పచ్చి బఠానీల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం

Posted By:
Subscribe to Boldsky

వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో మనం పచ్చి బఠానీలను ఎక్కువగా వాడుతుంటాం. ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. చూడడానికి చిన్నగా వున్నాయి కదా అని వాటిని చిన్న చూపు చూడకండి. ఈ బుజ్జి బుజ్జి బఠానీ గింజల్లో ఆరోగ్య కారకాలు బోలెడు. చాలా మంది పచ్చిబఠానీలను చాలా తేలికగా తీసుకుంటారు.

వీటిని సాధారణంగా ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. అయితే, ఈ చిన్నచిన్న పచ్చిబఠానీల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. చలికాలంలో మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు దొరకుతాయి. అంతేకాకుండా, చలికాలంలో ఇవి తినడం చాలా మంచిది. అందుకే, వింటర్ డైట్ కు చాలా ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.

పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే వరకూ అన్ని చర్యలను సహాయపడే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి. అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. రాత్రి పూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది.

బరువు తగ్గిస్తుంది

వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.

అజీర్ణం

ఒక్కోసారి తాజా బఠానీలు అందుబాటులో లేనప్పుడు ఎండిన వాటినే నానబెట్టి ఉపయోగిస్తుంటారు. అయితే వాటి వల్ల కొందరికి అజీర్ణం వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి వీటిని వంటసోడా, మాంసాహారం, మసాలా దినుసులతో కలిపి ఉడికించడకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది.

ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం

పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం.

కడుపులో ఇబ్బంది

బఠానీలను తీసుకున్నప్పుడు అరగక కడుపులో ఇబ్బందిగా ఉంటే వాము, సైంధవ లవణం, జీలకర్ర మిశ్రమాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి

వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం.

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి.

గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో దాదాపు 44 శాతం వరకు అందుతుంది.

శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి.

శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో మంచి కొలెస్టరాల్ స్థాయిలను పెంచుతాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Health Benefits Of Green Peas

Many people take the small round green peas very lightly. They just use it as a side dish or one of the ingredients to prepare a sumptuous dish. However, you need to know that the green winter vegetable is loaded with numerous health benefits.
Please Wait while comments are loading...
Subscribe Newsletter