For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు 3 గుడ్లు, 1 వారం పాటు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పు..!!

గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే? కొన్ని సంవత్సరాల క్రితం గుడ్డు తింటే అందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి మంచిది కాదన అపోహ చాలా మందిలో ఉండేది. కానీ మీకు తెలుసా..

|

గుడ్డు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే? కొన్ని సంవత్సరాల క్రితం గుడ్డు తింటే అందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి మంచిది కాదన అపోహ చాలా మందిలో ఉండేది. కానీ ఒక పెద్ద గుడ్డులో 180 నుండి 186 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా?

రోజుకు మూడు గుడ్లు, ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తింటే ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే ఈ ఆర్టికల్. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయం కొలెస్ట్రాల్ తగ్గించడంలో అడ్జెస్ట్ మెంట్స్ చేసుకుంటుంది.

Eat Three Eggs Every Day For A Week & See What Happens To Your Body!

అంటే, రోజుకు మూడు గుడ్లు తిన్నా కూడా, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదన్న మాట. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో గుడ్డు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా పొందవచ్చు. గుడ్లు అద్భుతమైన న్యూట్రీషియన్ ఫుడ్. గుడ్డును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి, అవసరమయ్యే విటమిన్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా అందుతాయి.

రోజూ గుడ్డు తినడం వల్ల శరీరంలో జరిగే ఆ అద్భుత మార్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 గుడ్డులో న్యూట్రీషియన్స్ అధికం:

గుడ్డులో న్యూట్రీషియన్స్ అధికం:

ఒక్క గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లావిన్ ఫొల్లెట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి.

 గుడ్డు మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది:

గుడ్డు మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది:

గుడ్డులో ఉండే హై డెన్సిటి లిప్పోప్రోటీన్ (హెచ్ డిఎల్ ) ఇది శరీరం మరియు బ్రెయిన్ కు చాలా అవసరం. హెచ్ డిఎల్ శరీరంలో ప్రతి సెల్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీంరలో టెస్టోస్టెరోన్, ఈస్ట్రోజెన్, మరియు కార్టిసోల్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

కోలిన్ ను ఉత్పత్తి చేస్తుంది:

కోలిన్ ను ఉత్పత్తి చేస్తుంది:

గుడ్డులో కోలిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహిస్తుంది. మెమరీ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. రోజుకు మూడు గుడ్లు తింటుంటే, వ్యత్యాసం ఖచ్చితంగా గుర్తిస్తారు.

కళ్ళను షార్ప్ గా ఉంచుతుంది:

కళ్ళను షార్ప్ గా ఉంచుతుంది:

గుడ్డులో ఉండే లూటిన్ మరియు జియాక్సిథిన్ , కెరోటినాయిడ్ విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా ఇది వయస్సుకు సంబంధించిన మాస్కులర్ డీజనరేషన్ రిస్క్ ను తగ్గించి, వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది.

కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది:

కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది:

రెండు గుడ్లు తినడం వల్ల ఒక సర్వింగ్ మాంసం తిన్నంత ప్రోటీన్ ను పొందవచ్చు. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎగ్ వైట్ స్ట్రాంగ్ మజిల్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి, రోజుకు మూడు గుడ్లు తినడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది :

బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది :

గుడ్డులో ఉండే క్యాల్సియం, మరియు విటమిన్ డి కంటెంట్ శరీరం డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. విటమిన్ డి శరీరం క్యాల్షియం గ్రహించి సామర్థ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, ఈ రెండు పోషకాలు, ఎముకలను స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతాయి.

 బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

గుడ్డు పోషకాహారం అన్న విషయం అందరీకి తెలుసు. అలాంటి గుడ్డును రోజూ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల డేలో ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం, లో కార్బోహైడ్రేట్ డైట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ ను తగ్గిస్తుంది.

అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి:

అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి:

గుడ్డులో శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే పూర్తి పోషకాలు శరీరానికి పూర్తిగా అందేందుకు సహాయపడుతుంది.

English summary

Eat Three Eggs Every Day For A Week & See What Happens To Your Body!

Did you ever know what happens to your body when you eat three eggs a day in a week? Well,
Desktop Bottom Promotion