For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలి తీర్చడానికి.. ఆరోగ్యం మెరుగుపరచడానికి హెల్తీ స్నాక్స్

By Nutheti
|

బరువు తగ్గాలని కోరుకుంటున్నారా ? బరువు తగ్గడం కోసం.. ఆహారం తక్కువగా తీసుకుంటున్నారా ? అయితే స్నాక్స్ రూపంలో ఫ్యాట్ ఫుడ్స్ లాగించేస్తున్నారేమో చెక్ చేసుకోండి. అలా ఫ్యాట్ ఉండే స్నాక్స్ తీసుకుంటే.. మీరు చేసే డైట్ వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి చిరుతిల్లు, స్నాక్స్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. స్నాక్స్ ని హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.

ఆకలిగా ఉన్నప్పుడు ఏది పడితే అది తిన్నారో అంతే సంగతులు. ఏవి తీసుకున్నా.. సరైన పోషకవిలువలు ఉన్నవి, తక్కువ క్యాలరీలు ఉన్న వాటిని ఎంచుకుంటే మంచిది. ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఎలా ఉండాలో చూద్దాం.. ఆకలి తీర్చడానికి.. ఆరోగ్యాన్ని అందించడానికి టాప్ 7 స్నాక్ ఐటమ్స్ మీకోసం..

ఆపిల్

ఆపిల్

రోజూ ఒక యాపిల్ తిన్న వాళ్లకు డాక్టర్ అవసరం లేదన్నమాట వాస్తవమే. ఎందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు చాలా ఉన్నాయి. యాపిల్ ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే.. ఆరోగ్యంతో పాటు ఆకలి తీరుతుంది. ఇందులో ఉండే క్యాలరీలు, ఫైబర్ శరీరానికి మేలు చేకూరుస్తాయి.

పాప్ కార్న్

పాప్ కార్న్

పాప్ కార్న్ అందరూ ఇష్టపడే స్నాక్. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు.. ఒక కప్పు పాప్ కార్న్ లాగించేయండి. టేస్ట్ తో పాటు.. ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

నట్స్

నట్స్

ఉద్యోగులు ఎక్కువగా పని ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి.. బ్యాగ్ లో లేదా.. మీ క్యాబిన్ లో డ్రైఫ్రూట్స్ ని పెట్టుకోండి. ఆకలిగా అనిపించినప్పుడు నట్స్ తీసుకోండి. వీటిలో అన్ సాచురేటెడ్ ఫాట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. వేరు శనగలు తీసుకున్నా ఆరోగ్యమే.

జ్యూస్

జ్యూస్

ఆకుపచ్చని కూరగాయలు శక్తిని పెంచుతాయి, కాబట్టి వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవటం వలన త్వరగా శక్తి అందుతుంది. గ్రీన్ జ్యూస్ వలన యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రీయంట్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి శక్తిని ఉత్పత్తి చేసే కారకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. అంతేకాదు.. త్వరగా జీర్ణమై.. రోజంతా యాక్టివ్ గా హెల్తీగా ఉండటానికి తోడ్పడతాయి.

స్మూతీస్

స్మూతీస్

ఇష్టమైన పండ్లు తింటారు. కానీ కొంతమంది కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉంటారు. కానీ వాటిలో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరమవుతాయి. కాబట్టి.. పండ్ల రూపంలో తినలేకపోయినప్పుడు.. మిల్క్ షేక్స్ రూపంలో తీసుకుంటే బెటర్.

కోడిగుడ్లు

కోడిగుడ్లు

ఉడికించిన కోడిగుడ్ల ద్వారా ప్రొటీన్లు అందుతాయి. వీటిని పనిలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి హెల్తీ స్నాక్ గా ఆరగించేయవచ్చు.

ఫ్రూట్ సలాడ్

ఫ్రూట్ సలాడ్

ఒకే పండు తినాలంటే బోర్ గా ఉంటుంది. కాబట్టి.. రకరకాల ఫ్రెష్ ఫ్రూట్స్ తో సలాడ్ తయారు చేసుకుని తీసుకుంటే.. హెల్తీ స్నాక్ రెడీ అయిపోతుంది. వీటి ద్వారా త్వరగా శక్తి అందుతుంది.

English summary

7 Healthy Snacks To Curb Hunger : health tips in telugu

Hunger is a weakness that cannot be tolerated by anybody. As all know, food is one of the basic needs of humans. Staying deprived of food for longer periods of time can result to food deprivation, tiredness, fatigue and in serious conditions may hamper the working of our vital body systems.
Story first published: Friday, October 9, 2015, 10:21 [IST]
Desktop Bottom Promotion