ప్రపంచంలోనే అత్యంత హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్స్ ..!!

మన రోజు వారి జీవితంలో ఆహారం అత్యంత ముఖ్యమైనది. ప్రపంచం మొత్తంలో ఆహారాలు అనేక రకాలున్నాయి. ప్రాతాలను, రాష్ట్రాలను, దేశాలను బట్టి, అక్కడి వాతావరణ స్థితిగతులను బట్టి వివిధ రకాలుగా పండించుకుంటారు . ప్రతి

Posted By:
Subscribe to Boldsky

మన రోజు వారి జీవితంలో ఆహారం అత్యంత ముఖ్యమైనది. ప్రపంచం మొత్తంలో ఆహారాలు అనేక రకాలున్నాయి. ప్రాతాలను, రాష్ట్రాలను, దేశాలను బట్టి, అక్కడి వాతావరణ స్థితిగతులను బట్టి వివిధ రకాలుగా పండించుకుంటారు . ప్రతి ఒక్క ఆహార పదార్థాల్లో వాటికి తగ్గ ప్రయోజనాలున్నాయి. వాటిలో చాలా వరకూ హెల్తీ ఫుడ్స్ అని , అన్ హెల్తీ ఫుడ్స్ అని కూడా విభజించారు. ఈ ఆర్టికల్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాలను పరిచయం చేస్తున్నాము. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ హెల్తీ ఫుడ్స్ ను రెగ్యురల్ గా రోజూ తినగలిగే ఆహారాలు. ఇవి ఖచ్చితంగా ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల అనేక వ్యాధుల నుండి శరీరం రక్షణ పొందడానికి కావల్సిన వ్యాధినిరోధకశక్తిని పొందుతారు. ఈ ఆహారాలు వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే ఏవి ఆరోగ్యకరమైనవి, ఏవి అనారోగ్యకరమైనవి తెలుసుకోవడం చాలా అవసరం. అంతే కాదు ఈ ఆహారాలతో పాటు రెగ్యులర్ వ్యాయామం కూడా అవసరమే. దినాచర్యలో ఈ రెండూ ఉన్నట్లైతే ఇమ్యూన్ సిస్టమ్ తో పాటు, మెటబాలిజం రేటు కూడా పెరుతుంది. మరి ఈ ప్రపంచంలో అత్యంత ఆరోగ్య కరమైన కొన్ని ఆహారాల గురించి ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

కాలే :

కాలే ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ . ఈ గ్రీన్ లీఫ్ లో విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉన్నాయి.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ ను వరల్డ్ సూపర్ ఫుడ్ గా చెబుతారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి, సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది. హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్ , ఇందులో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అత్యంత ముఖ్యమైనవి. మరియు కార్డియో వాస్క్యులర్ హెల్త్ గా గ్రేట్ గా సహాయపడుతుంది. ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి.

కిడ్నీ బీన్స్ :

కిడ్నీ బీన్స్ లో విటమిన్ వి, కె లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ కె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నాడీవ్యవస్థను, బ్రెయిన్ హెల్త్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీ బీన్స్ లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. విటమిక్ కె , సోలబుల్ ఫైబర్స్ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనవి.

సాల్మన్ :

సాల్మన్ హెల్తీ ఫుడ్స్, సాల్మన్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ప్రీమెచ్యుర్ ఏజింగ్ నివారిస్తుంది . మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

యాపిల్స్ :

ఆపిల్స్ ఎనర్జీ బూస్ట్ వంటివి ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. సోలబుల్ ఫైబర్, పెక్టిన్ అధికంగా ఉంటుంది.మరియు ఆపిల్స్ విటమిన్ సి మరియు బికాంప్లెక్స్ లు పుష్కలంగా ఉండటం వల్ల అలసట అనేది ఉండదు. బాడీ స్ట్రెంగ్త్ ను పెంచుతుంది. ఆపిల్స్ లో ఉండే ఫైటో కెమికల్స్ వ్యాధులను దూరం చేస్తుంది. అందుకే దీన్ని వరల్డ్ సూపర్ ఫుడ్ అంటారు

బ్లూబెర్రీస్:

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

అరటిపండ్లు:

పండ్ల ద్వారా పొటాషియం అందుతుంది. అరటిపండు, ఆప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోదాతులో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అరటిపండ్లు హై ఎనర్జిటిక్ ఫుడ్స్. వీటిలో నేచురల్ షుగర్స్, సుక్రోజ్, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లు ఉన్నాయి. ఇది తక్షణ ఎనర్జీని మరియు బలాన్ని అందిస్తాయి. పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది. యూరినరీ సమస్యలను నివారి్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉండి ఇది శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. ఇది క్యాబేజ్ ఫ్యామిలికి సంబంధించినది. ఇందులో యాంటీక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది, కార్డిక్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఐరన్ మరియు విటమిన్స్ , క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి బలహీనతను మరియు అలసటను నివారిస్తాయి . ఆకుకూరలు మరియు చీజ్ కాంబినేషన్ తో హెల్తీ ఫుడ్స్ ను తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో బర్త్ డిఫెక్ట్స్ ను నివారించడంలో గ్రేట్ ఫుడ్ .

టమోటోలు:

వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల రిస్కూ తగ్గుతుంది.టమోటోలో చాలా ఉపయోగకరమైన వెజిటేబుల్. అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీ పార్లలో ఫేస్‌మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు. లైకోపిన్ అనే ఎంజైమ్ వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

క్యారెట్స్:

విటమిన్ ఎ, కె లు పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే స్త్రీలు క్యారెట్ ను ఎక్కువగా తీసుకొంటే మంచిది. క్యారెట్ కంటికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి. క్యారెట్స్ రెగ్యులర్ గా తింటుంటే జీవిత కాలాన్ని 5 రోజులు ఎక్కువగా పెంచుతాయి.

బీట్ రూట్ :

బీట్ రూట్ లో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటు పెంచుతుంది. అనీమియా తగ్గిస్తుంది. హార్ట్ ను హెల్త్ గా ఉంచుతుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది.

లీన్ మీట్ :

లీన్ మీట్ లో జింక్, విటమిన్స్, మెగ్నీషియం, ఐరన్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, మినిరల్స్ మిరయు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందిస్తుంది . మరియు ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి ఎనర్జీని అందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవడానికి లీన్ మీట్ తీసుకోవాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

The 13 Healthiest Foods In The World

There are so many innumerable number of foods, each of them having their own share of benefits and dangers. While there are so many foods that can be classified as healthy, to what level always remains dicey. In this article though, we give you a clear picture of what the healthiest foods are. This list comprises the healthiest foods in the world. These most healthy foods, if consumed on a daily basis, will guarantee sublime overall health.
Story first published: Saturday, November 12, 2016, 14:21 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter