For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టర్ మిల్క్ Vs లస్సీ ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది?

By Super Admin
|

బట్టర్ మిల్క్(మజ్జిగ) మరియు లస్సీ ఫేవరెట్ సమ్మర్ డ్రింక్. మిగిలిన సీజన్స్ లో కూడా తీసుకుంటారు. అయితే ఇండియాలో సమ్మర్ లో దీని వాడకం ఎక్కువ. ఈ రెండూ చిక్కటి పెరుగుతో తయారుచేస్తారు. అయితే రెండూ రెండు రకాలుగా తయారుచేస్తారు. అంతే కాదు, రెంటి టేస్ట్ కూడా డిపరెంట్ గా ఉంటాయి. పేర్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి.

లస్సీ పంజాబీ డ్రింక్ మరియు చిక్కటి పెరుగుతో తయారుచేసే ట్రెడిషనల్ డ్రింక్. పెరుగుతో తయారుచేస్తారు, దీన్ని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి చిక్కగా చేయాలి. . లస్సీలో కూడావివిధ రకాలున్నాయి. ఇందులో ఫ్రూట్స్, స్పైసీలు లేదా ఇతర ఫ్లేవర్స్ చోడించవచ్చు.

Buttermilk Vs Lassi

లస్సీ హెల్త్ బెనిఫిట్స్:

ఒక గ్లాస్ నిండు గా లస్సీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు..

1. లస్సీ బాడీలో జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ ను స్మూత్ గా మార్చుతుంది. భోజనం చేసిన తర్వాత ఇది ఒక ఎక్సలెంట్ డ్రింక్ 2. లస్సీలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది బలాన్నిస్తుంది మరియు బాడీ మజిల్స్ ను బిల్డ్ చేస్తుంది.

3. ఇది మిల్క్ ప్రొడక్ట్ కనుక క్యాల్సియం పుష్కలంగా అందిస్తుంది దాంతో బోన్స్ మరియ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4. పెరుగు ఆరోగ్యకరమైనది, ఇందులో ప్రొబయోటిస్స్ ఎక్కువగా ఉంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలో పెరగకుండా చేస్తుంది. పొట్టను ప్రశాంత పరుస్తుంది.

5. ఇది ఎనర్జీ డ్రింక్ . అంతే కాదు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు, పొట్ట నింపుతుంది.

Buttermilk Vs Lassi

బట్టర్ మిల్క్ ను రాజస్థాన్, గుజరాత్ లో కూడా ఎక్కువగా తీసుకుంటారు.

బట్టర్ మిల్క్ , ను లోకల్ గా చాస్ అని పిలుస్తారు, ఇది కూడా వెరైటీగా తయారుచేసుకుంటారు.రాజస్థాన్ మరియు గుజరాత్ లలో దీన్ని మీల్ డ్రింక్ గా తీసుకుంటారు. లస్సీలాగే దీన్ని కూడా తయారుచేస్తారు. అయితే బట్టర్ మిల్క్ కు ఎక్కువ నీళ్ళు కలుపుతారు, బట్టర్ ఫ్యాట్ తొలగిస్తారు, కాబట్టి,చిక్కగా ఉంటుంది. ముఖ్యంగా దీనికి ఉప్పు, రోస్ట్ చేసిన జీలకర్ర లేదా పెప్పర్ ను జోడించి మరింత టేస్టీగా తీసుకుంటారు.

Buttermilk Vs Lassi

బట్టర్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్:

ఒక గ్లాసు ఫుల్ మజ్జిగను భోజనం తర్వాత తీసుకుంటే సంపూర్ణ భోజనం పూర్తైనట్లే మరియు ప్రయోజాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. స్పైస్ గా మరియు హెవీగా భోజనం చేసినప్పుడు, బట్టర్ మిల్క్ తీసుకోవచ్చు మరియు ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.

2. డయోరియా, ఎసిడిటి మరియు డీహైడ్రేషన్ వంటి వాటికి బట్టర్ మిల్క్ బెస్ట్ సొల్యూషన్ .

3. బికాంప్లెక్స్ , ప్రోటీన్స్ మరియు పొటాషియంకు ఒక గొప్ప మూలం.

4. ల్యాక్టోజ్ లోపంతో బాధపడేవారికి ఇది ఒక బెస్ట్ డ్రింక్ . పాలంటే ఇష్టపడని వారు బట్టర్ మిల్క్ తీసుకుంటే చాలు. కావల్సినంత క్యాల్షియం అందిస్తుంది . ఫ్యాట్ కంటెంట్ ఉండదు.

5. రీసెర్చ్ ప్రకారం, రోజూ బట్టర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

Buttermilk Vs Lassi

అందువల్ల, లస్సీ మరియు బట్టర్ మిల్క్ రెండూ మన ఆరోగ్యకానికి ప్రయోజనకారిలే. డిఫరెంట్ పద్దతిలో ప్రయోజనాలను అందిస్తాయి . ఏది మంచిది ఏది హెల్తీయర్ అని అంచనా వేయడం కష్టమే, ఇన్ స్టాంట్ ఎనర్జీ కావాలని కోరుకునే వారు లస్సే హెల్తీ డ్రింక్. డయోరియాతో బాధపడే వారికి బట్టర్ మిల్క్ హెల్తీ డ్రింక్, . కాబట్టి, నెక్స్ట్ టైమ్ మీకు ఏదికావాలో మీరే డిసైడ్ చేసుకోండి..

English summary

Buttermilk Vs Lassi: Which one wins the health competition?

Buttermilk and Lassi are the most commonly available and favourite summer drink for the people of India. They both are made from yoghurt but there is a lot of difference in how they are made as well as their qualities. But still, many a times they are confused as one or either their names are interchanged.
Story first published:Sunday, August 28, 2016, 11:50 [IST]
Desktop Bottom Promotion