For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ తో అల్లం కలిపి తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు..!

|

సాధారణంగా వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. వీటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా వ్యాధుల భారిన పడాల్సి వస్తుంది. అంతే కాదు పెద్ద మొత్తంలో డాక్టర్ల కోసం ఖర్చుచేయాలి. కాబట్టి, వ్యాధులు ఏకారణం చేత వచ్చినా మొదట హోం రెమెడీస్ కు ప్రాధాన్యత ఇవ్వండి.వీటిని ఉపయోగించినా తగ్గకపోతే అప్పుడు డాక్టర్స్ ను సంప్రదించింది. నేచురల్ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

మనం ఇంట్లో తయారుచేసుకునే కొన్ని రకాల జ్యూస్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో తయారుచేసిన జ్యూసులు తాగినప్పుడు ఒక్క వ్యాధిని నివారించడం మాత్రమే కాదు, వివిధ రకాల వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఇమ్యూనిటిలోపం, హెరిడిటి, ఇన్ఫెక్షన్స్, గాయాల వల్ల తరచూ జబ్బు పడుతుంటారు .

కాబట్టి, అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. . అందుకు హెర్బల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. అటువంటి నేచురల్ జ్యూస్ లో ఒకటి క్యారెట్ అండ్ జింజర్. ఈ రెండింటి కాంబినేషన్ జ్యూస్ లో 7 రకాల వ్యాధులను నివారించుకోవచ్చు. కొన్ని క్యారెట్ ముక్కలు, కొద్దిగా అల్లం మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీరు పోసి జ్యూస్ తయారుచేసుకోవాలి. తర్వాత వడగట్టాలి. అంతే హెల్తీ జ్యూస్ డ్రింక్ రెడీ . ప్రతి రోజూ ఉదయం ఖాలీ పొట్టతో దీన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

1. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

1. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ లో కంటిపవర్ ను పెంచే సామర్థ్యం ఎక్కువ, కంటి కణాలకు తగిన పోషకాలను అందిస్తుంది. ఇది కంటి నరాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది .

2. క్యాన్సర్ నివారిస్తుంది:

2. క్యాన్సర్ నివారిస్తుంది:

ఫ్రెష్ జింజర్ క్యారెట్ జ్యూస్ లో అన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను దూరం చేస్తుంది. శరీరానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాక్సిడేటివ్ లక్షణాలు , యాంటీ మెటాస్టాటిక్ లక్షాలు కలిగి ఉంటుంది. అల్లం ఓవేరియన్, లంగ్, బ్రెస్ట్, స్కిన్, ప్రొస్టేట్ మరియు ప్యాంక్రియాటిక్ వంటి వివిధ రకాల క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

3. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

3. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

క్యారెట్ అండ్ జింజర్ జ్యూస్ లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఇవి హానికరబ్యాక్టీరియాను మరియు వైరస్ ను నాశనం చేస్తుంది . దాంతో ఇన్ఫెక్షన్స్ వ్యాధులను నివారించుకోవచ్చు.

4. వికారం తగ్గిస్తుంది:

4. వికారం తగ్గిస్తుంది:

ఈ హోం మేడ్ హెల్తీ జ్యూస్ పొట్టలో యాసిడ్స్ క్రమబద్దం చేస్తుంది , దాంతో వికారం, వాంతులు నివారిస్తుంది.

5. కండరాల నొప్పులను తగ్గిస్తుంది:

5. కండరాల నొప్పులను తగ్గిస్తుంది:

ఈ క్యారెట్ మరియు జింజర్ హెర్బల్ జ్యూస్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది. కండరాలను ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

6. హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

6. హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

అల్లం మరియు క్యారెట్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇది కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. హార్ట్ హెల్త్ కు క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్ మరియు లూటిన్ కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది మరియు హార్ట్ అటాక్ ప్రమాధంను తగ్గిస్తుంది. పొటాషియం హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

7. చిగుళ్ళ వ్యాధులను మెరుగుపరుస్తుంది:

7. చిగుళ్ళ వ్యాధులను మెరుగుపరుస్తుంది:

ఈ నేచురల్ డ్రింక్ తాగడం వల్ల చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. హెల్తీ సలైవా ఉత్పత్తి అవుతుంది.

8. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

8. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు, క్యారెట్ , జింజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అల్లం బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇన్సులిన్ లెవల్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ తో వచ్చే ఇతర అనారోగ్య సమస్యను దూరం చేస్తుంది.

9. చర్మ ఆరోగ్యం మెరుగు:

9. చర్మ ఆరోగ్యం మెరుగు:

అల్లం, క్యారెట్ జ్యూస్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి హెల్తీ స్కిన్ ను ప్రోత్సహిస్తుంది . చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఈ డ్రింక్ లో ఉండే విటిమన్ ఇతర యాంటీఆక్సిడెంట్స్ , క్యారెట్ చర్మ ఆరోగ్యాయినికి చాలా మేలు చేస్తుంది. ఇవి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . మొటిమలను , పిగ్మెంటేషన్ , స్కిన్ టోన్ సమస్యలను నివారిస్తుంది. క్యారెట్ లోని బీటా కెరోటిన్ హెల్తీ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

10.జీర్ణ శక్తిని పెంచుతుంది:

10.జీర్ణ శక్తిని పెంచుతుంది:

అల్లం, క్యారెట్ జ్యూస్ జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో క్యారెట్, అ్లలం తప్పనిసరిగా చేర్చుకోవాలి. రెండింటిలో న్యూట్రీషియన్ ఎక్కువగా ఉండటం వల్ల ,ఇవి కోలన్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. పచ్చి క్యారెట్ జ్యూస్ పొట్ట సమస్యలను నివారిస్తుంది. మలబద్దక సమస్య ఉండదు. అల్లం వికారం, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. హార్ట్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

What Happens When You Drink Carrot And Ginger Juice?

Diseases and ailments are common phenomenon that affect human beings and when a person is affected with a disorder, he/she has to spend a lot on doctors! So, it is best to try out certain natural remedies for diseases, which are affordable and effective.
Story first published:Saturday, August 27, 2016, 14:48 [IST]
Desktop Bottom Promotion