For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ కరివేపాకు తింటే పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!!

|

కర్రీ లీవ్స్ లేదా కరివేపాకు అంటే తెలియని వారుండరు. ఎందుకంటే మన ఇండియన్ వంటల్లో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకులో తాజా సువాసన, కమ్మని రుచి ఉంటుంది. దీన్ని వంటల్లో ఉపయోగించడం వల్ల ఆ వంటలకు ఎక్కువ రుచి, వాసన ఉంటుంది. అంతే కాదు కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి. అవి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే..

కరివేపాకు శాస్త్రీయ నామం ముర్రయ కియినిగి అని పిలుస్తారు. కరివేపాకు రుటేషియ కుటుంబానికి చెందినది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండిస్తారు. ఎక్కువగా ఉష్ణ మండల మరియు ఉపఉష్ణమండల ప్రదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇండియాలో కాకుండా, కరివేపాకును చైనా, ఆస్ట్రేలియా, సిలోన్ మరియు నైజీరియాల్లో ఎక్కువగా పండిస్తారు.

కరివేపాకును విరివిగా ఉపయోగించడానికి ముఖ్య కారణం ఇది చాలా విరివిగా అందుబాటులో ఉంటుంది. ఇంకా చౌకైనది కూడా. అతి తక్కువ రేటుకు మనకు అందుబాటులో ఉంటుంది.

కరివేపాకు చూడటానికి 'వేప' ఆకులా ఉంటుంది. అందుకే ఇండియాలో దీన్ని 'స్వీట్ నీమ్' అనికూడా పిలుస్తారు. కరివేపాకు కేవలం వంటలకు మాత్రమే కాదు, వివిధ రకాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ , వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ డయాబెటిక్ , యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలతో పాటు, హిపటో ప్రొటెక్టివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల, లివర్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పించే సామర్థ్యం ఇందులో ఉంది.

కరివేపాకును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టుకు విషయంలో ఇది చాలా గ్రేట్ రెమెడీ . ఎలాంటి జుట్టు సమస్యలైనా నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . కేవలం జుట్టు సమస్యలు మాత్రమే కాదు, అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది. దీని నుండి పెక్టిక్ అల్సర్ ను నివారించుకోవచ్చు . కరివేకు జుట్టుకు అత్యంత ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఇది కేవలంలో కూరలకు మాత్రమే పరిమితం అని అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.

అందుకే కూరలో కరివేపాకును తేలికగా తీసి పక్కన పెట్టేస్తుంటారు. దీని వల్ల ఏలాంటి ప్రయోజనం లేదను కుంటారు .అలా కూరలో కరివేపాకును తీసి పక్కన పెట్టాయడానికి ముందు అందులోనే అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే ఇక ముందు అలా పడేయకుండా వాడకుంటారు. కరివేపాకు వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో ఒక సారి డీప్ గా తెలుసుకుందాం...

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.

జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుందని నమ్ముతారు, అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకును హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు . ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లేదా పేస్ట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు .

యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది

యూరిన్ సమస్యలను తగ్గిస్తుంది

కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు .

 డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

ప్రస్తుత కాలంలో ఏజింగ్ సమస్య కాదు. డయాబెటిసే ఒక ఏజ్ సమస్యగా మారుతున్నది. వయస్సైపోవడం కంటే, డయాబెటిస్ కు భయపడే వారు ఎక్కువగా ఉన్నారు. డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన దీర్ఘకాలిక సమస్య. కరివేపాకులో యాంటీహైపర్ గ్లిసమిక్ నేచరల్ కలిగి ఉండటం వల్ల , ప్రధానమైన రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది.

 మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది

మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది

మార్నింగ్ సిక్నెస్ తో బాధపడే వారు, అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బులను నివారించడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది . గర్భిణీలు మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం నుండి ఉపశమనం కలిగిస్తుంది,. లెమన్ జ్యూస్ లో నిమ్మరసం, బెల్లం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ నివారించుకోవచ్చు. దీన్ని ప్రతి రోజు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

కరివేపాకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన కరివేపాకును చర్మానికి అప్లై చేయడం వల్ల మరింత బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది .

 కళ్ళ ఆరోగ్యానికి మంచిది

కళ్ళ ఆరోగ్యానికి మంచిది

కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్ళ సంబంధించిన జబ్బులను నివారించుకోవచ్చు. రెగ్యులర్ డైట్ లో కరివేపాకు చేర్చుకోవడం వల్ల కాంట్రాక్ట్ ను నివారించుకోవచ్చని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు

కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంద సమస్యల్లో హితకరంగా ఉంటుంది. స్కిన్ రాషెస్ మరియు బాయిల్స్ ను నివారిస్తుంది. కరివేపాకు పేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ ను తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కరివేపాకును పేస్ట్ చేసి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.రెగ్యులర్ గా కరివేపాకును చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వెగంగా తగ్గుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెందిన ఆక్సిడేషన్ నివారించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బరువు తగ్గించే క్రమంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హార్ట్ స్ట్రోక్ ను నివారించుకోవచ్చు .

అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా తగ్గిస్తుంది:

కరివేపాకును ఏదో ఒక రకంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనీమియాను నివారిస్తుంది. ఇది పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న బెస్ట్ గ్రాండ్ మదర్స్ చిట్కా. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో ఐరన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Health Benefits Of Consuming Curry Leaves Daily

On a general note, curry leaves are used to make cooking easy and tastier. Curry leaves also known as curry Patta and are commonly known to have a lovely taste with a refreshing fragrance. Do you know what the health benefits of curry leaves are? Keep reading to know all about it...
Desktop Bottom Promotion