దోసకాయ జ్యూస్ ఎందుకు హెల్తీ ఛాయిస్ ?

విటమిన్ కే,సీ,ఏ కలిగిన ఈ కూరగాయ శరీరం లోపలా, బయటా కూడా మనకి లాభాన్ని సమకూరుస్తుంది. కీరా దోసని జ్యూస్ చెయ్యడం వల్ల జీర్ణమయ్యే పీచుని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

Subscribe to Boldsky

కీరా దోసకాయని డైట్ ప్రోగ్రాం లేదా సహజంగా శరీరాన్ని శుభ్రపరిచే క్లెన్సర్గా వాడితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. విటమిన్ కే,సీ,ఏ కలిగిన ఈ కూరగాయ శరీరం లోపలా, బయటా కూడా మనకి లాభాన్ని సమకూరుస్తుంది. కీరా దోసని జ్యూస్ చెయ్యడం వల్ల జీర్ణమయ్యే పీచుని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. దీని వల్ల పోషకాలు మీ ప్రేగు నాళాల ద్వారా త్వరగా గ్రహించబడతాయి.

ఈ కాయగూరలో ఉండే ప్లాంట్ లిగ్నన్స్ జీర్ణ వ్యవస్థలో మంచి బాక్టీరియ నశించిపోకుండా కాపాడటమే కాకుండా ఆ బాక్టీరియాని ఎంటెరోలిగ్నన్స్ గా మారుస్తుంది. కీరా దోస జ్యూస్ ఆడవారిలో క్యాన్సర్ ని ముఖ్యంగా బ్రెస్ట్, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లని నిరోధిస్తుంది.

How Can Cucumber Juice Benefit You

గోళ్ళు, చర్మం, జుట్టు పోషణలో కూడా కీరా ముఖ్య మాత్ర పోషిస్తుంది. కళ్ల కింద ఉబ్బినట్లుంటే కళ్ల మీద కీరా దోస ముక్కలని ఉంచుకోవడం వినే ఉంటారు కదా. కీరాలో ఉన్న ఆస్ట్రింజెంట్ గుణం వల్ల చర్మంలోని మురికి గ్రహించబడి స్వేద గ్రంధులని శుభ్రపడతాయి.

How Can Cucumber Juice Benefit You

యాక్నే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో కీరా దోసది కీలక పాత్ర. శరీరంలోని వివిధ కణజాలాలని కలిపి ఉంచడంలో సిలికా అనే మినరల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కీరా దోసలో ఉంటుంది.కీరా దోసలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది.అందువల్ల టాక్సిన్స్‌ని బయటకి పంపి శరీరాన్ని శుభ్రపరచుకోవాలనుకుంటే ఇది తీసుకోవడం మంచిది. మన శరీరంలో క్రొవ్వు కణాల్లో ట్యాక్సిన్స్ దాగి ఒక్కోసారి వాపుని కలుగచేస్తాయి.

How Can Cucumber Juice Benefit You

కీరా దోసలో నీరే కాకుండా శరీరానికి తేమ అందించే ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ద్రవ పదార్ధాల నిల్వలని సమతుల్యంలో ఉంచడానికి ఉపయోగపడతాయి.అందువల్లే బరువు తగ్గాలనుకునే వారు, డీటాక్సిఫికేషన్ చేసుకునేవారు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ జ్యూస్ వల్ల ఆర్ధరైటిస్ కారకాలు కూడా శరీరంలో తగ్గు ముఖం పడతాయి.

How Can Cucumber Juice Benefit You

కీరాను తొక్కతో సహా రసం తీయడం మరిచిపోవద్దు. ఒకవేళ మీరు వాడే కీరా దోస ఆర్గానిక్ కాకపోతే ఒకటికి రెండు సార్లు మంచి నీటితో శుభ్రం చేసిన తర్వాతే తొక్కతో సహా జ్యూస్ తియ్యండి. ఈ జ్యూస్ గాఢంగా ఉండదు పైగా ఒక ప్రత్యేక రుచి ఉండదు. అందువల్ల దీనిని ఏ ఇతర ఫ్రూట్ జ్యూసుతో కలిపి తీసుకున్న రుచి కూడా బాగుంటుంది.

How Can Cucumber Juice Benefit You

చూసారుగా అనేక రకాల చర్మ సమస్యలకి, అనారోగ్యాలకీ ఈ జ్యూస్ ఎలా ఉపయోగపడుతుందో.శరీరంలోని విష పదార్ధాలని బయటకి తోసెయ్యడానికి ఇదొక అధ్భుత సాధనం. దీనివల్ల మీ చర్మం, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

How Can Cucumber Juice Benefit You?

How Can Cucumber Juice Benefit You? There are a variety of cucumber juice advantages found by using cucumbers as part of a detoxification diet programme or as a natural cleanser.
Please Wait while comments are loading...
Subscribe Newsletter