For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటల్లో పసుపు వాడకం ఎక్కువైతే కలిగే దుష్ప్రభావాలు

|

మన భారతీయ వంటకాల్లో ప్రతి వంటలో ఉపయోగించే ఒక మసాలా దినుసు పుసుపు. ఇది ఒక గొప్ప ఔషధగుణాలున్న మసాలా దినుసు. అంతే కాదు, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే పూర్వ కాలం నుండి వివిధ రకాల జబ్బులను నివారించడంలో పసుపును విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి గొప్ప ఔషధగుణాలున్న మసాలా దినుసులో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

గోరువెచ్చని పసుపుపాలలోని గొప్ప ఔషధగుణగణాలు.!గోరువెచ్చని పసుపుపాలలోని గొప్ప ఔషధగుణగణాలు.!

మన నిత్యం వంటగదిలో, ప్రతి వంటకు ఉపయోగించే పసుపుతో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయని చాలా మందికి తెలియదు. ఇన్నీ సంవత్సరాలు, పసుపును ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఒక ఉత్తమ పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తగిలిన గాయాలను, తెగిన గాయాలను నయం చేస్తాయని పసుపును విరివిగా ఉపయోగిస్తుంటారు . అందువల్ల, ఈరోజు కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కొన్ని దుష్రభావాలు కూడా ఏర్పడుతాయని నిర్ధారించారు.

మీ ఆహారంలో పసుపును చేర్చటానికి 10 కారణాలుమీ ఆహారంలో పసుపును చేర్చటానికి 10 కారణాలు

మీరు తయారుచేసే ప్రతి ఒక్క వంటలోనూ పసుపు జోడించడంతో , ఆరోగ్యానికి వివిధ రకాలుగా హాని కలిగిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రాకారం, పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది చర్మానికి హానికలిగిస్తుంది. దురద పెడుతుంది మరియు డ్రైగా మారుతుంది. ఇది పొట్ట లైనింగ్ కు హాని కలిగిస్తుంది. దాని వల్ల గ్యాస్టిక్ సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది.

ఇదొక్కటే కాదు పసుపు వాడకం ఎక్కువైతే మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే....

అలర్జీ

అలర్జీ

ఇండియన్ మసాలా దినుసులతో మీరు అలర్జీకి గురి అవుతుంటే, పసుపు ఉపయోగించేప్పుడు మీరు కేర్ ఫుల్ గా ఉండాలి. పసుపు మరింత ఎక్కువ అలర్జీని కలిగిస్తుంది.

గాల్ బ్లాడర్ సమస్య

గాల్ బ్లాడర్ సమస్య

పసుపు గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడటానికి కారణం అవుతుంది. మరియు గ్యాస్టోఫాజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనే వ్యాధికి గురిచేస్తుంది. పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇది ఒక సైడ్ ఎఫెక్ట్.

కాలేయ సమస్యలు

కాలేయ సమస్యలు

లివర్ ఇన్ఫ్లమేషన్ కు గురిఅయ్యే వారు, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడే వారు పసుపును ఖచ్చితంగా నివారించాలి. పసుపులో ఉండే గుణాలు, మరింత కాలేయ సమస్యలను పెంచుతుంది.

గర్బిణీ స్త్రీలకు హానికలిగిస్తుంది

గర్బిణీ స్త్రీలకు హానికలిగిస్తుంది

గర్భిణీలు వారి త్రాగే పాలల్లో కొద్దిగా పసుపు చేర్చి త్రాగడం వల్ల పుట్టే పిల్లలు అందంగా పుడుతారని పసుపు పాలను సేవిస్తుంటారు. అయితే పసుపు చేర్చడం వల్ల ప్రీమెచ్యుర్ యుటేరియన్ కాంట్రాక్షన్, యుటేరియన్ బ్లీడింగ్ లేదా యుటేరియన్ లో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

డయాబెటిక్ మెడికేషన్

డయాబెటిక్ మెడికేషన్

పసుపు డయాబెటిక్ పేషంట్స్ కు మంచిదని అంటుంటారు . అయితే ఎక్కువగా తీసుకోడం వల్ల లో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ కు దారితీస్తుంది.

ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు

ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు

కొన్ని సందర్భల్లో, పసుపు తీసుకోవడం వల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది . కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల స్పెర్మ్ (వీర్యకణాలను)తగ్గిస్తుందని నిర్ధారించారు.

ఐరన్ లోపం

ఐరన్ లోపం

పసుపులో ఒక క్రమమైన లోపం ఉంది . ముఖ్యంగా ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతున్నారో. వారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల అనీమియాతో బాధపడే వారు పసుపును నివారించాలి.

సర్జరీ తర్వాత హని కలిగిస్తుంది

సర్జరీ తర్వాత హని కలిగిస్తుంది

పసుపును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియను నిరోధిస్తుంది. అందువల్ల కేవలం శస్త్రచికిత్స పొందిన రోగులకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలు

గ్యాస్ట్రిక్ సమస్యలు

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. దాంతో డయేరియా మరియు మలబద్దకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది

వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది

పసుపు వ్యాధినిరోధకత మీద కూడా ప్రభావం చూపుతుంది

వికారాన్ని పెంచుతుంది

వికారాన్ని పెంచుతుంది

వంటల్లో ఎక్కువగా పసుపును ఉపయోగించడం వల్ల వికారాన్ని పెంచుతుంది.

మైగ్రేన్ తలనొప్పి

మైగ్రేన్ తలనొప్పి

పసుపు వాడకం ఎక్కవైతే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది . భోజనం చేసిన తర్వాత తలనొప్పితో బాధపడుతున్నట్లైతే, మీ ఆహారంలో పసుపును నివారించాలి.

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్

కొన్ని సందర్భాల్లో, పసుపు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో, మరియు క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో పసుపు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ వ్యతిరేక ప్రభావం చూపుతుంది . అందువల్ల పసుపు వాడకాన్ని తగ్గించుకోవాలి.

కిడ్నీ స్టోన్స్ కు మంచిది కాదు

కిడ్నీ స్టోన్స్ కు మంచిది కాదు

పసుపు వాడకం ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుటకు కారణం అవుతుంది.

English summary

14 Side Effects Of Using Turmeric Powder

Turmeric is one of the main ingredients used in almost every Indian dish. Though it has multiple health benefits, it also has its share of side effects.
Desktop Bottom Promotion