For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా చపాతి తినడం వల్ల పొందే లాభాలు

|

మన దైనందిన జీవితంలో చపాతీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద, బరువు మీద ఏకాగ్రతతో ఈ మద్యకాలంలో చపాతి తినేవారి సంఖ్య ఎక్కువైపోతున్నది. అయితే ఈ చపాతీ ఎందుకు తింటున్నారో, దీని వల్ల పొందే ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు. గోధుముల్లో చెప్పలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది కార్డియో వాస్యులార్ వ్యాధులను గ్రేట్ గా తగ్గిస్తుంది . అంతే కాదు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది.

గోధుమలు లేదా గోధుమపిండిలో విటమిన్ బి&ఇ, కాపర్, ఐయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్సియం మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి.

ఈ హై న్యూట్రీషియన్ విలువల వల్ల, కొన్న ప్రత్యేకమైన సమస్యలు, ఊబకాయం, ఆస్తేథియా మినిరల్ లోపం, అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్ క్లోసిస్, మరియు ఇతర గర్భధారణ సమస్యను నివారించుకోవచ్చు . అందుకే చపాతీలను ఎక్కువగా రెగ్యులర్ డైట్ లో చేర్చుతుంటారు .

READ MORE:గోధుమల్లో మీకు తెలియని కొన్నిఉత్తమ ఆరోగ్యప్రయోజనాలు

త్రుణ ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల . డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా తింటుంటారు. గోధుమలు గ్లిజమిక్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది . మరియు ఎవరైతే బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారో, అలాంటి వారు కూడా చపాతీలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. చాలా తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరి గోధుమలు మరియు గోధుమపిండిలో ఉండే మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం...

1. న్యూట్రీషియన్స్ :

1. న్యూట్రీషియన్స్ :

గోధుమలు, గోధుమ పిండితో తయారుచేసే రోటీలు వల్ల శరీరానికి విటమిన్స్, మరియు మినిరల్స్ అంటే మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా అందుతాయి.

2. చర్మానికి మేలు చేస్తుంది:

2. చర్మానికి మేలు చేస్తుంది:

చపాతీలో జింక్ మరియు ఫైబర్ మరియు ఇతర మినిరల్స్ అధికంగా ఉండటంవల్ల ఇది చర్మానికి చాలామేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది.

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

రోటీ చాలా సులభంగా జీర్ణం అవుతుంది . కాబట్టి, అన్నంకు బదులుగా రోటీలను తినడం ఉత్తమం . చపాతీలు తినడం వల్ల ఇది ఒక మేజర్ హెల్త్ బెనిఫిట్.

4. కార్బోహైడ్రేట్స్:

4. కార్బోహైడ్రేట్స్:

రోటీల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దాని వల్ల మన శరీరానికి అవసరం అయ్యే శక్తిని గ్రేట్ గా అందిస్తుంది.

5. ఐరన్:

5. ఐరన్:

చపాతీల్లో ఐరన్ అధికంగా ఉంటుంది . రక్తంలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది.

6. క్యాలరీలు:

6. క్యాలరీలు:

చపాతీలకు నూనె లేదా బటర్ జోడించకుండా తీసుకుంటే చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది,. కాబట్టి ఇది వెయిట్ లాస్ డైట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

7. మలబద్దకాన్ని నివారిస్తుంది:

7. మలబద్దకాన్ని నివారిస్తుంది:

గోధుమలతో తయారుచేసి చపాతీల వల్ల మరో గొప్ప ప్రయోజనం. మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

8. క్యాన్సర్ నివారిస్తుంది:

8. క్యాన్సర్ నివారిస్తుంది:

రోటీల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు సెలీనియం కంటెంట్ కొన్ని రకాల క్యాన్సర్లు నివారిస్తుంది. క్యాన్సర్ బారీన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

English summary

Health Benefits Of Chapati

Most of us are not aware of health benefits of chapati. There is enough evidence that claims that wheat is healthy enough. It can decrease the risk of cardio-vascular issues as it contains less amount of fat.
Desktop Bottom Promotion