సపోటా జ్యూస్ లో 16 అద్భుతమైన ప్రయోజనాలు ...!!

సపోటా గ్రైనీ స్ట్రక్చర్ కలిగి, లైట్ మస్కీ ఫ్లేవర్ తో ఉంటుంది, బాగా పండిన సపోటాను రెండు గా కట్ చేసి, లోపల ఉన్న గుజ్జును మిక్సీలో జార్ లో వేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ కు ఏలాంటి ఇతర ఫ్లేవర్స్ కా

Posted By:
Subscribe to Boldsky

సపోటా' అనేపేరు అందరికీ తెలిసిన విషయమే. సపోటాకు మరోపేరు 'చికూ' అందరికీ ఈ పేరు తెలియదు. ప్రధానంగా ఉష్ణమండల సతతహరిత ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. సపోటా మామిడి, అరటి, పనస వంటి పండ్ల విభాగానికి చెందిన ఈ పండు అధిక కాలరీలు గల రుచికరమైన పండు.

నోస్ బెర్రీ, సపోడిల్ల ప్లం, చికూ సపోటా మొదలైనవి దీని ఇతర పేర్లు. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. అధిక పోషకాలు కలిగిఉన్న ఈ పండుకు ధన్యవాదాలు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ముందే చెప్పినట్లుగా ఈ పండులో విటమిన్లు, మినరల్స్, టాన్నిన్ లు సమృద్ధిగా ఉన్నాయి. దీని రుచి తియ్యగా ఉండడం వల్ల, మిల్క్ షేక్స్ , జ్యూస్ లలో బాగా ఉపయోగిస్తారు.


సపోటా గ్రైనీ స్ట్రక్చర్ కలిగి, లైట్ మస్కీ ఫ్లేవర్ తో ఉంటుంది, బాగా పండిన సపోటాను రెండు గా కట్ చేసి, లోపల ఉన్న గుజ్జును మిక్సీలో జార్ లో వేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ కు ఏలాంటి ఇతర ఫ్లేవర్స్ కానీ, లేదా షుగర్ కానీ జోడించకుండానే నేరుగా తీసుకోవచ్చు .ఈ సపోటా జ్యూసులో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి . మరి అవేంటో తెలుసుకుందాం...ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం..:

సపోటా జ్యూస్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి:

ఇతర జ్యూస్ లు వలే సపోటా జ్యూస్ లో అనేక పోషకాలున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి మరియు సి లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్ లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి.

గ్యాస్ట్రిక్ , బౌల్ డిజార్డర్స్ నివారిస్తుంది:

సపోటా జ్యూస్ లో ఉండే స్పెషల్ కంటెంట్స్ ను టానిన్స్ అని పిలుస్తారు, ఇది నేచురల్ ఫాలీ ఫినాల్స్ . ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. టానిన్స్ యాంటీ ప్యారాసిటిక్, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సపోటా జ్యూస్ లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, బౌల్ డిజార్డర్స్ ను నివారిస్తుంది. బెల్లీలో చేరిన వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది.

బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది స్ట్రెస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సపోటా జ్యూస్ లో ఉండే క్యాల్షియం బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బోన్ క్వాలిటీ పెంచుతుంది.

ఇమ్యూన్ సిస్టమ్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. :

సపోటా జ్యూస్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,. ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని అందిస్తుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. రెగ్యులర్ గా సపోటా జ్యూస్ తాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ లో ప్యారాసిస్టిక్ ఎఫెక్ట్స్ ను తొలగిస్తుంది.

విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది:

విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలో మ్యూకస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ లంగ్స్ మరియు సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎనర్జీ బూస్టర్ :

సపోటా జ్యూస్ లో ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ లు అధికంగా ఉన్నాయి. ఇది ఎనర్జీని అందిస్తుంది. మరియు శరీరానికి ఇన్ స్టాంట్ గా శక్తిని అందిస్తుంది. ఇది గర్భిణీల మహిళలకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. మరియు పెరిగే పిల్లలకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎక్సలెంట్ ల్యాక్సేటివ్ :

సపోటా జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్సలెంట్ ల్యాక్సేటివ్ . ఈ జ్యూస్ మలబద్దకం నివారించడం మాత్రమే కాదు, మ్యూకస్ మెంబరెన్స్ కు రక్షణ కల్పిస్తుంది, క్యాన్సర్ కు కారణమయ్యే టాక్సిన్స్ ను కోలన్ నుండి తొలగిస్గుతుంది.

కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది :

సపోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడంవ హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయవచ్చు. డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు పొందే ప్రయోజనాలు:

జుట్టును సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది:
సపోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్, అందిస్తుంది. దాంతో జుట్టు స్మూత్ గా మరియు సాప్ట్ గా పెరుగుతుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు పొందే ప్రయోజనాలు:

సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ సి తలలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది. హెయిర్ ఫాలీసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

సపోటా జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు పొందే ప్రయోజనాలు:

పరోక్షంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:
సపోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల అడ్రినల్ గ్రంథులను చురుగ్గా ఉంచుతుంది. దాంతో హార్మోనుల సమంగా బ్యాలెన్స్ అవుతాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

సపోటా జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు పొందే ప్రయోజనాలు:

తెల్ల జుట్టును నివారిస్తుంది :
సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది, క్యాపిల్లర్స్ ను రిపేర్ చేస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకు నేచురల్ కలర్ అందివ్వడంతో తెల్ల జుట్టు నివారించబడుతుంది.

సపోటా జ్యూస్ లోని స్కిన్ బెనిఫిట్

13.స్కిన్ కంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది: సపోటా జ్యూస్ లో విటమిన్ సి, ఎ, వివిధ రకాల మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్కిన్ కంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది .నేచురల్ స్ట్రక్చర్ అందిస్తుంది.

సపోటా జ్యూస్ లోని స్కిన్ బెనిఫిట్

కొల్లాజెన్ ప్రొడక్షన్ ను పెంచుతుంది:
సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ, సిలు స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. ఇది స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మంలో ఎలాసిటి పెరుగుతుంది. లిగమెంట్స్ త్వరగా రికవర్ అవుతాయి.

సపోటా జ్యూస్ లోని స్కిన్ బెనిఫిట్

ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది:
సపోటా జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. సపోటా జ్యూస్ ను తాగడం వల్ల ముడుతలను, చారలను , ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది.

సపోటా జ్యూస్ లోని స్కిన్ బెనిఫిట్

సన్ బర్న్ ఎఫెక్ట్ ను తొలగిస్తుంది:
సపోటా జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది. కాలుష్యం బారి నుండి కాపాడుతుంది,. సన్ బర్న్ తగ్గిస్తుంది. యూవీకిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పించడం వల్ల స్కిన్ క్యాన్సర్ సమస్య ఉండదు.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

16 Amazing Benefits Of Sapota juice For Skin, Hair And Health

Sapota fruit has a grainy texture and a light musky flavor. Cut the fruit into two halves and scoop the flesh out to make a refreshing juice. The juice should be enjoyed without any additions to relish its unique flavor. Sapota juice also known as chikoo juice or sapodilla juice is widely known for it’s amazing benefits. Let’s have a look at sapota juice benefits:
Please Wait while comments are loading...
Subscribe Newsletter