For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ ఆపిల్: బేరిపండులోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

బేరిపండు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమదానిమ్మలకు దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ పండు తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులోగాని పై వాటిలో రెండు, మూడు రంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలిభాగం తెలుపు లేదా లేతపసుపురంగులో ఉంటుంది. బాగా తియ్యగా, రసాత్మకంగా ఉంటుంది. ఈ కండ లోపలగా మధ్యలో గింజలుంటాయి. ఈపండు కింద భాగం చాలా వెడల్పుగా, గుండ్రంగా ఉండి పైకి వచ్చేకొద్దీ సన్నబడుతూ ఉంటుంది.

బేరిపండులో విటమిన్లు ఎ.బి. డి.ఇ. మరియు మినిరల్స్ పొటాషియం, ఫాస్పరస్, మరియు కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ పండులో ఇంకా చిన్న మొత్తంలో ఐరన్ కూడా ఉంది . అయితే చాలా మందికి ఈ బేరిపండు యొక్క ఆరోగ్యలాభాలు గురించి అంతగా తెలియదు. సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు. రూపం, రంగు, రుచి, పరిమాణం నిల్వ ఉండే లక్షణాల మీద ఆధారపడి ఎన్నో రకాలుగా మనకు లభిస్తోంది. ఆరోగ్య పరంగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది. మరి ఆ శక్తివంతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...READ MORE:యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!

 కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

బేరిపండ్లలో ఉండే పెక్టిన్ అనే కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ వెవల్స్ ను తగ్గిస్తుంది . ఆరోగ్య పరంగా బేరి పండ్ల వల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం.

జ్వరం తగ్గిస్తుంది:

జ్వరం తగ్గిస్తుంది:

జ్వరంతో కనుక బాధపడుతున్నట్లైతే, కొంత బేరికాయ జ్యూస్ ను తీసుకోవాలి . ఇది శరీరంను చాల త్వరగా చల్లబరిచి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 కోలన్ శుభ్రం చేస్తుంది:

కోలన్ శుభ్రం చేస్తుంది:

ఈ సీజన్ లో దొరికే బేరిపండ్లను నేరుగా తీసుకోవడం వల్ల , ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కోలన్ ను శుభ్రం చేసి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

బేరిపండ్లలో ఉండే కాపర్ మరియు విటమిన్ సి వల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది . ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

బేరిపండ్లలోని జ్యూస్ తక్షణం ఎనర్జిని అందిస్తుంది . అందుకు ఈ బేరిపండ్లలో ఉండే గ్లూకోజ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

బేరిపండ్ల యొక్క జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మలబద్దకం నివారించి, బౌల్ మూమెంట్ సులభతరం చేస్తుంది .

ఇన్ఫ్లమేషన్ (వాపు)తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ (వాపు)తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ వల్ల నొప్పితో బాధపడేవారికి, బేరిపండ్లు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. బేరి పండ్ల జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది తక్షణ ప్రభావం చూపుతుంది.

హైబిపి నివారిస్తుంది:

హైబిపి నివారిస్తుంది:

బేరిపండ్లలోని గ్లూటాథియోన్ ఒక యాంటీయాక్సిడెంట్ గా పనిచేస్తుంది . ఇది స్ట్రోక్ మరియు హైబిపిని నివారించడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది:

ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది:

ఈ పండులో మినిరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం వ్రుద్దికోసం మెటబాలిక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . అందువల్లే ఇది నేరుగా ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

బేరిపండ్లలో వ్యాధినిరోధకత పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా చిన్ని చిన్న జబ్బులను నివారిస్తుంది.

English summary

The Health Benefits Of Pears

Most of us are not aware of the benefits of pears. It is a fruit that tastes sweet and is almost the size of an apple. This fruit comes in various colours which include red, brown, green and yellow. 
Story first published: Thursday, March 5, 2015, 18:32 [IST]
Desktop Bottom Promotion