలు పూర్తిగా ఉపయోగపడతాయి.శరీరం ఒకే బరువున్న స్త్రీపురషులు ఒకే రకమైన కొవ్వునిల్వలు కలిగివున్నా, వారు వ్యాయామం ద్వారా ఖర్చుచేసే కేలరీలు కూడా ఒక్కటే అయినా స్త్రీపురుషులకు కాలరీల అవసరం మాత్రం వేరు వేరుగా ఉంటుంది. మగవారిలో కండరాలు పెద్దగా ఉండటం వలన వారు వ్యాయామం చేయకపోయినా కండరాలు యథాస్థితిగా ఉండటానికైనా కేలరీలు అవసరం అవుతాయి. READ MORE: పురుషులకు 20 అత్యుత్తమమైన ఆహారాలు

అందుకే మగవారిలో మహిళలకంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మహిళలు చిన్న పరిమాణంలో ఉండటం వలన కండరాలు కూడా చిన్నగా ఉండటం కారణంగా వారిలో ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. అందుకే స్త్రీలకు పోషకారం అందాలి. అదే సమయంలో తక్కువ కేలరీలు ఉండాలి. సాధారణంగా మహిళలకు రోజుకి 1200కేలరీలు అవసరం అవుతాయి. మగవారికి మరికొన్ని ఎక్కువ కావాలి. మరి పురుషులకు అన్ని క్యాలోరీలను అందించి.. ప్రత్యేకంగా ఉపయోగపడే ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మగవారు వారు తీసుకొనే ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన కొన్ని రకాల డైయట్ ఫుడ్ లిస్ట్ మీకోసం...

టమోటోలు:

టమోటోలు:

టమోటోలో చాలా ఉపయోగకరమైన వెజిటేబుల్. అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీ పార్లలో ఫేస్‌మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు. లైకోపిన్ అనే ఎంజైమ్ వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

 ఓయిస్ట్రెస్:

ఓయిస్ట్రెస్:

ముఖ్యంగా పురుషులు వివాహానికి ముందు తీసుకోవల్సిన ఆహారల్లో ఒకటి ఓయిస్ట్రెస్ . ఇది ఒక నేచురల్ లిబిడో టైప్ ఫుడ్ . ఇది మంచి మూడ్ పొందడానికి ఒక ఉత్తమ మైన ఆహారం.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి గుండెకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే..కొలెస్ట్రాలోను తగ్గించడంలో ఇది ముందుంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ప్రతి రోజూ వెల్లుల్లిని మరియు ఉల్లిపాయను తినడం వల్ల ప్రొటెస్ట్ క్యాన్సర్ బారీన పడకుండా సహాయపడుతుంది.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు. కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు సమకూరుతాయి.

చేపలు:

చేపలు:

మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

 గుడ్లు:

గుడ్లు:

గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. ప్రోటీన్లు: శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్‌ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

ఇది చిన్న పువ్వు వలె ఉంటుంది. ఈ ఆకుపచ్చ కూరగాయ చప్పిడి రుచిలో ఉన్నా కానీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది. ఇది క్యాన్సర్ ఉత్పత్తి కణాల యొక్క ప్రభావాన్ని తటస్థీకరించడానికి మరియు కాలేయం ఉద్దీపన కొరకు కొన్ని ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక విటమిన్ సి కూడా కలిగి ఉంటుంది.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

 దానిమ్మ:

దానిమ్మ:

అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల, విటమిన్స్, మినిరల్స్ సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది .దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది.

బాదం

బాదం

బాదంలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. బాదం హార్ట్ కు మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే ఒక హెల్తీ ఫుడ్ . అందుకే పురుషులు తప్పని సరిగా వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

 క్వీనా:

క్వీనా:

క్వీనాలో కాల్షియం ప్రధాన వనరులుగా దొరుకుతుంది. ప్రతి 100 గ్రాముల క్వీనాలో 300 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది పురుషుల్లో బోలు ఎముకలను నిరోధిస్తుంది. అంతేకాక డిస్లిపిడెమియా నియంత్రణ,మధుమేహం,బరువు పెరుగుదలను నియంత్రణలో సహాయపడుతుంది. జింక్ మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలాలను కలిగి ఉంది.

బీఫ్:

బీఫ్:

కార్నితినే సమృద్ధిగా ఉండే ఒక రకమైన బీఫ్(గొడ్డుమాంసం)లో అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. గొడ్డు మాంసం ఒక సంపూర్ణ ప్రోటీన్ యొక్క మూలంగా ఉన్నది. అలాగే ఇనుము వంటి అత్యవసర ఖనిజంను కూడా అందిస్తుంది.

English summary

12 Best Foods For Men To Eat

Guys, there are a lot of foods you can eat. But, there are some foods you need to focus on a little extra. Foods which are rich in protein and calcium is a must to add to your daily diet. These are the foods which give you more energy to pull through the day.
Desktop Bottom Promotion