మీ ఎముకలను స్ట్రాంగ్ గా మార్చే క్యాల్షియం ఫుడ్స్..!

ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.

Posted By:
Subscribe to Boldsky

ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. ఎముకల అభివ్రుద్దికి స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

Calcium Rich Foods that Improve Your Bones

వయసు పెరిగే కొద్ది, ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల కూడా బోన్ కు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం ఎముకల్లో నిల్వచేరడం చాలా అవసరం. అలా ఎముకల్లో కాల్షియం చేరాలంటే, అందుకు మనశరీరానికి విటమిన్ డి చాలా అవసరం.

కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం ఉన్నటువంటి ఆహారాలు సరైనా మోతాదులో తీసుకోకపోతే, ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎముకల దృఢత్వానికి కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.

Calcium Rich Foods that Improve Your Bones1

ఆకుకూరలు
ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బ్రొక్కోలి... వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు ఆకుకూరలో 336మి.గ్రాల కాల్షియం లభిస్తుంది.

Calcium Rich Foods that Improve Your Bones2

పాలు
కాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి. సులభంగా జీర్ణమమడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280మి.గ్రా కాల్షియం లభిస్తుంది.

Calcium Rich Foods that Improve Your Bones4

బాదం
ఒక కప్పు బాదంలో శరీరానికి కావాల్సినంత కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహారపదార్థాల్లో ఇది టాప్‌లి్‌స్టలో ఉంటుంది బాదం. ప్రొటీన్స్‌ కూడా తగినంత లభిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్‌ తగ్గిపోతుంది.

Calcium Rich Foods that Improve Your Bones5

ఆరెంజ్‌
ఒక ఆరెంజ్‌ తీసుకుంటే 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్‌ డి కూడా ఉండటం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది.

Calcium Rich Foods that Improve Your Bones6

పెరుగు
రోజులో కనీసం ఒకసారి పెరుగు వేసుకున్నా 400మి.గ్రాల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది.

Calcium Rich Foods that Improve Your Bones7

సోయా మిల్క్‌
ఒక కప్పు సోయామిల్క్‌లో 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్‌ డి కూడా లభిస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Calcium Rich Foods that Improve Your Bones

Calcium Rich Foods that Improve Your Bones. Calcium, a mineral that’s essential to proper body function, is stored in your bones. The body needs vitamin D to absorb calcium.
Story first published: Monday, November 28, 2016, 16:36 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter