ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్..!!

మీరూ వేరుశనగ పప్పును ఇష్టపడతారా ? ఉడికించిన వేరుశనగలు చూస్తే చాలు తినేయాలి అనిపిస్తుందా ? అయితే ఈ అలవాటు మంచిదే. వేరుశనగలను పచ్చిగా తినడం కంటే కాస్త ఉప్పు వేసి ఉడికించి తినడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు

Posted By:
Subscribe to Boldsky

వేరుశనగ పప్పు చూస్తే ఎవరికైనా.. చటుక్కున నోట్లో వేసుకోవాలి అనిపిస్తుంది. విభిన్నమైన రుచి కలిగి ఉండే.. వేరుశనగ గింజలను సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆంధ్రాలో వీడి వాడకం మరీ ఎక్కువ. చట్నీ, స్నాక్, లెమన్ రైస్ వంటి రకరకాల వంటకాల్లో వేరుశనగ గింజలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

boiled peanuts

అలాగే రోడ్లపై ఎక్కడ చూసినా ఘుమఘుమ సువాసనలతో.. ఉడికించిన వేరుశనగలు కనిపిస్తూ ఉంటాయి. పల్లెటూర్లలో అయితే.. వేరశనగ పంట చేతికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో వీటిని ఉడికించి స్నాక్స్ గా తింటూ ఉంటారు.

మీరూ వేరుశనగ పప్పును ఇష్టపడతారా ? ఉడికించిన వేరుశనగలు చూస్తే చాలు తినేస్తారా ? అయితే ఈ అలవాటు మంచిదే. వేరుశనగలను పచ్చిగా తినడం కంటే కాస్త ఉప్పు వేసి ఉడికించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉడికించిన వేరుశనగల్లో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా..

తక్కువ క్యాలరీలు

డ్రైఫ్రూట్స్ తో సమానంగా.. వేరుశనగ గింజల్లో పోషకాలుంటాయి. అయితే ఉడికించిన వేరుశనగల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయట. ఒక కప్పు ఉడికించిన వేరుశనగల్లో 90 క్యాలరీలుంటాయి. అదే వేయించిన డ్రై వేరుశనగల్లో అయితే 166క్యాలరీలుంటాయి. కాబట్టి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది.

ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్

ఉడికించిన వేరుశనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. దీనివల్ల.. క్యాన్సర్, హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తాయి.

ఫైబర్

ఉడికించిన వేరుశనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన వేరుశనగ గింజల్లో 2.5గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఉడికించిన వేరుశనగలు తీసుకోవడం వల్ల.. కాన్ట్సిపేషన్ అరికట్టవచ్చు, ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్, డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి

ఉడికించిన వేరుశనగల్లో ఉండే ఫ్యాట్ అంతా గుండె ఆరోగ్యానికి సహాయపడే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్. డైట్ లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్ చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఎనర్జీ

అరకప్పు ఉడికించిన వేరుశగన గింజల్లో 12గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల న్యాచురల్ షుగర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి మధ్యలో ఉడికించిన వేరుశనగలు తింటే.. కావాల్సినన్ని పోషకాలు అందడమే కాకుండా.. మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.

బ్రెయిన్, కండరాలు

ఉడికించిన వేరుశగనలు స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల.. మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.

విటమిన్స్

ఉడికించిన వేరుశనగల ద్వారా విటమిన్ ఈ పుష్కలంగా పొందవచ్చు. కండరాలు, అవయవాల డెవలప్ మెంట్ లో కీలకపాత్రపోషించే బి కాంప్లెక్స్ విటమిన్స్ ని పొందవచ్చు. బి విటమిన్స్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడతాయి.

ఎముకలు, నరాలకు

అరకప్పు ఉడికించిన వేరుశగనల్లో 30 శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ ఎముకలు, పళ్లకు మంచిది. అలాగే మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకి సహాయపడతాయి. అలాగే ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

What Are the Benefits of Eating Boiled Peanuts?

What Are the Benefits of Eating Boiled Peanuts? Southern-style boiled peanuts are the most nutritious way to eat peanuts.
Please Wait while comments are loading...
Subscribe Newsletter