For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?

By Nutheti
|

రోజూ ఉదయాన్నే పాలు తాగడం మంచి అలవాటే. ఎందుకంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను మిల్క్ ద్వారా పొందవచ్చు. కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివి పాల ద్వారా శరీరానికి అందుతాయి. అంతే కాదు కండరాలు, రక్తనాళాల విధిని మెరుగుపరిచి, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి. పాలల్లో ఉండే నీటి శాతం శరీరం హైడ్రేటేడ్ కాకుండా కాపాడుతుంది.

అమృతం వంటి పాలు ఆరోగ్యానికి హాని చేస్తుందంటే? నమ్ముతారా? అమృతం వంటి పాలు ఆరోగ్యానికి హాని చేస్తుందంటే? నమ్ముతారా?

నిద్రలేచిన దగ్గరనుంచి రోజంతా అన్ని పనులు చకాచకా చేసుకోవాలన్నా, మెదడు ఫ్రెష్ గా ఉండాలన్నా.. రెగ్యులర్ గా పాలు తాగాలని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. అయితే సరైన మోతాదులో తీసుకోవడం వల్ల అన్ని పనుల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. చాలా హెల్తీగా ఉంటారు. పాలు తీసుకోవడం కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక గ్లాసు పాలల్లో.. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి.

READ MORE: కొకొనట్ మిల్క్ తో క్యాన్సర్ కి చెక్

పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. రోజుకు రెండు గ్లాసులకు మించి తాగకూడదని ఇటీవల స్విడన్ పరిశోధనలో తేలింది. రోజూ మోతాదుకు మించి పాలు తాగితే.. అనవసర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. కాబట్టి పాలు తీసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు ఎంత పరిమాణంలో.. ఎలా తీసుకోవాలి. పాల ద్వారా పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

క్యాల్షియం

క్యాల్షియం

పాల ద్వారా అందే ప్రయోజనాల్లో క్యాల్షియం చాలా ముఖ్యమైనది. అందుకే పాలు తాగడం చాలా అవసరం. క్రోనిక్ డిసీజ్ ల నుంచి కాపాడటానికి పాలలోని క్యాల్షియం సహాయపడుతుంది. ఎముక హీనత, క్యాన్సర్, తలనొప్పి, ఒబేసిటీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉండటానికి పాలు అవసరం.

ఎముకల అభివృద్ధికి

ఎముకల అభివృద్ధికి

పాలు తాగడం అవసరం అని చెప్పడానికి ప్రధాన కారణం ఎముకల బలం. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

రీ హైడ్రేషన్

రీ హైడ్రేషన్

పాలలో 95 శాతం నీటి పరిమాణం ఉంటుంది. కాబట్టి పాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ కాకుండా.. రీ హైడ్రేట్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు పాలు చాలా అవసరం. ఎందుకంటే.. ఎక్కువగా ఆటల్లో మునిగితేలుతుంటారు కాబట్టి ఒక గ్లాసు పాలు తప్పనిసరిగా తాగించడం మంచిది.

విటమిన్స్

విటమిన్స్

మిల్క్ తాగడం వల్ల విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో పొందడానికి పాలు సహాయపడతాయి కాబట్టి రెగ్యులర్ గా పాలు తీసుకోవాలి.

ఎసిడిటీ

ఎసిడిటీ

పాలు తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. శరీరమంతా ఎసిడిటీ లెవెల్స్ తగ్గించడంలో పాలు సహాయపడతాయి.

పోషకాలు

పోషకాలు

పాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్, ఎనర్జీ పొందవచ్చు. ఆహారం ద్వారా లేదా డైట్ ద్వారా పొందే పోషకాలన్నీ ఒక్క గ్లాస్ మిల్క్ ద్వారా పొందవచ్చు.

సంతోషానికి

సంతోషానికి

లైఫ్ సంతృప్తిగా, సంతోషంగా ఉందన్న ఫీలింగ్ పొందాలంటే.. రోజూ పాలు తాగాలట. మిల్క్ తీసుకోవడం వల్ల జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు.

కార్భోహైడ్రేట్స్

కార్భోహైడ్రేట్స్

పాలు తాగటం ద్వారా కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో అందుతాయి. ల్యాక్టోజ్ రూపంలో కార్బోహైడ్రేట్స్ పొందవచ్చు. శరీరానికి, మెదడుకు కార్బొహైడ్రేట్స్ అందించడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

కంటిచూపు

కంటిచూపు

కంటిచూపు మెరుగ్గా ఉండటానికి పాలు సహకరిస్తాయి. కంటి ఆరోగ్యానికి, బలానికి పాలు తీసుకోవాలి.

డిసీజ్ ల నుంచి పోరాడటానికి

డిసీజ్ ల నుంచి పోరాడటానికి

ప్రొటీన్స్ ను పుష్కలంగా అందించడంలో పాలు తోడ్పడతాయి. ఇవి శరీర ఆరోగ్యానికి, కురులు, గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. డిసీజ్ లతో పోరాడే శక్తిని పాల ద్వారా పొందవచ్చు.

 చర్మానికి

చర్మానికి

సరైన మోతాదులో పాలు తీసుకోవడం, రెగ్యులర్ డైట్ లో పాలు చేర్చుకోవడం వల్ల అందం రెట్టింపవుతుంది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. ఎమినో యాసిడ్స్ చర్మానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి.

క్యాన్సర్ తో పోరాడటానికి

క్యాన్సర్ తో పోరాడటానికి

ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ తో పోరాడే శక్తి పాలలో ఉంది. కాబట్టి మిల్క్ ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను జయించవచ్చు.

ఒబేసిటీ

ఒబేసిటీ

పాలల్లో దాగున్న మరో అద్భుతమైన ప్రయోజనం ఒబేసిటీని తగ్గించే గుణం. పాలు తీసుకోవడం వల్ల స్లిమ్ గా, స్మార్ట్ గా తయారవుతారు.

డయాబెటీస్ లేదా మధుమేహం

డయాబెటీస్ లేదా మధుమేహం

సరైన పద్ధతిలో పాలు తాగుతూ ఉండటం వల్ల టైప్ టు డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. మహిళల్లో ఇది రాకుండా నివారించడానికి పాలు తాగడం చక్కటి పరిష్కారం.

రక్తపోటు

రక్తపోటు

రక్తపోటు నివారించడానికి పాలు సహాయపడతాయి. పెద్దవాళ్లు, పిల్లల్లోనూ బ్లడ్ ప్రెషర్ సజావుగా జరిగేలా చూస్తుంది. ఇందులో ఉండే మినరల్స్, ప్రొటీన్స్ రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరిస్తాయి.

పాలకు బదులు

పాలకు బదులు

పాలు తాగడానికి చాలా మంది ఇష్టపడరు. అలాంటి వాళ్లు పాదాం పాలు, సోయా మిల్క్, కాజూ మిల్క్, కొకనట్ మిల్క్, రైస్ మిల్క్ తీసుకుంటే.. పాల ద్వారా పొందే ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

English summary

Shocking Reasons Why You Should Drink Milk in telugu

People should consume appropriate amount of milk in order to perform their daily routine activities in a proper way.
Story first published:Tuesday, November 24, 2015, 16:20 [IST]
Desktop Bottom Promotion