For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం మిల్క్ లో దాగున్న టాప్ 10 హెల్త్ సీక్రెట్స్..!

బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

|

బాదం పాలు అనగానే మార్కెట్ లో జ్యూస్ బండ్లపై అమ్మే బాదం పాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా అందరూ అక్కడే బాదం పాలు తాగుతారు. లేదంటే టీ స్టాల్ వద్ద బాదం పొడి కలిపి, బాదం టీ అమ్ముతారు. కానీ ఇళ్లలో బాదం పాలు లేదా బాదం టీ తాగే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. దీని వల్ల అంతగా కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటి అని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పైగా బాదం పాలు అంటే ఓ లగ్జరీ మిల్క్ లా ఫీల్ అవుతారు. నిజానికి బాదం పాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది.

Top Benefits Of Almond Milk For Total Body Health

బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలి.. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. అంతే బాదం పాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. బాదం పాలలో ప్రోటీనులు మరియు క్యాల్షియం తక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు బాదం పాలలో 1గ్రామ్ ప్రోటీలుంటే, ఆవు పాలలో 8గ్రాములుంటాయి. అలాగే బాదం మిల్క్ లో క్యాల్షియం 3mg ఆవు పాలలో క్యాల్షియం 300mg ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ క్యాల్షియం లోపం ఉన్న వారు సాధ్యమైనంత వరకూ బాదం పాలు తీసుకోవడం మంచిది.

బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్‌లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది. అందువల్ల ఇది హార్ట్ డిసీజ్ లను మరియు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. ఇకపోతే.. బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. బరువు తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.ఇంకా జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి ఆవు పాలతో సమానం. ఇన్ని పోషకాంశాలున్న బాదం పాలను తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

న్యూట్రీషియన్స్ అధికం:

న్యూట్రీషియన్స్ అధికం:

బాదం మిల్క్ లో విటమిన్ డి, క్యాల్షియం, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా విటమిన్స్, మినిరల్స్, మరియు విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది.

 హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్ , కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల హార్ట్ కు మంచిది. సోడియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హైబ్లడ్ ప్రెజర్ తగ్గించి, హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది.

డయాబెటిక్ ఫ్రెండ్లీ:

డయాబెటిక్ ఫ్రెండ్లీ:

బాదం పాలలో గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసి డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది

ఎముకలును రక్షిస్తుంది:

ఎముకలును రక్షిస్తుంది:

బాదం పాలలో క్యాల్షియం 50శాతం ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

మజిల్ బిల్డ్ చేస్తుంది:

మజిల్ బిల్డ్ చేస్తుంది:

బాదం మిల్క్ లో విటమిన్ బి , ఐరన్, రిబోఫ్లెవిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మజిల్స్ బిల్డ్ చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ డి ఎక్కువ:

విటమిన్ డి ఎక్కువ:

వరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల ఎముకల పెళుసుబారడం , విరగడం, వీక్ మజిల్ బోన్స్ కు కారణముతుంది. బాదం పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్యను నుండి బయటపడవచ్చు.

చర్మ సమస్యలను నివారిస్తుంది :

చర్మ సమస్యలను నివారిస్తుంది :

బాదం పాలలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ హెల్తీగా మార్చుతుంది. ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది

బాదం పాలను ఫ్రిజ్ స్టోర్ చేసుకోవచ్చు:

బాదం పాలను ఫ్రిజ్ స్టోర్ చేసుకోవచ్చు:

బాదం పాలను ఫ్రిజ్ లో ఉంచుకోవడం వల్ల చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి, ఒకటి రెండు రోజులకు సరిపడా తయారుచేసుకుని నిల్వ చేసుకోవచ్చు.

క్యాలరీలు తక్కువ:

క్యాలరీలు తక్కువ:

బాదం పాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. న్యూట్రీషియన్స్ కావల్సినన్ని పొందుతారు. దాంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. 10. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది

బాదం పాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరచడంతో పాటు, మలబద్దాన్ని నివారిస్తుంది.

English summary

Top Benefits Of Almond Milk For Total Body Health

Almond milk is something that has been making the rounds recently. From doctors to health experts, everyone's shifting from having cow's milk to almond milk.
Desktop Bottom Promotion