For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీరావాటర్ లో తేనె కలిపి తీసుకోవడం వల్ల.. పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

సాధారణంగా వంటచేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లోకి వెళ్తుంటాం. కానీ.. మన వంటగదిలో.. అనేక ఔషధ గుణాలున్న పదార్థాలు ఉంటాయన్న విషయం మనం మరిచిపోతూ ఉంటాం. అవి.. మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నిజమే.. డాక్టర్లు, మందుల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం కంటే.. న్యాచురల్ పదార్థాలతో.. తేలికగా.. ప్రయోజనాలు పొందవచ్చు.

ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్ ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు మన వంటగది చక్కటి పరిష్కారం. కొన్ని రకాల హోం రెమిడీస్.. మన ఇమ్యునిటీని పెంచడమే కాదు.. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా అరికడతాయి. అలాగే.. జీలకర్రలోని అమోఘమైన ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు.

లేటెస్ట్ స్డడీ: ఈ డ్రింక్ తో రోజు ప్రారంభిస్తే అనారోగ్య సమస్యలకు చెక్ లేటెస్ట్ స్డడీ: ఈ డ్రింక్ తో రోజు ప్రారంభిస్తే అనారోగ్య సమస్యలకు చెక్

మీకు తెలుసా.. జీలకర్రను నీళ్లు, తేనెతో కలిపి తీసుకోవడం అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సింపుల్ రెమిడీ.. శరీరంలో అద్భుత మార్పులు తీసుకొస్తుంది. మరి ఈ జీరా వాటర్, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

జీరా 2 టీ స్పూన్లు

తేనె 2 టీ స్పూన్లూ

నీళ్లు 1 కప్పు

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ఒక కప్పు నీటిని ప్యాన్ లో వేడి చేయాలి.

మరుగుతున్న నీటిలో జీలకర్ర వేయాలి. 10 నిమిషాలు మరిగించాలి.

చల్లారిన తర్వాత.. ఆ నీటిని వడకట్టుకోవాలి.

ఇప్పుడు జీరా వాటర్ లో తేనె కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు.

డెటాక్సిఫై

డెటాక్సిఫై

ఈ డ్రింక్ తాగడం వల్ల బ్లడ్ లో పేరుకున్న మలినాలను యూరిన్ ద్వారా బయటకుపంపవచ్చు. ఈ న్యాచురల్ డ్రింక్ డెటాక్సిఫై ఏజెంట్ లా పనిచేస్తుంది. దీనివల్ల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగుపడటానికి

జీర్ణక్రియ మెరుగుపడటానికి

జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం... జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేసి.. అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలను దూరంగా ఉంచుతుంది.

కాన్ట్సిపేషన్ తగ్గించడానికి

కాన్ట్సిపేషన్ తగ్గించడానికి

జీరా, తేనె కాంబినేషన్ కాన్ట్సిపేషన్ నివారించడానికి ఎఫెక్టివ్ రెమిడీ. కాబట్టి కాన్ట్సిపేషన్ తో బాధపడేవాళ్లు.. ఈ మిశ్రమాన్ని తాగితే.. ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

క్యాన్సర్ నివారణకు

క్యాన్సర్ నివారణకు

జీరాలో క్యుమినల్ డిహైడ్ ఉంటుంది. ఇది.. క్యాన్సర్ కణాలు పెరగకుండా, శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

జీరా వాటర్, తేనె మిశ్రమంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఆస్తమా నివారించడానికి

ఆస్తమా నివారించడానికి

ఈ న్యాచురల్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇది.. శ్వాస సంబంధ సమస్యలను నివారించి.. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.

అనీమియా నివారించడానికి

అనీమియా నివారించడానికి

జీరా వాటర్, తేనె మిశ్రమంలో.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రమంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల అనీమియాను నివారించవచ్చు.

English summary

What Happens To Your Body When You Drink Jeera Water With Honey?

What Happens To Your Body When You Drink Jeera Water With Honey? Did you know that the combination of jeera water and honey can have up to 7 health benefits for our body? Learn how to prepare the remedy, here.
Story first published: Monday, August 8, 2016, 15:48 [IST]
Desktop Bottom Promotion