For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం

By Nutheti
|

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని తెలుపుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి.

మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది.

విటమిన్లు

విటమిన్లు

విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి. టమాట, బంగాళదుంప, నారింజ, నిమ్మ, కమలా, కివి వంటి వాటిలో విటమిన్‌ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది.

జింక్

జింక్

శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి ఏర్పడటానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడిగుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్‌ తోపాటు సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు

పెరుగు

ఎంతో రుచికరంగా ఉండే పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్

కెరోటిన్

క్యారెట్ కంటికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

ప్రతి వంటకానికి రుచితో పాటు.. సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్‌ బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. మీ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుంటే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్

ఐరన్

ఐరన్ శరీరానికి చాలా అవసరం. ఇది బెల్లంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్వీట్లు ఇష్టపడే వాళ్లు చక్కెరకు బదులు బెళ్లంతో చేసిన తీపి పదార్థాలు తినడం మంచిది. లేదా.. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్‌ అందుతుంది.

పొటాషియం

పొటాషియం

పండ్ల ద్వారా పొటాషియం అందుతుంది. అరటిపండు, ఆప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోదాతులో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

English summary

7 Power Foods That Boost Immunity: health tips in telugu

As we head into winter, it's a good time to boost immunity to avoid nasty colds and the flu. Nutritionist Claire Turnbull gives us the low-down on six immune-boosting foods.
Story first published: Wednesday, October 7, 2015, 9:49 [IST]
Desktop Bottom Promotion