For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

|

పెరుగును వేసవి సీజన్ తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజాలేవైనా ఉన్నాయా? అవుననే అంటున్నాయి పరిశోధనలు. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ లో ఒకటైన పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల పెరుగును రెగ్యులర్ గా తీసుకోవాలి.

అయితే పెరుగు వేసవికాలంలో తీసుకోవడం మంచిదా? పెరుగును వివిధ రూపాల్లో తీసుకోవచ్చు . పెరుగును నేరుగా తీసుకోవడం కంటే, అందులో నీరు కలిపి బాగా చిలికించి లేదా మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి అదులో నీరు ఎక్కువగా పోసి తీసుకోవడం వల్ల వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. బాడీ హీట్ ను తగ్గిస్తుంది.

అయితే ఎసిడిటితో బాధపడే వారు పెరుగు తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి. ఎవరైతే ల్యాక్టోజ్ లోపంతో బాధపడుతున్నారో, అటువంటి వారు కూడా పెరుగును ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు . ఆహారంతో పాటు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల హోం రెమెడీస్ తో తీసుకోవడం వల్ల పెరుగుతో అనేక ప్రయోజనాలున్నాయి.

మనం తీసుకొనే అన్ని ఆహారాల్లో కంటే పెరుగులో అధిక న్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందువల్లే మన ఇండియన్ రిసిపిలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . మన ఇండియాలో మనం తీసుకొనే ప్రతి మీల్లోనూ కర్డ్ రైస్ తప్పని సరిగా ఉంటుంది.

READ MORE: వేసవి తాపాన్ని తీర్చే లస్సీలో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు

కాబట్టి, వేసవిలో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

స్టొమక్ సమస్యను నివారిస్తుంది:

స్టొమక్ సమస్యను నివారిస్తుంది:

పెరుగు కొన్ని ప్రత్యేకమైన పొట్ట సమస్యలను నివారిస్తుంది . వేసవిలో పెరుగు తినడానికి ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వేసవిలో పెరుగును తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, వివిధ రకాల జబ్బుల నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

న్యూట్రీషియన్స్ గ్రహిస్తుంది:

న్యూట్రీషియన్స్ గ్రహిస్తుంది:

వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరం న్యూట్రీషియన్స్ ను గ్రహిస్తుంది.

ఓస్టిరియో ఫోసిస్:

ఓస్టిరియో ఫోసిస్:

ఓస్టిరియోఫోసిస్ తో బాధపడుతున్న వారు మితంగా పెరుగును తీసుకోవడం వల్ల ఈ సమస్యను క్రమంగా తగ్గించుకోవచ్చు.

డిసెంటరి(విరేచనాలు):

డిసెంటరి(విరేచనాలు):

మీరు డీసెంట్రీతో బాధపడుతున్నట్లైతే, పెరుగు కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది . విరేచనాలతో బాధపడే వారు మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

పాలలోని ల్యాక్టోజ్ హెల్తీ బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ ల్యాక్టోజ్ గా జీర్ణం అవుతుంది. ప్రతి రోజూ పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది:

ఎముకలను బలోపేతం చేస్తుంది:

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల , దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇదీ ఎముకలను మరియు దంతాలను బలంగా మార్చుతుంది.

ఆకలిని పెంచుతుంది:

ఆకలిని పెంచుతుంది:

ఆకలిని పెంచడానికి పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది.

పైల్స్ నివారిస్తుంది:

పైల్స్ నివారిస్తుంది:

పైల్స్ తో బాధపడే వారు, వారి రెగ్యులర్ డట్ లో పెరుగు చేర్చడం వల్ల చాలా సహాయపడుతుంది. పెరుగుతోపాటు, కొద్దిగా అల్లం చేర్చుకొన్న మంచి ఫలితం ఉంటుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

ఒత్తిడిని తగ్గిస్తుంది:

ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది . పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది.

డీహైడ్రేషన్ నివారిస్తుంది

డీహైడ్రేషన్ నివారిస్తుంది

సమ్మర్ లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో కోల్పోతుంది. కాబట్టి, మజ్జిగను రెగ్యులర్ గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్ లో పెరుగుచేర్చుకోవడం కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది .

 బాడీ హీట్ ను తగ్గిస్తుంది :

బాడీ హీట్ ను తగ్గిస్తుంది :

ఇది ఒక బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రింక్. పెరుగుతో తయారుచేసే మజ్జిగ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు ఇది సన్ స్ట్రోక్ నుండి మనల్ని రక్షిస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది

పెరుగులో ఉండే హెల్తీ బ్యాక్టీరియ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

English summary

Benefits Of Eating Curd In Summer

Are there any benefits of curd in summer? Well, it is rich in calcium, protein and carbohydrates. You can regularly consume curd. But is curd good in summer? Well, though there are different opinions about this, it is a fact that buttermilk cools down your system and therefore it is good to prepare butter milk out of curd and then consume it during summer.
Desktop Bottom Promotion