For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్జామ్స్ టైమ్: బ్రెయిన్ పవర్ ను పెంచే ఎనర్జీ బూస్టర్స్ టాప్ 10 సూపర్ ఫుడ్స్

మార్చి, ఏప్రిల్ అంటేనే ఎక్సామ్ టెన్షన్, పిల్లలకే కాదు, పెద్దలకు కూడా. ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ఎక్సామ్స్ సమయంలో బుక్స్, పేపర్స్, పెన్స్ తోటే కనబడుతుంటారు. ఈ ఎక్సామ్స్ సమయంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా

By Lekhaka
|

మార్చి, ఏప్రిల్ అంటేనే ఎక్సామ్ టెన్షన్, పిల్లలకే కాదు, పెద్దలకు కూడా. ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ఎక్సామ్స్ సమయంలో బుక్స్, పేపర్స్, పెన్స్ తోటే కనబడుతుంటారు. ఈ ఎక్సామ్స్ సమయంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా టెన్షనే. డిఫికల్ట్ టైమ్. మొత్తం అంతా బ్రెయిన్ తో పని, ఐక్యూ కు చాలెంజ్ చేయడం.

మిగిలిన స్కూల్ డేస్ లో కంటే పరీక్షల సమయంలో బ్రెయిన్ కు ఎక్కువ పనిపెడుతుంటారు. మరి అలాంటి బ్రెయిన్ కోసం , బ్రెయిన్ పవర్, బ్రెయిన్ హెల్త్ కోసం ఏం చేస్తున్నారు. ఎలా ఎనర్జీని అందిస్తున్నారు. మీ బ్రెయిన్ గురించి మీరు ఇప్పటి వరకూ పట్టించుకోలేందంటే వెంటన్ స్టార్ట్ చేయండి.

బ్రెయిన్ పవర్ ను పెంచడంలో ఆహారాలు చాలా ఉన్నాయి.ముఖ్యంగా ఎక్సామ్స్ సమయంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తింటూ, ఎక్సామ్స్ కు ప్రిపేర్ అవ్వడం చాలా సులభం అవుతుంది. ఈ క్రింది సూచించిన ఆహారాలు బ్రెయిన్ కు ఎనర్జీ బూస్టర్స్ గా పనిచేసి, అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ సమయంలో బ్రెయిన్ కు హెల్తీ న్యూట్రీషియన్స్ ను అందించి, బ్రెయిన్ చురుకుగా పనిచేయడానికి సహాయపడుతాయి.

ఈ సమయంలో కొంత మంది చదువుకోవడానికని , సమయంలేదనే టెన్షన్ తో బ్రేక్ ఫాస్ట్, లేదా ఫుడ్స్ తినడం మానేస్తుంటారు.ఆ ఛాన్స్ వారికివ్వకుండా, వారు సరైన న్యూట్రీషియన్ ఫుడ్స్ తినడానికి సహాయపడాలి. బ్రెయిన్ బూస్టింగ్ పవర్ ఫుడ్స్ ను అందివ్వాలి. బ్రెయిన్ హెల్త్ ను పెంచడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గుడ్డు:

గుడ్డు:

బెస్ట్ ఫండమెంటల్ న్యూరో ట్రాన్స్ మీటర్స్, ఇది కోలిన్ అందిస్తుంది. ఈ న్యూట్రీషియన్స్ తో పాటు, గుడ్డులో కొలెస్ట్రాలో ఉంటుంది. ఇది బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు ఎగ్స్ ను పిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ పవర్ చురుగ్గా ఉంటుంది.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

బ్రెయిన్ పవర్ పెంచడంలో వాల్ నట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఎక్సామ్స్ సమయంలో వాల్ నట్స్ తినడం వల్ల ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి. బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరచడంలో బూస్టర్స్ గా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ , కాపర్, మెగ్నీషియంలు గ్రేట్ గా సహాయపడుతాయి. రోజుకు ఒకటి రెండు వాల్ నట్స్ తింటే చాలు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

చాలా మంది పిల్లల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ఇష్టపడరు. బ్రెయిన్ పవర్ ను పెంచడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా ఎక్సామ్స్ సమయంలో గ్రీన్ లీఫ్స్ తినడం వల్ల బ్రెయిన్ ప్రొటెక్టివ్ కు సహయాపడే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె, ఫొల్లెట్, మరియు లూటిన్లు ఇందులో అధికంగా ఉన్నాయి.

అవొకాడో:

అవొకాడో:

ఇందులో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, బ్రెయిన్ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మర్ లో అవొకాడో జ్యూస్ ను వారంలో రెండు మూడు సార్లు తాగితే, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

మెమరీ పవర్ పెంచడంలో ఆకుకూరల కంటే ఎఫెక్టివ్ గా పనిచేయడంలో మరొకటి లేదు. ఎందుకంటే ఇందులో బ్రెయిన్ ప్రొటెక్ట్ చేసే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె, ఫొల్లెట్, మరియు లూటిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పవర్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

సాల్మన్ :

సాల్మన్ :

నాన్ వెజ్ లవర్స్ కు సాల్మన్ ఒక గ్రేట్ ఫుడ్. సాల్మన్ లో ఓమేగా 3 ఫ్యాట్ ఆయిల్స్, డిహెచ్ ఎ, హెల్తీ బ్రెయిన్ సెల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. మెమరీ పెంచడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

వర్జిన్ కోకనట్ ఆయిల్ బ్రెయిన్ పవర్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్రెయిన్ న్యూరాన్స్ ను ఉత్తేజపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ కొబ్బరి ప్రీరాడికల్స్ ఉత్పత్తికాకుండా నివారిస్తుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

కోకపౌడర్, మరియు చాక్లెట్స్ ఫాలీ ఫినాల్స్ కు న్యూరో ఫ్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ను అందిస్తుంది. డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచిది. వీటిని రోజూ తినడం వల్ల బ్రెయిన్ సెల్స్ కు రక్షణ కలుగుతుంది. మెమరీ పవర్ పెంచుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో సల్ఫోరఫోన్ అనే రసాయనం డిటాక్సిఫై చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తుంది. మెమెరీ పవర్ ను పెంచుతుంది.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలను స్నాక్స్ గా తీసుకోవచ్చు. పరిశోధనల ప్రకారం, గుమ్మడిలో జింక్, మినిరల్స్, అధికంగా ఉన్నాయి. ఇది ఓవరాల్ బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

English summary

Exam Time: 10 Foods To Boost Your Brain Power

Exam time is hitting!! Now, there will be nothing else on your mind other than books, papers and pen. Exam time is a difficult time for both parents and children. It will be all about working your brain and challenging your IQ.
Desktop Bottom Promotion