For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ కె ఆహారాలు మనం రెగ్యులర్ ఎందుకు తినాలి?లాభనష్టాలేంటి

|

విటమిన్‌ కె : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఇక ముఖ్యమైన విటమిన్ ఇది. ఇది కొవ్వులో కరిగే విటమిను. రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. మరియు విటమిన్ కె వల్ల మరో ప్రధానమైనటువంటి పాత్ర ఎముక మరియు ఇతర కణజాలము లో కొన్ని జీవక్రియలకు సహకరింస్తుంది మరియు ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. విటమిన్స్ అనగానే, విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యాన్ని ఉపయోగపడేవని గుర్తించాలి.

విటమిన్ కె లో విటమిన్‌ కె1 , విటమిన్‌ కె2 అని రెండు రకాలు. విటమిన్‌ కె1 ని విటమిన్‌ కెజె (ఫిల్లొక్వినోన్‌) అని కూడా పులుస్తారు. విటమిన్‌ కె1 - మొక్కలలో తయారవును. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్‌ లలోను లభించును. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్‌ కె1 ను విటమిన్‌ కె2 గా మార్చుతు ఉండును. విటమిన్‌ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును. విటమిన్‌-కె కుత్రిమ తయారీ రకాలు లో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. కె1, కె2 విటమిన్లు హానికరము కావు. కుత్రిమ తయారీ విటమిన్లు కె3 (menadione) కొంతవరకు హానికరమని చెప్పబడుతున్నది.

READ MORE: రక్తం గడ్డకట్టకుండా గుండెను కాపాడే విటమిన్ కె

ఆరోగ్యకరమైన బోన్స్ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది చెందకుండా శరీరానికి కాపాడుతుంది. రీసెంట్ గా విటమిన్ కెను విటమిన్ డిగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే విటమిన్ కె మరియు విటమిన్ డి రెండింటిలోనూ ఒకే విధమైన కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో విటమిన్ డి'ది కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి విటమిన్ డి పొందాలన్నా, విటమిన్ కె ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

డార్క్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బ్రొకోలీలో 220మిల్లీగ్రాములు విటమిన్ కె ఉంటుంది.

కాలే:

కాలే:

కాలే ఒక హెల్తీ ఫుడ్. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.

పార్ల్సే:

పార్ల్సే:

పార్ల్సే ఆరోమాటిక్ వాసన కలిగి ఉంటుంది . ఇందులో విటమిన్ ఎ, సి మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో విటమిన్ కె, విటమిన్ సి మరియు విటమిన్ బి6 ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు క్యాన్సర్ నివారించడానికి సహాయపడుతుంది.

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు:

గ్రీన్ పీస్ లో విటమిన్ ఎ, సి, మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిబఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంది మరియు ఫ్యాట్ తక్కువ, రెగ్యులర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను గ్రేట్ గా మెయింటైన్ చేస్తుంది మరియు స్టొమక్ క్యాన్సర్ నివారిస్తుంది.

 తులసి:

తులసి:

తులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.1/4కప్పు తులసి ఆకులో మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటుంది.

మస్టర్డ్ గ్రీన్:

మస్టర్డ్ గ్రీన్:

మస్టర్డ్ గ్రీన్ ఒక అద్భుతమైన న్యూట్రీషియన్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ . ఇది విటమిన్ కె, ఎ మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి. మస్టర్డ్ గ్రీన్ బోన్ యొక్క ఓస్టిరియోఫోసిస్ ను ప్రోత్సహిస్తుంది.

English summary

Eight Foods That Are Rich In Vitamin K: Health Tips in Telugu

Vitamin K is associated with blood clotting. Vitamin K tremendously contributes towards health. It is important for blood clotting, strong bones and cell growth. Without Vitamin K, your body would not be able to clot the blood.
Story first published: Wednesday, August 26, 2015, 18:14 [IST]
Desktop Bottom Promotion