ఈ ఫ్రూట్స్ ను తొక్కతో సహా తింటేనే...డబుల్ బెనిఫిట్స్..!!

చాలా వరకూ అన్ని రకాల ఫ్రూట్స్ లో విటమిన్స్, మినిరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరమైనవి. కొన్ని సంవత్సరాలుగా ఫ్రూట్స్ మీద జరిపిన పరిశోధనల్లో పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని

Posted By:
Subscribe to Boldsky

చాలా మంది పండ్లు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పండ్లలో గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. సీజనల్ గా మనకు అందుబాటులో ఉండే పండ్లను ఎప్పటికప్పుడు తినడం మంచిది. పండ్లు మాత్రమే కాదు,కొన్ని రకాల పండ్ల యొక్క తొక్క తినడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు?

ఈ విషయం చాలా మందికి తెలియదు? పండ్ల తొక్కలు ఆరోగ్యకరమన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. నార్మల్ గా పండ్లను తినాలంటే మొదట పండ్ల నుండి తొక్కను వేరు చేసి తినడం సహజం . అయితే ఈ పండ్ల తొక్కల్లో కూడా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సహజంగా చెప్పాలంటే పండ్ల లోపలి పదార్థంతో పోల్చితే తొక్కలు అంత రుచికరంగా ఉండకపోవడం వల్లే వీటిని తీసి పడేస్తుంటారు. అంతే కాదు ఇదివరకెప్పుడు అలా తినడానికి కూడా ప్రయత్నించి ఉండదు.

చాలా వరకూ అన్ని రకాల ఫ్రూట్స్ లో విటమిన్స్, మినిరల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరమైనవి. కొన్ని సంవత్సరాలుగా ఫ్రూట్స్ మీద జరిపిన పరిశోధనల్లో పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని కనుగొన్నారు . ఇవి ప్రాణాంతమైన వ్యాధులను , క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అదనంగా పండ్లలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి , బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యానికి, శరీరం డిటాక్సిఫై చేయడానికి గ్రేట్ గా సామయడపుతుంది. పండ్లలాగే పండ్లతొక్కలో ఉండే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..అవసరమైతే పండ్లతో పాటు పండ్ల తొక్కలను కూడా తినేద్దాం...

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ ఫ్రూట్స్ లోలాగే, ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బాడీ ఫ్యాట్ ను సులభంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది, ఇంకా ఇది మలబద్దకం, శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అరటితొక్క:

అరటి తొక్కలో కూడా అద్భుత ప్రయోజనాలున్నాయి, దంతాలను తెల్లగా మార్చడంతో పాటు, స్కిన్ బర్న్ ను నివారిస్తుంది. చర్మంలో రాషెస్ ను నివారిస్తుంది. ఎసిడిటి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దంతాల మీద తొక్కతో మర్దన చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.

దానిమ్మ తొక్క:

దానిమ్మ తొక్కలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి, ఇవి వివిధ రకాల వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. గొంతు నొప్పి తగ్గిస్తుంది, ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

వాటర్ మెలోన్ పీల్:

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పుచ్చకాయ తొక్క తినడం వల్ల బరుతు తగ్గించుకోవచ్చు. ఇది చర్మం, జుట్టుకు ఆరోగ్యంగా, రేడియంట్ గా మార్చుతుంది. కొత్త కణాలను ప్రోత్సహిస్తుంది.

ఆపిల్ :

ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఎలాగైతే ఉండదో అదే విధంగా తొక్క తొన్నా కూడా డాక్టర్ అవసరం ఉండదంటున్నారు ఆహార నిపుణులు . ఎందుకంటే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మలబద్దకం నివారిస్తుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్యానర్స్ కు వ్యతిరేకం.

లెమన్ పీల్:

నిమ్మతొక్కలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి తో పాటు యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇవి ఓరల్ ఇన్ఫెక్షన్స్, స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్ట్రెస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బొప్పాయి తొక్క:

బొప్పాయిలోనే కాదు బొప్పాయి తొక్కలో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. బాగా పండిని బొప్పాయి తొక్కతో పాటు తినడం వల్ల ప్రేగులు శుభ్రపడుతాయి. ప్రేగుల్లో చేరిన టాక్సిన్స్ నివారించబడుతాయి. బొప్పాయిలో ఉండే టాక్సిన్స్ శరీరంను ఆరోగ్యంగా ఉంచుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Do Not Throw Away The Peels Of These Fruit, They Have Amazing Health Benefits!

Do Not Throw Away The Peels Of These Fruit, They Have Amazing Health Benefits! ,Most of us love eating fruits and we are aware that fruits come with great health benefits; however, did you know the peel of certain fruits also come with astonishing health benefits?
Story first published: Thursday, November 10, 2016, 13:10 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter