ప్రతి భోజనంలో పెరుగు ఖచ్చితంగా ఉండటానికి 10 ఇంపార్టెంట్ రీజన్స్ ..!!

పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికీ పెరుగు ఇష్టమే? చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినందే అసలు తృప్తి చెంద‌రు. భోజనం

Posted By:
Subscribe to Boldsky

పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికీ పెరుగు ఇష్టమే? చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినందే అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

కాంతివంతమైన చర్మ సౌందర్యానికి పెరుగుతో ఫేస్ ప్యాక్

పెరుగు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే ప్రోబయోటిక్ ఫుడ్ . కమ్మని రుచి, కడుపుకు చల్లదనం, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే పెరుగును పురాతన కాలం నుండే ఎక్కువ వాడుకలో ఉన్నది. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం అత్యధికంగా ఉంటుంది. అరకప్పు పెరుగు తినడం వల్ల 100 నుండి 150 క్యాలరీలను అందిస్తుంది. 2 గ్రాముల శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ , 20 గ్రాముల షుగర్స్, 10 గ్రాలము ప్రోటీనులను అందిస్తుంది. డైలీ మనకు అసవరమయ్యే విటమిన్ డి ప్రోటీన్ అందిస్తుంది. మ‌రి ఇన్ని పోషక విలువలన్న అందించే ఈ పెరుగులో మరెన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ రెమెడీ పెరుగు. స్టొమక్ అప్ సెట్, అజీర్తి , కడుపుబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. రోజూ తినే ఆహారాల నుండి ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ గ్రహించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. పోషకాల ఆరోగ్యానికి సహాయపడుతాయి.

వ్యాధినిరోధక శక్తి పెరగుతుంది:

పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియ వ్యాధినిరోధక శక్తి పెరగడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బెటర్ హెల్త్ కు సహాయపడుతుంది. పెరుగును రెగ్యులర్ గా తినడం వల్ల వైజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.

దంతాలు, ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచుతుంది:

ఇతర డైరీ ప్రొడక్ట్స్ వలే పెరుగులో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగులో ఉండే ఫాస్పరస్ బోన్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. పెరుగును రెగ్యులర్ గా తినడం వల్ల ఆర్థ్రైటిస్, ఓస్టిరియో ఫోసి వంటి లక్షణాలు నివారించబడుతాయి .

ఆందోళన , స్ట్రెస్ తగ్గిస్తుంది:

ఈ హైలీ కాంపిటీటివ్ వరల్డ్ లో డిప్రెషన్, నెగటివ్ ఎఫెక్ట్స్ ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆందోళన, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది. బ్రెయిన్ చురుకుగా ఉంచుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కార్టిజోల్ ఫార్మేషన్ ను నివారిస్తుంది. శరీరంలో కార్టిసోల్ అసమతుల్యతల వల్ల ఓబేసిటి, హైపర్ టెన్షన్ తగ్గుతుంది. రోజూ సింపుల్ గా 18 ఔన్సుల పెరుగు తినాల్సి వస్తుంది.

కార్డియో వాస్క్యులర్ హెల్త్:

పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గించుకోవచ్చు .పెరుగు తినడం వల్ల ధమనుల్లో కొలెస్ట్రాల్ నిల్వచేరకుండా చేస్తుంది. దాంతో హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కార్డియో వాస్క్యులర్ హెల్త్ ను మెరుగుపరడుతుంది.

స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది:

కెమికల్స్ కలిసిన బ్యూటి ప్రొడక్ట్స్ తినడం కంటే , పెరుగును చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం సాప్ట్ గా స్మూత్ గా , కాంతివంతంగా తయారవుతుంది. పెరుగులో ఉండే విటమిన్ ఇ, .జింక్ , ఫాస్పరస్ లు చర్మ సంరక్షణాలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ స్ట్రక్చర్ , స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. శెనగపిండి, పెరుగు, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

లైంకశక్తిని పెంచుతుంది:

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల సెక్సువల్ సమస్యలను ినవారిస్తుంది. లైంగిక సామర్థ్యం, లిబిడో వంటి సమస్యలను నివారిస్తుంది.

హ్యాంగోవర్ తగ్గిస్తుంది:

బట్టర్ మిల్క్ ను తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాంగోవర్ ను నివారిస్తుంది.

అన్ని సీజన్స్ లో బెస్ట్ ఫుడ్

సంవత్సరంలో అన్ని సీజన్స్ లో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో ఆంధ్ర, తమిళనాడులో ఎక్కువగా తింటారు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 reasons you should have curd with every meal

Due to its so many benefits, curd is one of the most popular food items around the world. In some parts of the world, like India, people believe that consuming curd before doing something new or embarking on a journey will ensure success and good health. Even from a scientific point of view, this dairy product is quite special and brings about many health benefits.
Story first published: Tuesday, November 8, 2016, 11:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter