For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాప్సికమ్ లోని గొప్ప ఔషధగుణగణాలు: లాభాలు

|

బెల్ పెప్పర్‌ పేరు వినే ఉంటారు. దీన్ని ‘కాప్సికమ్' అనీ ‘బెంగుళూరు మిర్చి' అనే పేర్లతో కూడా పిలుస్తారు. మార్కెట్లలో ఆకుపచ్చ రంగు కాప్సికమ్ దొరుకుతుంది. నేటి షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లలో ఎరుపు, పసుపు రంగు బెల్ పెప్పర్లు కూడా లభిస్తున్నాయి. ఇలా రెండు మూడు రంగుల్లో లభించే క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

క్యాప్సికమ్ తో తయారుచేసే వంటలు చాలా ఫేమస్. ఇండియన్ డిషెష్ లో స్టఫ్డ్ క్యాప్సికమ్ చాలా ఫేమస్. దీన్ని వెజిటేబుల్ గానే కాదు ఫ్రూట్ గా కూడా పిలుచుకుంటారు అందుకే అనేక రకాల సలాడ్స్, వంటల్లో వినియోగిస్తుంటారు.

READ MORE: ఇంగువ లోని ఔషధ గుణగణాలు చూడండి...!

క్యాప్సికమ్ లో విటమిన్ ఎ, సి మరియు ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అధిస్తాయి. అంతే కాదు, కోబాల్ట్, జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక మినిరల్స్ క్యాప్సికమ్ లో నిండి ఉన్నాయి.

ఇంకా క్యాప్సికమ్ లో ఔషధగుణగణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, క్యాప్సికమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది:

రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది:

క్యాప్సికమ్ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు . ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది . దాంతో స్ట్రోక్ ను నివారించుకోవచ్చు.

యాంటీ మైక్రోబల్ లక్షణాలు:

యాంటీ మైక్రోబల్ లక్షణాలు:

క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి . ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ మరయిు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

గొంతు నొప్పి నివారిస్తుంది:

గొంతు నొప్పి నివారిస్తుంది:

క్యాప్సికమ్ లో ఉండే యాంటీ మైక్రోబల్ లక్షణాలు గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడాన్ని నివారిస్తుంది. క్యాప్సికమ్ జ్యూస్ తో గార్గిలింగ్ చేసి మార్పును గమనించండి.

కొలెస్ట్రాల్:

కొలెస్ట్రాల్:

ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో క్యాప్సికమ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిర్ధారించారు . దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కూడా అందుతాయి.

 ముక్కులో రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది:

ముక్కులో రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది:

క్యాప్సికమ్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముక్కు నుండి రక్తస్రావం జరగకుండా సహాయపడుతాయి.

చర్మ సౌందర్యం:

చర్మ సౌందర్యం:

క్యాప్సికమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, దీన్నిస్కిన్ బెనిఫిట్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియను రెగ్యులేట్ చేస్తుంది. జస్టేషనల్ సమస్యల(ఫ్లాటులెన్స్, స్టొమక్ అప్ సెట్)ను నివారిస్తుంది. ఇంకా డయేరియా అబ్డామినల్ క్రాంప్ ను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.

 ఊపిరితిత్తుల ఆరోగ్యం:

ఊపిరితిత్తుల ఆరోగ్యం:

ఆస్థమా వంటి వ్యాధులను నివారిస్తుంది. శ్వాసవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

కొన్ని పరిశోధనల ప్రకారం, క్యాప్సికం రెగ్యులర్ గా తినడం వల్ల కాంటరాక్ట్స్ వంటి కంటిజబ్బులను నివారిస్తుంది. దీనిలో ఉన్న "Vitamin A" మీ కళ్ళకు సం రక్షణగా ఉపయోగ పడుతుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ "Capsaicins "మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.

.ఆర్థరైటిస్:

.ఆర్థరైటిస్:

క్యాప్సికమ్ లో ఉండే కేయాన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పెయిన్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుంది, ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్స్ ను నివారిస్తుంది . దీంతో తయారుచేసిన క్రీమ్ లేదా ఆయిట్ మెంట్ ను పెయిన్ రిలీఫ్ గా ఉపయోగిస్తున్నారు .

మధుమేహంను కంట్రోల్ చేస్తుంది :

మధుమేహంను కంట్రోల్ చేస్తుంది :

ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్టడీగా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచదు.

 క్యాలరీలను తగ్గించుట:

క్యాలరీలను తగ్గించుట:

ఇది మీ శరీరంలోని అనవసరమైన కాలరీలు తగ్గించు, మీరు అధిక బరువుతో బాదపడుతుంటే, దానిని తగ్గించి మిమ్మల్ని విముక్తుల్న్ని చేస్తుంది, అంతే కాకుండా ఇది మీ గుండెకు ఇబ్బంది కలిగించే మలినాలు అంటే కొవ్వు పదార్దాలను కరిగించి ఏ విదమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.

 జుట్టు:

జుట్టు:

దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా,జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.

నొప్పి నిర్మూలన:

నొప్పి నిర్మూలన:

ఇది తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్బాగాలకు సోకకుండా,పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది.నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది

Desktop Bottom Promotion