For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్

|

మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.శరీరంలో అతి సున్నితమైన భాగాలలో ఒకటి చర్మం, తర్వాత కళ్ళు. చర్మం ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకుంటామో...అదే విధంగా కళ్లు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన విటమిన్, మినిరల్ ఫుడ్స్ తో పొట్టను నింపడం చాలా అవసరం. విటమిన్స్ కళ్ళు ఆరోగ్యంగా మరియు బ్రైట్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్షణ అవసరం. అందుకోసం కళ్ళు ఎక్కువగా ఎండలో స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా, కళ్ళును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ళలో ఏర్పడ్డ మురికి, డస్ట్ ను తొలగించుకోవచ్చు. అలాగే కొన్ని చిట్కాలు కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన విటమిన్స్ కొన్ని హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మరియు సీఫుడ్స్ లో ఎక్కువగా ఉండటం కనుగొనడం జరిగింది.

కంటి అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి 10 మార్గాలు

ఇలాంటి ఆహారాలు మీ కళ్ళ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుతాయి. కాబట్టి మీ కళ్ళను ఆరోగ్యంగా మరియు ప్రేమతో చూసుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్ లో ఈ విటమిన్స్ రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే....అలాగే నేచురల్ డ్రాప్స్ తో కళ్ళను నెలకొకసారి శుభ్రపరుచుకోవడం వల్ల కళ్ళు బ్రైట్ గా మరియు క్లియర్ గా మరియు హెల్తీగా ఉంటాయి . మరి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ టిప్స్ ను ఈ క్రింది విధంగా కనుగొందాం.....

బాదం మిల్క్:

బాదం మిల్క్:

బాదం మిల్క్ ను వారంలో రెండు సార్లు తీసుకోవడం కంటి సమస్యలుండవు. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు, కళ్ళు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. బాదం మిల్క్ స్పైసీగా తీసుకోవాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు.

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ :

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయల్లోని క్యారెట్ కూడా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కోకనట్ పౌడర్ ను జ్యూస్ లో మిక్స్ చేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కళ్ళ నొప్పి నుండి తక్షణం ఉపశమనం కలిగిస్తుంది. క్యారెట్ జ్యూస్ వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది.

సోంపు:

సోంపు:

సోంపును రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి . తర్వాత ఈ హెల్తీ వాటర్ ను మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి . పరగడుపున తీసుకోవడం వల్ల ఈ సోంపు వాటర్ ఐసైట్ ను మెరుగుపరుస్తుంది . కాంట్రాక్ట్ సమస్యను నయం చేస్తుంది.

ఉసిరి మిల్క్ :

ఉసిరి మిల్క్ :

ఉసిరి కాయతో తయారుచేసిన మిల్క్ ను గోరువెచ్చగా తీసుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యానికి ఒక ఉత్తమ ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. ఐతే దీన్ని కాలి పొట్టతో తీసుకోవాలి. కళ్ల రక్షణకు మాత్రమే కాదు, ఉసిరి కాయ జ్యూస్ బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా పనిచేస్తుంది.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆముదం నూనె కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ రెండు మూడు చుక్కల ఆముదం నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళకు అప్లై చేయడం ద్వారా గ్రేట్ గా సహాయపడుతుంది.

విటమిన్ ఇ ఫుడ్స్:

విటమిన్ ఇ ఫుడ్స్:

చేపలు, బాదం, క్యారెట్, గుడ్డు, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు బొప్పాయి వంటి విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కంటి చూపు దీర్ఘకాలం పాటు గ్రేట్ గా ుంటుంది . ఈ ఫుడ్ హ్యాబిట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

విటమిన్ ఎ ఫుడ్స్, :

విటమిన్ ఎ ఫుడ్స్, :

జామ, ఆరెంజ్, పైనాపిల్, రెడ్ మరియు గ్రీన్ చిల్లీ, బెల్ పెప్పర్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు దీర్ఘ కాలంలో కూడా ఎలాంటి కంటి సమస్యలుండవు .

విటమిన్ సి ఫుడ్స్:

విటమిన్ సి ఫుడ్స్:

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . వాటర్ మెలోన్, టమోటో, పాలు, లెట్యుస్, గ్రేప్ ఫ్రూట్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా కళ్లకు రక్షణ కల్పిస్తుంది.

English summary

Vitamins & Tips Your Eyes Will Love!: Health Tips in Telugu

Vitamins & Tips Your Eyes Will Love!: Health Tips in Telugu, Just like how your skin needs pampering, your eyes too need a lot of care and love. Eating the right type of foods and feeding your tummy with the right amount of vitamins will help keep your eyes healthy and bright, life long.
Story first published: Tuesday, October 13, 2015, 11:39 [IST]
Desktop Bottom Promotion