For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకంను నివారించే నేచురల్ అండ్ హెల్తీ ఫుడ్స్

|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మలబద్దక సమస్యతో బాదపడుతున్నారు. మలబద్దకానికి కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమే. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

మలబద్దకం దీర్ఘకాలిక సమస్యగా మారినప్పుడు, డాక్టర్ ను సంప్రదించడం చాలా మంచిది మరియు డాక్టర్ ను కలవడం వల్ల డైజెస్టివ్ సమస్యను డయోగ్నైస్డ్ సమస్యను నివారించుకోవచ్చు.

కానీ కొన్ని సందర్భాల్లో, మన శరీరానికి ఫైబర్ చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . మలబద్దక సమస్యను నిర్మూలించడంలోనూ సహాయపడుతాయి.

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో ఫైబర్ సరిపడా తీసుకోకపోతే, మరియు సరిపడా నీరు త్రాగనప్పుడు ఈ మలబద్దక సమస్యకు కారణం అవుతుంది.

కాబట్టి, రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో సరిపడా నీరు మరియు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దాంతో మీ పొట్ట మరియు జీవక్రియలు రెగ్యులర్ గా క్లీన్ అవుతాయి. మరి మలబద్దక సమస్యను నివారించే ఆ ఉత్తమ ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

1. ఆప్రికాట్ :

1. ఆప్రికాట్ :

ఆప్రికాట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మలబద్దకంను నివారిస్తుంది.

2. బీన్స్:

2. బీన్స్:

లెగ్యుమ్ జాతి విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది బౌల్ మూమెంట్ క్రమబద్దం చేస్తుంది . దాంతో మలబద్దక సమస్య నివారించబడుతుంది.

3. ప్రూనె:

3. ప్రూనె:

ప్రూనె లో నేచురల్ లాక్సేటివ్స్ ఉన్నాయి . వీటిలో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందుకే ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

4. బ్రొకోలీ:

4. బ్రొకోలీ:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే . బ్రొకోలీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. గోధుమలు:

5. గోధుమలు:

త్రుణధాన్యాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో బ్రౌన్ రైస్ మరియు బ్రౌన్ బ్రెడ్ ను జోడించుకోండి.

6. బేరి పండ్లు:

6. బేరి పండ్లు:

బేరిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. తొక్కతో సహాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల్లో కూడా మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు.

English summary

Foods That Prevent Constipation

Most of us do suffer constipation at least once a year. There are certain foods that prevent constipation. It is better to consume them regularly.
Story first published: Saturday, May 30, 2015, 15:10 [IST]
Desktop Bottom Promotion