For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ పండు తింటే.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు ?

By Nutheti
|

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా.. అందరూ ముందుగా సూచించేవి తాజాపండ్లు. రోజూ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతూ ఉంటారు. అన్ని రకాల పళ్లు మంచివే అని సూచిస్తుంటారు.

తాజా పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల సరైన విటమిన్స్ శరీరానికి అందుతాయి. పండ్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే అందరూ పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసా ? ఎలాంటి పండ్లు.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో తెలుసా ? ఏ పండులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బొప్పాయి, పుచ్చకాయ

బొప్పాయి, పుచ్చకాయ

బొప్పాయి, పుచ్చకాయలలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్ ను నియంత్రిస్తుంది. విటమిన్ సి, కె కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది.

ద్రాక్ష, లిచీ

ద్రాక్ష, లిచీ

గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ద్రాక్ష, లిచీ పండ్లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే లిచీ పండ్లు తింటూ ఉండాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.

జామ

జామ

తక్కువ ధరకే దొరికే ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాని కంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, క్యాల్షియం‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది.

కమలా

కమలా

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారి కంటే తక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా కమలా పండ్ల నుంచి లభిస్తుంది.

అరటి

అరటి

ఏడాది పొడవునా దొరికే అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది. రక్తపోటును తగ్గించే పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.

యాపిల్స్

యాపిల్స్

కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది.

నేరేడు

నేరేడు

సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే మంచిది. అలా ప్రకృతి ప్రసాదితమైనది నేరేడు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి. విటమిన్లు, క్రోమియం నేరేడులో పుష్కలంగా ఉంటాయి.

English summary

Benefits Of Eating Fruits Everyday : health tips in telugu

Being healthy is not merely the absence of diseases. It’s a state of healthy harmony of the body, mind and soul. Going with nature is the best thing that you can do to enhance your well-being. It’s a known fact that including fruits in your diet has several health benefits.
Story first published: Tuesday, October 13, 2015, 16:38 [IST]
Desktop Bottom Promotion