For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లాసంగా ఉన్నా..నిస్సత్తువగా ఉన్నా తాగిన వెంటనే మనస్సుకు ఉత్తేజం కలిగించే చాయ్..

మసాలా చాయ్ : భారత దేశంలో ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్ చాయ్ మాత్రం ‘మసాలా చాయ్’ అంటున్నారు నిపుణులు. ఒక కప్పు మసాలా టీ అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చక్కటి రుచితోపాటు మనిషి ఆరో

|

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయేవరకూ మనిషి జీవితంలో చాయ్ (టీ) పాత్ర అమోఘమైంది.. మానవ దేహంలో ఉత్తేజాన్ని కలిగించే ఆహార పదార్థాల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. 4వ శతాబ్ధంలో చైనాలో పుట్టిన టీ, ప్రంపచంలోని దాదాపు అన్ని దేశాల్లో స్థానం సంపాధించుకుంది. మనుషుల మధ్య అనుబంధానికి అనుసంధానంగా మారింది. తాగునీటి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టంగా తాగే పానియంగా గుర్తింపు పొందింది. ఉల్లాసంగా ఉన్నా.. నిస్సత్తువగా ఉన్నా తాగిన వెంటనే మనస్సుకు ఉత్తేజం కలగించే చాయ్.. మనిషి జీవితంలో అంతర్భాగమైంది.

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు కొన్ని రకాల ఆకులను ఎండబెట్టి, వేడి నీటిలో కలిపి 'టీ' ని తయారు చేసినట్లు చరిత్ర చెబుతున్నది. 15వ శతాబ్ధంలో నాగరిక సమాజంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి బదులుగా చైనా నుంచి టీని దిగుమతి చేసుకున్నది. అనంతర కాలంలో 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో తేయాకును కనిపెట్టగా, భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. 1833లో చైనాతో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, భారతదేశంలో టీ ఉత్పాదనకు బ్రిటన్ శ్రీకారం చుట్టింది. మూడు దశాబ్ధాల క్రితం వరకూ సంపన్న వర్గాల్లో మానసిక విశ్రాంతి కోసం కాఫీ, టీ తాగే అలవాటు ఉండేది. తర్వాత రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి ప్రవేశించడంతో సామాన్య జనంలో కూడా టీపైన ఆసక్తి పెరిగింది. పైగా అందుబాటు ధరల్లో లభించడంతో కాఫీ కంటే టీకి ప్రాధాన్యత పెరిగింది. దాదాపు ప్రతి దేశంలోనూ టీని వినియోగిస్తున్నప్పటికీ, మన దేశం ఉత్పాదించే టీ.. వైవిద్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధిగాంచింది.

మసాలా చాయ్ : భారత దేశంలో ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్ చాయ్ మాత్రం 'మసాలా చాయ్' అంటున్నారు నిపుణులు. ఒక కప్పు మసాలా టీ అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చక్కటి రుచితోపాటు మనిషి ఆరోగ్యంగా ఉండడానికీ, శరీరం ఫిట్‌గా ఉండడానికీ ఉపయోగపడుతుంది.

వివిధ రకాల మసాలా దినుసులను వాడి తయారు చేస్తారు కాబట్టి దీనికి 'మసాలా ' అనే పేరొచ్చింది. భారతదేశంలో ఎక్కువగా పండించే ఇలాచీ, దాల్చిన చెక్క, అల్లం, లవంగాలను ఉపయోగించి తయారు చేసే మసాలా టీని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలుంటాయి. వీటిలోని ఔషధ గుణాలు, వివిధ రకాల నొప్పులను నివారిస్తాయి. మరి దేనికోసం ఆలోచిస్తున్నారు?మసాలా ఛాయ్ తాగి, ఎంజాయ్ చేయండి. మసాలా ఛాయ్ త్రాగడానికి ముందు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

క్యాన్సర్ ను నివారిస్తుంది:

క్యాన్సర్ ను నివారిస్తుంది:

పరిశోధనల ప్రకారం, ఒక కప్పు బ్లాక్ మసాలా ఛాయ్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

మసాలా టీలోని స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

నిజం, మసాలా ఛాయ్ కొన్ని పౌండ్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. రెండు కప్పుల మసాలా టీని త్రాగడం వల్ల, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

ప్రీమెనుష్ట్రువల్ క్రాంప్స్ నివారిస్తుంది:

ప్రీమెనుష్ట్రువల్ క్రాంప్స్ నివారిస్తుంది:

మసాలా ఛాయ్ లో ఉన్న కొన్ని రకాల ఏజెంట్స్ మహిళల్లో రుతుక్రమంలో వచ్చే సమస్యలను నివారిస్తుంది . మరియు కడుపులోని కండరాలను బలోపేతం చేస్తుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

మసాలా టీలోని లవంగాలు, దాల్చిన చెక్క మరియు యాలకలు శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటిని పెంచి డయాబెటిస్ ను నివారిస్తుంది. అయితే టీలో షుగర్ వేయకుండా టీ తాగాలి.

 మెటబాలిజం:

మెటబాలిజం:

మసాలా టీ హీట్ ను ఉత్పత్తిని చేసే ఒక పానియం. కాబట్టి, మీలో మెటబాలిజం రేటును నేచురల్ గా పెండంలో సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తుంది :

బ్లడ్ ప్రెజర్ నియంత్రిస్తుంది :

మీరు నిరంతరం బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే, మసాలా టీ రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. ఒక కప్పు మసాలా టీ రక్తపోటును రెగ్యులేట్ చేస్తుంది.

గుండెకు మేలు చేస్తుంది:

గుండెకు మేలు చేస్తుంది:

మసాలా టీ రక్తనాళాలలో మరియు రక్తనాళాల యొక్క గోడ మీద రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

జీర్ణక్రియకు మంచిది:

జీర్ణక్రియకు మంచిది:

మసాలా టీలో ఉన్న మసాలాలు జీర్ణక్రియను మేలు చేస్తుంది. మసాలా టీలో వేసి అల్లం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వ్యాధినిరోధకతకు మేలు చేస్తుంది:

వ్యాధినిరోధకతకు మేలు చేస్తుంది:

మీలో వ్యాధినిరోధకతను మెరుగుపరుచుకోవాలంటే, మసాలా టీ ఒక ఉత్తమ పరిష్కారం మార్గం. మసాలా టీలో జోడీంచే లవంగాలు, దాల్చిన చెక్క వంటివి వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతాయి. వేసవిలో ఎదురయ్యే కామన్ ఇన్ఫెక్షన్ నివారిస్తాయి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

మసాలా ఛాయ్ లో ఉండే మసాలాలు మీ శరీరంలో ఎటువంటి నొప్పి, బాధనైనా నేచురల్ గా తగ్గిస్తుంది. మీకు శక్తిని అంధిస్తుంది: మీరు ఎనర్జీలేకుండా బలహీనంగా ఉన్నట్లైతే, అటువంటి సమయంలో ఒక కప్పు మసాలా ఛాయ్ ను సిప్ చేయండి . మసాలా టీలో ఉండే ట్యానింగ్ మసాలా ప్రశాతం పరిచి, మీకు కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.

ముక్కు దిబ్బడ నివారిస్తుంది:

ముక్కు దిబ్బడ నివారిస్తుంది:

జలుబుతో ముక్కలు మూసుకునిపోయి, దగ్గు, ఉన్నప్పుడు, ఈ మసాలా టీ ఒక ఉత్తమ హోం రెమెడీ. మసాలా టీలో వేసి, యాలకలు, అల్లం వంటివి నోస్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Is Masala Chai Healthy?

Is masala chai healthy? If you have any doubts, read on to know about the health benefits of masala chai...
Story first published: Saturday, February 11, 2017, 16:19 [IST]
Desktop Bottom Promotion