For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరిపాలు, పసుపు మిశ్రమంతో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

చాలా కలర్ ఫుల్ గా, హెల్తీగా ఉండే.. కొబ్బరిపాలు, పసుపు తీసుకుంటే..మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు.

By Swathi
|

ఉదయాన్నే హెల్తీ డ్రింక్ తాగడం కంటే.. మరేమి చేసినా.. రోజు ఆహ్లాదంగా, ఉత్సాహంగా గడవదు. మంచి డ్రింక్ తో రోజుని ప్రారంభిస్తే.. పొందే అనుభూతే వేరు. కానీ చాలామంది ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగి.. వీక్ నెస్ నుంచి బయటపడాలనుకుంటారు.

coconut milk and turmeric

కానీ.. చాలా కలర్ ఫుల్ గా, హెల్తీగా ఉండే.. కొబ్బరిపాలు, పసుపు తీసుకుంటే..మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. ఈ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ డ్రింక్ రకరకాల అనారోగ్య సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. ఇది ఆరోగ్యానికి చాలామంచిది. కాబట్టి.. ప్రతిరోజూ.. ఈ గోల్డెన్ మిల్క్.. కొబ్బరిపాలు, పసుపు మిశ్రమాన్ని తీసుకుని.. అద్భుత ప్రయోజనాలు పొందండి..

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు కొబ్బరిపాలు

1 టీస్పూన్ కొబ్బరినూనె

పావు టీస్పూన్ పసుపు పేస్ట్

కొద్దిగా తేనె

ముందుగా పసుపు పేస్ట్ తయారుచేసుకోవాలి

ముందుగా పసుపు పేస్ట్ తయారుచేసుకోవాలి

పసుపు, మిరియాలు, నీళ్లను ఒక పాన్ వేసి.. సన్నిని మంటపై వేడి చేయాలి. బాగా కలిపి.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

కొబ్బరిపాలు, పసుపు మిశ్రమం

కొబ్బరిపాలు, పసుపు మిశ్రమం

పైన సూచించిన అన్ని పదార్థాలను బాగా కలపాలి. తేనె కలపకుండా.. మీడియం మంటపై కాసేపు అన్నింటినీ వేడి చేయాలి. ఉడికించకూడదు. తర్వాత తేనె కలుపుకుని తీసుకోవాలి.

ఈ డ్రింక్ తో బెన్ఫిట్స్

ఈ డ్రింక్ తో బెన్ఫిట్స్

పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల.. హానికర బ్యాక్టీరియాను నివారిస్తుంది. అలాగే.. గాయాలను నివారిస్తుంది. అలాగే పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్స్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

పసుపులో ఫైటోకెమికల్స్ ఉంటాయి. కాబట్టి.. పసుపును పాలలో కలిపి తీసుకోవడం చూస్తుంటాం. అయితే.. కొబ్బరిపాలలో కలిపి తీసుకుంటే.. టేస్టీగా ఉండటమే కాకుండా.. ఇమ్యునిటీ మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్

క్యాన్సర్

కొబ్బరిపాలు, మిరియాలు, పసుపు మిశ్రమం తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ని అరికట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

పసుపు, కొబ్బరిపాలు.. గాల్ బ్లాడర్ ఫంక్షన్ మెరుగుపరిచి.. ఫ్యాట్స్ ని కరిగించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

లివర్ డెటాక్స్

లివర్ డెటాక్స్

కొబ్బరిపాలు, మిరియాలు, పసుపు మిశ్రమం గ్లుటథియోన్ ఎంజైమ్స్ ని పెంచి.. ఫ్రీరాడికల్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. కాబట్టి.. ఇది.. లివర్ ని చాలా తేలికగా డెటాక్స్ చేస్తుంది.

మెటబాలిజం

మెటబాలిజం

పసుపు ఫ్యాట్ కణాలను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా తేలికగా శరీరం ఎనర్జీని పొందుతుంది.

హైబ్లడ్ ప్రెజర్

హైబ్లడ్ ప్రెజర్

పసుపు, కొబ్బరిపాల మిశ్రమం.. గుండె పనితీరుని మెరుగుపరిచి..హైబ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది.

బ్రెయిన్

బ్రెయిన్

కొబ్బరిపాలు, పసుపు మిశ్రమం తీసుకోవడం వల్ల.. మెమరీ పెరగడమే కాకుండా.. మెదడు పనితీరు చురుగ్గా సాగుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి.

English summary

Amazing Health Benefits of Coconut Milk and Turmeric

Amazing Health Benefits of Coconut Milk and Turmeric. Read more to know
Story first published: Friday, October 21, 2016, 11:44 [IST]
Desktop Bottom Promotion