For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ డైట్ లో సోయా ఎందుకు చేర్చుకోవాలి-సోయా ప్రయోజనాలేంటి

|

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది . మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు . త్వరగా జీర్ణము అవుతుంది . అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను . శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు , లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది . సోయద్వారా లబించే మాంసకృత్తులు -- పాలు , మాంసము , కోడిగుడ్ల తో సరిసమానము . పై గా కొలెస్టిరాల్ , లాక్టూజ్ (Lactose)లేని ఆహారము . పీచు అధికము , కేలోరీస్ పరిమితము మంచి రకానికి చెందిన ' లైపిడ్స్ ' ఉన్నాయి. నిద్రపుచ్చే సోయా! ముట్లుడిగిన (మెనోపాజ్‌) మహిళల్లో చాలామంది నిద్రలేమితో సతమతమవుతుంటారు.వీరికి సోయాబీన్స్‌లోని ఈస్ట్రోజెన్‌ వంటి రసాయనాలు ఎంతగానో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

సోయాబీన్స్‌లో ప్రోటీన్ల మోతాదు ఎక్కువ. వీటిని సోయా పాలు, సోయా పేస్ట్‌, టోఫూ రూపంలోనూ తీసుకోవచ్చు. మామూలు పాలలో మాదిరిగానే సోయా పాలలోనూ ప్రోటీన్‌ ఉంటుంది. సోయా ప్రొడక్ట్స్ లో ప్రోటీనులు, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఉడికించిన సోయా ప్రొడక్ట్స్ లో దాదాపు 35గ్రాముల ప్రోటీనులుంటాయి . సోయా ఉత్పత్తులు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి..

1. గుండె సంబందిత వ్యాధుల నుండి రక్షణ

1. గుండె సంబందిత వ్యాధుల నుండి రక్షణ

జంతువుల నుండి పొందే ప్రోటీన్'ల కన్నా సోయా నుండి పొందే ప్రోటీన్'లు తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలను పొందేలా చేస్తాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. 'యూ.ఎస్. ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్' వారు విడుదల చేసిన గుండెకు ఆరోగ్యాన్ని సమకూర్చే ఆహార పదార్థాల పట్టికలో సోయా కూడా ఉంది.

2. పౌరుష గ్రంధి క్యాన్సర్ నివారణ

2. పౌరుష గ్రంధి క్యాన్సర్ నివారణ

సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రోజేన్'లను కలిగి ఉంటుంది, ఈ హార్మోన్ పురుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ విధంగా టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుదల వలన పౌరుష గ్రంధి క్యాన్సర్ పెరుగుదల కూడా తగ్గుతుంది.

3. పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

3. పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

సోయా ఉత్పత్తులు శరీరంలో కోలన్ క్యాన్సర్ లేదా పెద్దపేగు క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తుంది అని శాస్త్రీయ పరమైన రుజువులు ఉన్నాయి. అంతేకాకుండా, సోయా ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థ మరియు అన్న వాహికను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4. ఎముకల బలాన్ని పెంచుతుంది

4. ఎముకల బలాన్ని పెంచుతుంది

సోయా ఉత్పత్తులు కలిగి ఉండే ఫైటో ఈస్ట్రోజేన్'లు శరీరంలో కాల్షియం గ్రహించటాన్ని అధికం చేసి, ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది. ఎముకల బలాన్ని పెంచుకోటానికి, విటమిన్ 'D' మరియు కాల్షియం అధికంగా ఉన్న సోయా ఉత్పత్తులను కొని రోజు వాడటం వలన ఎముకలు దృడంగా అవుతాయి.

5. రోగనిరోధక శక్తిని పెంచుతాయి

5. రోగనిరోధక శక్తిని పెంచుతాయి

సహజ సిద్ద డిటర్జెంట్'లుగా పేర్కొనబడే, సాపోనిన్'లను సోయా ఉత్పత్తులు కలిగి ఉంటాయి. ఇవి పేగులలో కొవ్వు పదార్థాలతో బందాన్ని ఏర్పరుచుకొని శరీరంలోకి గ్రహింపబడకుండా చేస్తాయి, అంతేకాకుండా ఈ సాపోనిన్'లు సూక్ష్మజీవులను చంపి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

6. మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

6. మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్న సోయా ఆహారాలను తీసుకోవటం వలన, శరీర రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీర కణాలు ఇన్సులిన్'ను గుర్తుపట్టేలా చేసి, ఈ హార్మోన్ వలన కణాలలో గ్లూకోస్ గ్రహించాటాన్ని అధికం చేస్తాయి.

7. మూత్రపిండాల సంరక్షణ

7. మూత్రపిండాల సంరక్షణ

సోయా సంబంధిత ఆహార పదార్థాలు మూత్రపిండాల విధిని సులభతరం చేస్తాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధులతో భాదపడే వారు సోయా ఆహారాలను వారి రోజు ఆహర పత్యంలో కలుపుకోవటం వలన వ్యాధి సమస్యలు తగ్గుతాయి. సోయా ఉత్పత్తులు జంతువుల నుండి లభించే ప్రోటీన్'లను బదిలీ చేయటమే కాకుండా, విసర్జక పదార్థాల ద్వారా భయటకి పంపబడే ప్రోటీన్'ల నష్టాన్ని తగ్గిస్తుంది మరియు శరీరంలో పెరిగే ట్రై-గ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

8. రొమ్ము క్యాన్సర్ తగ్గుదల

8. రొమ్ము క్యాన్సర్ తగ్గుదల

సోయా ఉత్పత్తులు ఐసో ఫ్లావనాయిడ్స్'లను కలిగి ఉంటాయి, ఇవి ఫైటో ఈస్ట్రోజేన్'ల వ్యవహరిస్తాయి. ఫైటోఈస్ట్రోజేన్ అనే రసాయనికాలు ఈస్ట్రోజేన్ చర్యను తటస్థీకరణం చెందించి, ట్యూమర్'ల ఏర్పాటును తగ్గిస్తుంది లేదా DNA మార్పులో జరిగే కణాలు రెట్టింపును అరికడుతుంది

9. రుతుక్రమం

9. రుతుక్రమం

రుతుక్రమం సమయంలో, ఈస్ట్రోజేన్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. దీని ఫలితంగా, వారు డిప్రెషన్, మానసిక కల్లోలాలకు, నిద్రలేమి మరియు ఇతరేతర మానసిక రుగ్మతలకు గురవుతుంటారు. సోయాలో ఫైటోఈస్ట్రోజేన్'లు ఉండటం వలన వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి.

10. తక్కువ LDL స్థాయిలు

10. తక్కువ LDL స్థాయిలు

సోయా ఉత్పత్తులను తినటం వలన అందులో ఉండే ప్రోటీన్'లు శరీరంలో ఉండే HDL స్థాయిలను ప్రభావిత పరచకుండా, LDL స్థాయిలను మరియు ట్రై-గ్లిసరైడ్'లను తగ్గిస్తాయి అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పాలీఅన్-సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉండే సోయా వంటి ఆహార పదార్థాలు నేరుగా శరీరంలో ఉండే LDL స్థాయిలను తగ్గిస్తాయి.

11. కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గిస్తుంది: సోయా ప్రొడక్ట్స్

11. కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గిస్తుంది: సోయా ప్రొడక్ట్స్

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. కాబట్టి వీటిలో సహజంగానే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించే లక్షణాలున్నాయి.

12.ఫెర్టిలిటి సమస్యను నివారిస్తుంది

12.ఫెర్టిలిటి సమస్యను నివారిస్తుంది

సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

English summary

12 Reasons Why You Need Soy Daily - Soy Benefits

Soy is the most nutritious known to man. Its benefits have no match for humans and agriculture. The plant's properties is such that it can be grown on the land over and over again. With plenty of proteins, soy is the product for children, adults and even the aged. Today, we will discuss on soy benefits and talk more about isoflavones.
Story first published: Saturday, January 24, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion