For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాఖాహారుల కోసం ప్రోటీన్స్ ఫుడ్స్ కు మూలం ఈ వెజిటేరియన్ ఫుడ్సే

By Super
|

మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేవి, శరీరంలో మనకు హాని కలిగించే వాటిని తొలగించేవి , మనకి సరిఅయిన ఆకారం ఇచ్చేవి, నిజం చెప్పాలంటే మన జీవత్వానికి మన మనుగడకు ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఈ ప్రోటీన్స్ అన్నీ, శరీరంలో తయారు అయి మన శరీరంలో జీవ కణాలలో ఉంటాయి. మనం చెయ్యవలసిన పనల్లా మనం తినే ఆహారము ద్వారా వాటి తయారుకి కావలసిన ముడి పదార్దములు అందించటమే.

శరీరంలో అభివృద్ధికి ప్రోటీనులు అత్యంత అవసరం. శరీర అభివృద్ధి మరియు పెరుగుదలకు ప్రోటీనులు అత్యంత అవసరం అయినవి. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నపిల్లలకు అత్యంత అవసరం .

READ MORE: బరువు తగ్గించే ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్

1నుండి 3 సంవత్సరాలు కలిగి పిల్లలు కనీసం 13గ్రాముల ప్రోటీన్స్ ను ప్రతి రోజూ తీసుకోవాలి. వయస్సు 4-8 కలిగిన వారు 19 g/ఒక రోజుకు, వయస్సు 9-13 కలిగిన వారు 34 g/రోజుకి, అమ్మాయిల వయస్సు 14-18 కలిగిన వారు46g మరియు అబ్బాయిలు కూడా అదే వయస్సులో 52g తీసుకోవాలి.

READ MORE: అత్యధిక ప్రోటీనులున్న వెజిటేబుల్స్: లాభాలు

అందుకు ఇక్కడ హెల్తీ వెజిటేరియన్ డైట్ టిప్స్ ను అందిస్తున్నాము. ఇవి అత్యంత ఎక్కువగా ప్రోటీనులున్న ఆహారపదార్థాలు . వీటిని ప్రతి రోజూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ :

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీల్లో ఫైబర్, ప్రోటన్స్ శరీరానికి రక్షణ కల్పిస్తాయి మరియు స్టొమక్ క్యాన్సర్ ను నివారిస్తుంది. వీటిని ఉడికించి, నేరుగా లేదా కర్రీల్లో మిక్స్ చేసి వండుకొని తీసుకోవచ్చు . వీటిలో ఒక కప్పు పచ్చిబఠానీల్లో 16గ్రాములు మినిరల్స్ , మరియు విటమిన్స్ కూడా కలిగి ఉన్నాయి.

ఓట్స్ :

ఓట్స్ :

ఉడికించిన ఒక కప్పు ఓట్ మీల్లో 6గ్రాములు ప్రోటీనులున్నాయి. ఇవి బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచిది . వీటిని ఫ్రూట్ సలాడ్స్ మరియు కిచిడి మరియు ఓట్స్ దోసెల రూపంలో తీసుకోవచ్చు

రైస్ మరియు బీన్స్ కాంబినేషన్:

రైస్ మరియు బీన్స్ కాంబినేషన్:

పాత పద్దతే అయినా, ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్లే వీటిని ఇండియన్ మీల్స్ లో రాజ్మా చవ్లాను ఎక్కువగా తీసుకుంటున్నారు.

లెంటిల్స్:

లెంటిల్స్:

కందిపప్పు, పెసరపప్పు, వంటివి మరియు చిరుధాన్యాలు ఉడికించిన ఒక కప్పులో 18గ్రాములు ప్రోటీనులుంటాయి. ప్రతి రోజూ తయారుచేసే వంటల్లో వీటిని ఏదో ఒకరకంగా ఉపయోగిస్తుంన్నారు .

నట్స్:

నట్స్:

బాదం, జీడిపప్పు, పిస్తా ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . ముఖ్యంగా ప్రోటీన్ డైట్ కు చాలా మంది. నట్స్ ను రాత్రుల్లో నీటిలో వేసి నానబెట్టి తర్వాత రోజూ తినడం వల్ల 10 బాదంలో 2.5g ప్రోటీనులు కలిగి ఉంటాయి.

బీన్ :

బీన్ :

రాజ్మా బ్లాక్ బీన్స్, బట్టర్ బీన్స్ (ఉడికించిన ఒక కప్పు బీన్స్ లో )మనం వంటకు ఉపయోగించే వాటిలోనే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ (15g per cooked cup) కలిగి ఉంటాయి. ఇంకా మీరు వీటిని ఉడికించి వాటిలో తాజా కీరదోస, క్యారెట్, మరియు కొత్తిమీర వేసి బీన్స్ సలాడ్ తయారుచేసుకొని తినవచ్చు లేదా బీన్స్ సూప్ తయారుచేసుకోవచ్చు.

విత్తనాలు :

విత్తనాలు :

క్వాటర్ కప్పు గుమ్మడి గింజల్లో (9g) నువ్వుల్లో(6g), ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో(8g) ఉన్నాయి. కాబట్టి వీటిని మీ ప్రోటీన్ సలాడ్స్ లేదా వెజ్జీస్ లో గార్నిష్ లేదా చిలకరించి తీసుకోవచ్చు.

రాగులు:

రాగులు:

రాగులు నాచిన్ /ఫింగర్ మిల్లెట్ లో ప్రోటీన్స్, ఐరన్, క్యాల్షియం, మరియు విటిమన్స్ అధికంగా ఉన్న సూపర్ ఫుడ్స్ . చిన్న పిల్లలు రాగిపిండి తినడం కొద్దిగా కష్టం కాబట్టి, దోసెలు, రోటీ వంటి వాటిలో మిక్స్ చేసి అందివ్వొచ్చు . దాంతో వారిలో పోషకాంశాల పెరుగుతాయి

పనీర్

పనీర్

పనీర్ (11g of protein per 100g): పనీర్, మన వంటల్లో ఒక ప్రత్యేకమైన ఆహారపదార్థం. ముఖ్యంగా వీటిని సలాడ్స్, డిజర్ట్స్ లో చేర్చి తీసుకోవడం వల్ల , ప్రోటీనులు పొందడానికి మంచి మూలం!

పీనట్ బటర్

పీనట్ బటర్

పీనట్ బటర్(7.5 g per tbsp) - ఈ ఇండియన్ ఫుడ్ లో అత్యంత పురాతన ఆహార పదార్థంలో ప్రోటీనులు అత్యధికంగా ఉన్నాయి. వీటి సాడ్విచ్ లో చేర్చి తీసుకోవచ్చు.

 త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్

త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్

త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ (2 slices, 5.2g) : హోల్ వీట్ బ్రెడ్ లో ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ లో పుష్కలంగా ఉన్నాయి.

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకుకూరలు (1 cup- 13g) : పాలక్ లో అత్యధిక ప్రోటీనులున్నాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సినటువంటి ఒక హెల్తీ ప్రోటీన్, మినిరల్, మరియు విటమిన్ , ఫైబర్ బూస్టర్ ఫుడ్ ..

English summary

Good sources of protein for Vegetarians: Health Tips in Telugu

Protein is one of the fundamental building blocks in the body which is critical for proper growth and development. This is especially important for young children who are in a growing phase and could be picky eaters.
Desktop Bottom Promotion