For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చియా సీడ్స్(సబ్జ గింజలు)లోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

చియా సీడ్స్ అంటే మీకు తెలుసా ..సబ్జగింజలు. వీటి గురించి మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా...ఎందుకంటే మనకు తెలిసన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ఉండేవి ఇవే. కాబట్టి చాలామందికి ఇవి బాగా గుర్తుండుపోతాయి. ఎందుకంటే ఇవి భలే మ్యాజిక్ చేస్తాయి.

వీటిని నీటిలో వేయగానే ఉబ్బి, జెల్ లా తయారువుతాయి. సబ్జ గింజలను కొద్దిగా ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట..మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్ తో పాటు అందాన్ని ఇనుపడింపచేసే విటమిన్ ‘ఇ' కూడా ఇందులో లభిస్తుంది. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం...

ఆకలి వేయదు:

ఆకలి వేయదు:

ఈ విత్తనాలకు కొద్దిగా తడి తగిలినా అవి ఉబ్బిపోయి, వాటి బరువు పదింతలు పెరుగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి కానివ్వదు.

బౌల్ మూమెంట్:

బౌల్ మూమెంట్:

చియా సీడ్స్ నీటిలో వేయగానే జిగురులా మారిపోతుంది. ఈ సబ్జగింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రత సైతం తగ్గించి బౌల్ మూమెంట్ సమస్యను నివారిస్తాయి.

గాయాలను మాన్పుతాయి:

గాయాలను మాన్పుతాయి:

శరీరంలోపల మాత్రమే కాదు, శరీరం బయట భాగాన్ని కూడా కాపాడుటలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, కొద్దిగా నూనె కలిపి గాయాల మీద అప్లై చేయాలి. ఇలా చేస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి.

తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు:

తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు:

తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో పోరాడే వారు ఈ విత్తనాలను నీళ్ళలో వేసి అవి ఉబ్బిన తర్వాత త్రాగి చూడండడి తక్షణ ఫలితం మీరే గమనించండి. తలనొప్పి తగ్గడం మాత్రమే కాదు. మానసిక ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.

రక్తాన్ని శుద్ది చేయడంలో:

రక్తాన్ని శుద్ది చేయడంలో:

శరీరంలోని మలినాలను తొలగించడంలో దీని తర్వాతే ఏదైనా.

శ్వాస సమస్యలు:

శ్వాస సమస్యలు:

శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె నానబెట్టిన సబ్జగింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

క్రీడాకారులకు:

క్రీడాకారులకు:

క్రీడాకారులకు ఈ విత్తనాలు బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటుంటే శరీరంలో తేమను పోనివ్వకుండా నిలిపి ఉంచుతాయి.

గొంతులో మంట, ఆస్తమా:

గొంతులో మంట, ఆస్తమా:

గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, లాంటి సమస్యలు బాధిస్తుంటే?అలాంటి సమయంలో ఈ గింజల్ని నీళ్ళలో వేసి నానబెట్టి నేరుగా తినేయాలి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

బిపిని కంట్రోల్ చేస్తుంది:

బిపిని కంట్రోల్ చేస్తుంది:

మీరు హైబిపితో బాధపడుతున్నట్లైతే వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపి క్రమంగా అదుపులోకి వస్తుంది.

ఆర్ధరైటీస్, హార్ట్ సమస్యలు:

ఆర్ధరైటీస్, హార్ట్ సమస్యలు:

చియాసీడ్స్ లో సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఆర్ధరైటిస్, మరాయు హార్ట్ సమస్యలు రాకుండా ఉంటాయి.

అలర్జీలు:

అలర్జీలు:

వీటిలో యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా సంబంధిత అలర్జీల నుండి రక్షిస్తాయి.

చర్మ సమస్యలు:

చర్మ సమస్యలు:

చియా సీడ్స్ చర్మ సమస్యలను అరకట్టడంలోనూ బాగా సహాకరిస్తాయి.

చియా సీడ్స్:

చియా సీడ్స్:

వీటిని నీళ్ళలోనే కాక, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు మరియు పండ్లరసాలతో పాటు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

చియాసీడ్స్ :

చియాసీడ్స్ :

ప్రతి రోజూ రాత్రి పడుకొనే ముందు నీటిలో వేసుకొని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. చూశారుగా, సబ్జగింజల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో..అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకున్నారుగా ..వీటిని ప్రతి రోజూ తీసుకోవడం మంచిది....

Story first published: Monday, June 29, 2015, 17:26 [IST]
Desktop Bottom Promotion